ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ చికిత్స‌కు వినియోగించే 2-డీజీ ఔష‌ధాన్ని విడుద‌ల చేసిన కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి


- డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబొరేట‌రీస్ వారి సౌజ‌న్యంతో రూపొందించిన ర‌క్ష‌ణ ప‌రిశోధ‌న అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)

- సగటు రికవరీ సమయాన్ని 2.5 రోజులు.. ఆక్సిజన్ డిమాండ్‌ను 40 శాతం మేర తగ్గించ‌నున్న ఔష‌ధం

- కోవిడ్‌పై చేస్తున్న పోరులో ఈ రోజు చారిత్రాత్మ‌క రోజుగా నిలుస్తుందిః డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌

- దేశీయంగా తొలిసారి కోవిడ్ చికిత్స ఔష‌ధాన్ని అభివృద్ధి చేసేందుకు గాను
విశేషంగా ప్ర‌య‌త్నించిన శాస్త్రవేత్తలను ప్ర‌శంసించిన కేంద్ర ఆరోగ్య మంత్రి

Posted On: 17 MAY 2021 6:46PM by PIB Hyderabad

కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు డీఆర్‌డీఓ భవన్‌లో దేశీయంగా త‌యారు చేసిన కోవిడ్ ఔష‌ధం 2-డీజీని విడుదల చేశారు. ఈ స‌రికొత్త కోవిడ్ ఔషధపు 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-డీజీ), అనువర్తనాన్ని హైద‌రాబాద్‌కు చెందిన డాక్ట‌ర్ రెడ్డీస్ లాబొరేట‌రీ (డీఆర్ఎల్‌)తో క‌లిసి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఐఎన్ఎంఏఎస్‌), ర‌క్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. స‌రికొత్త 2-డీజీ ఔష‌ధం తొలి సాచెట్ల పెట్ట‌ను న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డైరెక్ట‌ర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు, కేంద్ర ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (ఏఎఫ్ఎంఎస్‌) లెఫ్టినెంట్ జనరల్ శ్రీ సునీల్ కాంత్‌కు అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ ఈ రోజు కోవిడ్ వ్యతిరేకంగా మ‌నం చేస్తున్న‌ పోరాటంలో ఒక చారిత్రాత్మక రోజు అని వ్యాఖ్యానించారు. దేశీయంగా తొలిసారి కోవిడ్-19 చికిత్స ఔష‌ధాన్ని అభివృద్ధి చేసేందుకు గాను విశేషంగా ప్ర‌య‌త్నించిన శాస్త్రవేత్తల కృష్టిని ప్ర‌శంసించారు.
ఔషధం అభివృద్ధి చేసినందుకు వారి చూపిన సహనం మరియు పట్టుదలను మరియు డీఆర్‌డీఓ కృషిని అభినందించారు. కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా
మ‌నం చేస్తున్న పోరులో ఇది ఒక స‌రికొత్త అధ్య‌యానికి తెర తీసే అవకాశం ఉందని అన్నారు. ఈ ఔష‌ధం ఆక్సిజన్‌పై రోగుల ఆధారపడటాన్ని తగ్గిస్తుంది.
కోవిడ్ చికిత్స‌కు ఈ ఔష‌ధం ఎంతో విభిన్నంగా మరియు ఎంచుకున్న పద్ధతిలో ప‌ని చేసే అవకాశం ఉంది. కోవిడ్ సోకిన వివిధ కణాలలో ఇది వైరస్ సంశ్లేషణ మరియు ప్రక్రియ కోసం శక్తి ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఈ ఔషధం యొక్క క్లినికల్ ట్రయల్స్‌లో ముప్ప‌యి ఆస్పత్రులు పాల్గొన్నాయని మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ పేర్కొన్నారు. స‌రికొత్త ఔషధం ఎంపిక చేసి కణాల్లోకి వెళ్లి వైరస్ సంశ్లేషణను నివారిస్తుంది. కోవిడ్ రోగులు కోలుకునే సమయాన్ని తగ్గిస్తుందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా డాక్టర్ హర్ష్ వర్ధన్ రక్షణ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ, డీఆర్‌డీఓ కృషి కారణంగా ఢిల్లీ, దేశవ్యాప్తంగా అనేక పీఎస్ఏ
ప్లాంట్లను విజయవంతంగా ఏర్పాటు చేయ‌డ‌మైంద‌ని తెలిపారు. మ‌న సమిష్టి ప్రయత్నాల ద్వారా మరియు కోవిడ్‌కు తగిన ప్రవర్తనను అనుసరించడం ద్వారా మ‌నం మ‌హ‌మ్మారికి వ్యతిరేకంగా జ‌రుపుతున్న‌ యుద్ధంలో త‌ప్ప‌క విజ‌యాన్ని సాధిస్తామని చెప్పారు. కోవిడ్‌పై పోరుకు స‌రికొత్త‌గా రూపొందించిన ఈ ఔష‌ధం
రోగులను ప్రాణాంతక వైరస్ నుంచి బయటపడేయ‌టంలో సహాయపడుతుందని రక్షణ శాఖ ఆర్‌అండ్‌డీ విభాగం కార్య‌ద‌ర్శి, డీఆర్‌డీఓ ఛైర్మ‌న్ డాక్టర్ జి స‌తీష్ రెడ్డి విశ్వాసం వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌కు చెందిన డీఆర్ఎల్ కోవిడ్‌-19 మందును ముందుకు తీసుకెళ్లి త్వరలోనే రోగులకు అందుబాటులోకి తేగ‌ల‌ద‌న్న‌
విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఈ కార్యక్రమంలో వ‌ర్చువ‌ల్ విధానంలో పాల్గొన్న డీఆర్‌ఎల్ ఛైర్మన్ శ్రీ కల్లం సతీష్ రెడ్డి మాట్లాడుతూ “ 2-డీజీ అభివృద్ధిలో డీఆర్‌డీఓ మరియు ఐఎన్ఎంఏఎస్ సంస్థ‌లతో భాగస్వామ్యం కావడం డాక్ట‌ర్ రెడ్డి సంస్థ‌కు ఆనందంగా ఉంద‌న్నారు. కోవిడ్ చికిత్స ఔష‌ధం, వ్యాక్సిన్ ద్వారా మ‌హ‌మ్మారిని రూపుమాపేందుకు స‌మ‌స్య‌ను పరిష్కరించడానికి.. త‌మ‌ కంపెనీ చేస్తున్న వివిధ‌ ప్రయత్నాలను పున‌రుద్ఘాటిస్తుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ రాజేష్ భూషణ్, హెల్త్ సర్వీసెస్ డీజీ డాక్టర్ సునీల్ కుమార్, ఎయిమ్స్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డీఆర్ఎల్ సంస్థ ఛైర్మన్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ డైరెక్ట‌ర్ డాక్టర్ రాకేశ్ మిశ్రాతో పాటుగా దేశ వ్యాప్తంగా అనేక మంది వైద్యులు, ఆసుపత్రుల వారు మరియు ప్రయోగశాలల వారు ఈ కార్యక్రమంలో వ‌ర్చువ‌ల్ విధానంలో పాల్గొన్నారు. 

 

***

 



(Release ID: 1719552) Visitor Counter : 189


Read this release in: English , Urdu , Hindi