రక్షణ మంత్రిత్వ శాఖ
తుపాను టోక్టేః భారతీయ పశ్చిమ తీరం వెంట బహుళ అన్వేషణ, సహాయక మిషన్లను నిర్వహిస్తున్న భారతీయ నావికా దళం
Posted On:
17 MAY 2021 6:40PM by PIB Hyderabad
అరేబియా సముద్రంలో కర్నాటకలోని మంగళూరుకు వాయువ్య దిశలో చిక్కుకున్న భారతీయ నౌక కోరమాండల్ సపోర్టర్ IX లోని సిబ్బంది తమను కాపాడమంటూ ఇచ్చిన ఎస్ఒఎస్‌కు తక్షణమే స్పందించి, రక్షించేందుకు నావికాదళ హెలికాప్టర్‌ను మే 17వ తేదీ తెల్లవారుజామున పంపారు. తుపాను టోక్టే కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో నౌక యంత్ర సామాగ్రి ఉన్న కంపార్ట్‌మెంటులోకి వరదలా నీరు ప్రవేశించి, చోదనం, విద్యుత్ సరఫరాను ఆటంకపరిచాయి, సిబ్బంది కూడా ఎటువంటి మద్దతు లేకపోవడంతో నౌకలోనే మిగిలిపోయారు. పడవల ద్వారా వారిని కాపాడే ప్రయత్నాలు అనేకసార్లు విఫలం కావడంతో భారతీయ నావికా దళ హెలోను 17 మే 21 తెల్లవారుజమున పంపారు. నలుగురు సిబ్బందిని హెలో సురక్షితంగా పైకి లాగగలిగారు.
సుమారు 273మంది సిబ్బందితో బాంబే హై ప్రాంతంలోని హీరా చమురు క్షేత్రం నుంచి కొట్టుకుపోయిన బార్జ్ పి 305 నుంచి సహాయం కోసం విజ్ఞప్తి అందుకున్న తర్వాత, పరిస్థితిని అంచనా వేసి, తగిన సహాయాన్ని అందించేందుకు ఐఎన్ఎస్ కొచ్చి తక్షణమే బయలుదేరి వెళ్లింది. ఐఎన్ఎస్ తల్వార్ కూడా బయలుదేరి వెళ్ళేందుకు సిద్ధం అవుతోంది.
దాదాపు 137మంది వ్యక్తులతో ముంబైకి 8 నాటికల్ మైళ్ళ దూరంలో కొట్టుకుపోతున్న బార్జ్ జిఎఎల్ కనస్ట్రక్టర్ నుంచి వచ్చిన ఎస్ఒఎస్ కు స్పందనగా, ఐఎన్ఎస్ కోల్‌కతా కూడా సాయాన్ని అందించేందుకు బయలుదేరింది.
టోక్తే తుఫానును ఎదుర్కొనేందుకు ఏర్పాట్లను కొనసాగిస్తూ, రాష్ట్ర అధికారుల నుంచి ఎటువంటి విజ్ఞప్తి వచ్చినా, వెంటనే మోహరించేందుకు 11 భారతీయ నావికాదళ డైవింగ్ బృందాలను సిద్ధంగా ఉంచారు.వీరితో పాటుగా 12 వరద సహాయ బృందాలు, వైద్య బృందాలను కూడా తక్షణమే స్పందించి, మోహరించేందుకు కేటాయించారు. తుపాను అనంతరం అవసరమైతే తక్షణమే మౌలిక సదుపాయాల మరమ్మతుల నిమిత్తం మరమ్మతు, రక్షణ బృందాలను సృష్టించారు.
పశ్చిమ తీరంలో వివిధ నౌకలు దెబ్బతిన్న ప్రాంతాలలో అవసరమైనంత మేరకు తక్షణ తోడ్పాటు కోసం సహాయ సామాగ్రితో నిలిచి ఉన్నాయి. దీనితో పాటుగా అల్లకల్లోలంగా ఉన్న వాతావరణం కారణంగా సముద్రంలో చిక్కుకుపోయిన చిన్న ఫిషింగ్ బోట్లు/ చిన్న పడవలను కాపాడేందుకు వీరు ప్రయత్నిస్తారు.
నిఘాలో ఉన్న నావికాదళానికి చెందిన మారిటైమ్ రీకనె్నసానన్స్ విమానాలు మత్స్యకారులకు నిరంతరం తుపాను హెచ్చరికలను ప్రసారం చేస్తున్నాయి.
ఇంతకు ముందు తెలిపినట్టుగా, నావికాదళాలు సహాయక కార్యకలాపాలను కేరళలోని కొచ్చిలో కూడా చేపట్టారు. వరద కారణంగా చిక్కుకుపోయిన స్థానిక ప్రజలకు సహాయాన్ని అందించేందుకు దక్షిణ నావికాదళ కమాండ్‌కు చెందిన మూడు డైవింగ్ టీంలను, క్విక్ రియాక్షన్ టీమ్‌లను చెల్లానం (కొచ్చి) వద్ద మోహరించారు. భారీగాలు నీరు నిలిచిపోవడంతో ఇతర వాహనాలు ప్రయాణించలేని ప్రాంతంలోని సహాయక శిబిరాలకు ఈ బృందాలు ఆహారం, నీరు, నిత్యావసర వస్తువులనుచేరవేశాయి. ఇళ్లలో చిక్కుకు పోయిన ప్రజలను వారి ఇళ్ళనుంచి జెమినీ రబ్బర్ క్రాఫ్ట్‌లలో ఎర్నాకుళం, చెల్లానంలో ఎత్తైన ప్రదేశాలలో ఉన్న సహాయక శిబిరాలకు తీసుకువెళ్ళారు. నీరు నిలిచిపోయిన కారణంగా పూర్తిగా అందుబాటులో లేకుండా పోయిన చెల్లానంలోని కోర్టినా ఆసుపత్రికి మంచినీరు, ఇతర అత్యవసర వస్తువులను నావికాదళ బృందం చేరవేసింది.
***
(Release ID: 1719553)
Visitor Counter : 130