ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

పట్టణ శివార్లు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ కట్టడి, చికిత్సా నిర్వహణపై భేటీ

రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు
కీలక నిబంధనావళిపై కేంద్రం నిర్దేశం

మ్యూకోర్ మైకోసిస్ వంటి సంక్లిష్ట వ్యాధుల చికిత్సపై చర్చ

CoWIN పోర్టల్.లో మార్పులు, వ్యాక్సినేషన్ నియమాలపై సమీక్ష

Posted On: 16 MAY 2021 9:28PM by PIB Hyderabad

 

  అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో ఈ రోజు జరిగిన అత్యున్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్.కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతీ ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వినోద్ కె. పాల్ అధ్యక్షత వహించారు. పట్టణాల శివార్లు, గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ వైరస్ కట్టడి, చికిత్సా నిర్వహణ పద్ధతులు, తదితర అంశాలపై ఈ సమావేశంలో దృష్టిని కేంద్రీకరించారు. కోవిడ్ చికిత్సతో పాటుగా, మ్యూకోర్-మైకోసిస్ ఫంగై వ్యాధికి చికిత్సను మరింత పటిష్టం చేయాల్సిన అంసంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. పలు రాష్ట్రాల్లో మ్యూకోర్ మైసిస్ ఫంగై కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చికిత్సపై కూడా సమావేశంలో చర్చించారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కోవిడ్ కేసులు, మరణాలు నమోదు అవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.  పాజిటివిటీ రేటు, మరణాలు పెరగడం, టెస్టుల సంఖ్య తగ్గడం వంటి పరిణామాల మధ్య ఈ చర్చకు ప్రాధాన్యత ఏర్పడింది.

  కేంద్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, జాతీయ ఆరోగ్య పథకం మిషన్ డైరెక్టర్, ఆయా రాష్ట్రాల సర్వివలెన్స్ అధికారులు పాల్గొన్నారు. అలాగే,..కేంద్ర ఆరోగ్య పరిశోధనా శాఖ కార్యదర్శి, భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐ.సి.ఎం.ఆర్.) డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ బలరామ్ భార్గవ, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ ప్రొఫెసర్ రణదీప్ గులేరియా, అదనపు కార్యదర్శి, జాతీయ ఆరోగ్య పథకం మైనేజింగ్ డైరెక్టర్ వందనా గుర్నానీ,  జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్.సి.డి.సి.) డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె. సింగ్ ఈ వీడియో కాన్ఫరెన్సులో పాలుపంచుకున్నారు.

  పట్టణ, నగర శివార్లు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో పొందుపరిచిన నిబంధనావళిని గురించి రాష్ట్రప్రభుత్వాలకు ఈ సమావేశంలో తెలియజేశారు.:

https://www.mohfw.gov.in/pdf/SOPonCOVID19Containment&ManagementinPeriurbanRural&ribalareas.pdf

  వివిధ రాష్ట్రాల్లో ఈ కింది అంశాలకు సంబంధించి చేపట్టవలసిన చర్యలను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ కార్యదర్శి నేటి సమావేశంలో వివరించారు.:

 

  1. వైరస్ కట్టడి, వైరస్ వ్యాప్తిపై నిఘా, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు (ఆర్.ఎ.టి.), ఆర్.టి.-పి.సి.ఆర్. టెస్టుల వినియోగం, టెలికన్సల్టేషన్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసే నిబంధనలు వంటి అంశాలపై క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బందికి, ప్రత్యేకించి వైద్యాధికారులకు, కంటెయిన్మెంట్ విధుల్లో ఉన్న బ్లాక్ స్థాయి నోడల్ అధికారులకు అవగాహన కల్పించవలసి ఉంది. ఇదే అంశాలపై వైద్యాధికారులతో, బ్లాక్ స్థాయి నోడల్ అధికారులతో ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు రేపటినుంచి ప్రతి రోజూ సమీక్షా సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వం జారీ చేసే సూచనలు, నిబంధనలు అట్టడుగుడున ఉన్న గ్రామాల స్థాయికి చేరుకునేలా చేసే లక్ష్యంతో ఈ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. కోవిడ్ సోకినట్టుగా అనుమానించే వారిని సకాలంలో ఏకాంత వాసం కల్పించే అంశం, సరైన చికిత్స అందించేందుకు వీలు కలిగించే ఆర్.ఎ.టి.ని ఉపయోగించే అంశంపై క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కూడా రాష్ట్రాలకు సూచించారు.

 

  1. కోవిడ్ అంశంపై ఆశా కార్యకర్తలకు, ఆగ్జిలియరీ నర్సింగ్ మిడ్వైఫ్స్.కు, పంచాయతీ రాజ్ సంస్థల సిబ్బందికి, సామాజిక ఆరోగ్య అధాకిరులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు సమావేశాలు, చర్చా గోష్టులు నిర్వహించవలసి ఉంటుంది. కోవిడ్ వ్యాధి లక్షణాలను సత్వరం గుర్తించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలు వారికి తగిన శిక్షణ ఇప్పించాలని సమావేశంలో సూచించారు.

 

  1. కోవిడ్ వ్యాధి లక్షణాలను, వ్యాధి నిరోధక చర్యలను గురించి అవగాహన కల్పించేందుకు, ఈ  సమాచారాన్ని మరింత విస్తృతం చేసేందుకు, కోవిడ్ కట్టడి లక్ష్యంగా రూపొందించిన నియమ నిబంధనలను ప్రచారం చేసేందుకు మహిళా స్వయం సహాయక బృందాల (ఎస్.హెచ్.జి.ల) సేవలను వినియోగించుకోవాలి.  వారితో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం సాధించాలి.

 

  1. ఈ విషయంలో రాష్ట్రాలు గ్రామ స్థాయి ఆరోగ్య, పారిశుద్ధ్య కమిటీల సేవలను, గ్రామ సభ సేవలను ఆయా రాష్ట్రాలు వినియోగించువలసి ఉంటుందని రాష్ట్రాలకు సూచించారు.

 

   గ్రామీణ ప్రాంతాల్లోకి, పట్టణ, నగర శివార్ల ప్రాంతాల్లోకి కోవిడ్ ఇన్ఫెక్షన్ కేసులు క్రమంగా చొచ్చుకుపోవడంతో, పరిస్థితిని ఎదుర్కొనడంలో సామాజిక ప్రాతిపదిక అందించే సేవలకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పి.హెచ్.సి.) స్థాయి సేవలకు ఏర్పడిన ప్రాధాన్యత,.. సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. వైరస్ వ్యాప్తిని పసిగట్టడం, పరీక్షలు జరపడం, రోగులను ఐసొలేట్ చేయడం, ఇళ్లలోనే ఐసొలేషన్ లో ఉంటున్న కేసులను పర్యవేక్షించడం, కోవిడ్ చికిత్సపై వారికి సమాచార కరపత్రాలను అందించడం, కోవిడ్ నుంచి ఆరోగ్య రక్షణకు సంబంధించిన మూడు స్థాయిల్లోనూ సదుపాయాలను బలోపేతం చేయడం, అందుకు అనుసరించవలసిన యంత్రాంగం తదితర అంశాలపై ఈనాటి సమావేశంలో విపులంగా చర్చించారు. ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్ లైన్ (ఐగోట్) దీక్షా పోర్టల్ వినియోగం ద్వారా వలంటీర్లకు శిక్షణ కల్పించడం, ఐ.ఇ.సి. పద్ధతిని వినియోగించి అగాహన కల్పించడం తదితర అంశాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను గురించి చర్చించారు. తమ అనుభవంలోకి వచ్చిన ఉత్తమ మార్గాలను, అంశాలను రాష్ట్రాలు తమ తోటి  భాగస్వామ్య వర్గాలతో పంచుకోవాలని, టెలి కన్సల్టేషన్ సామర్థ్యాన్ని రాష్ట్రాలు మరింత బలోపేతం చేసుకోవాలని కూడా సూచించారు.

  కోవిడ్ చికిత్సతో సంబంధంలేని ఇతర అత్యవసర వ్యాధుల చికిత్సకోసం ఆరోగ్యరక్షణ వ్యవస్థలను నిరాటంకంగా కొనసాగించడం, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే చర్యలకు సమాంతరంగా ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.

  ఐ.సి.ఎం.ఆర్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరాం భార్గవ ఈ సమావేశంలో మాట్లాడుతూ, ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు (ఆర్.ఎ.టి.)ల ప్రాధాన్యతను గురించి వివరించారు. కోవిడ్ కేసుల వ్యాప్తిని భారీ స్థాయిలో పరిశీలించేందుకు, కేసుల ఇన్ఫెక్షన్.ను త్వగా గుర్తించేందుకు ఈ టెస్టులను వినియోగించుకోవాలని సూచించారు. తక్కువ వ్యవధిలోనే ఫలితం తెలుసుకునేందుకు ఈ టెస్టులో ఉన్న అవకాశాన్ని వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు వినియోగించుకోవాలన్నారు. మధుమేహం తదితర దీర్ఘవ్యాధులతో బాధపడే వారిని గుర్తించేందుకు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్రాలకు సూచించారు.

  ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ, వ్యాధి సంక్రమణను తక్షణం నియంత్రించడం చాలా అవసరమన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కోవిడ్ వైరస్ విస్తరించడంతో వ్యక్తిగత రక్షణ పరికరాలు(పి.పి.ఇ. సూట్లు, మాస్కుల) వినియోగంలో నిబంధనలను సరిగా పాటించడంలేదని, దీనితో అక్కడ నియమితులైన ఆరోగ్య రక్షణ కార్యకర్తలకు కూడా వైరస్ సోకే ఆస్కారం ఏర్పడిందని గులేరియా చెప్పారు. ఈ విషయంలో నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. మరణాలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా తీవ్రమైన అస్వస్థత కేసుల విషయంలో ఆరోగ్య వ్యవహారాల పరిపాలనా సిబ్బందికి తగిన తర్ఫీదు ఇవ్వాలని గులేరియా రాష్ట్రాలకు సూచించారు. 

  కోవిడ్ కేసులు సంక్లిష్టమవుతున్న వార్తలు పలు రాష్ట్రాలనుంచి వెలువడుతున్న నేపథ్యంలో స్టెరాయిడ్ మందులను అతిగా వినియోగించడం అరికట్టాలని సూచించారు. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినపోయిన తీవ్రమైన అస్వస్థత కేసుల్లో మాత్రమే స్టెరాయిడ్ మందులు వినియోగించాలని, అదీ వరుసగా పదిరోజులకు మించి వాటిని వాడరాదని ఆయన సూచించారు. నేత్రవైద్యులు, న్యూరో సర్జన్లు, ఇతర ప్రత్యేక వైద్య విభాగాల నిపుణుల ప్రమేయం ఉన్న మ్యూకోర్ మైకోసిస్ ఫంగై వ్యాధి చికిత్స గురించి కూడా ఆయన వివరంగా ప్రస్తావించారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో సమస్య తలెత్తిన తర్వాత చికిత్స చేయడం కంటే అసలు సమస్య రాకుండానే ముందస్తుగా నిరోధక చర్యలు తీసుకోవడమే మంచిదని గులేరియా సూచించారు.

  వ్యాక్సినేష్ కోసం కోవిన్ (CoWIN) పోర్టల్ లో పొందుపరిచిన మార్పులను గురించి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజెప్పారు. కోవిన్ పోర్టల్ కేవలం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారికి మాత్రమే ఉపయోగపడేలా పక్షపాతంతో రూపొందించారన్న అపోహను తొలగించుకోవాలని, ఆ పోర్టల్ ను రిజిస్ట్రేషన్ కోసం సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు. ముందుగా సూచించిన తేదీల్లో అర్హులైన వారికి వ్యాక్సినేషన్ అందించేందుకు వీలుగా ఆశా కార్యకర్తలను, ఆగ్జిలియరీ నర్సింగ్ మిడ్వైఫ్స్.ను సమీకరించుకోవాలని అన్నారు. అర్హులైన వివిధ వయస్సుల ప్రజలను వ్యాక్సినేషన్ కేంద్రాలకు రప్పించి, అక్కడిక్కడే వారి పేర్లను రిజిస్ట్రేషన్ చేయించి, వ్యాక్సినేషన్ జరిగేలా చూసేందుకు వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. అలాగే, బ్లాక్ స్థాయి వైద్యాధికారుల ద్వారా, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా కూడా వ్యాక్సినేషన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్లు సాగించవచ్చని సూచించారు.

ప్రత్యేకించి 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరినీ న్యాక్సినేష్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు తీసుకోవలసిన ఇతర చర్యలపై కూడా ఈ నాటి సమావేశంలో ప్రధానంగా చర్చించారు.

మిగిలిన ఇతర వనరులపై కూడా సమావేశంలో మరో సారి చర్చించారు.

వలంటీర్ల శిక్షణ కలించే అనుసరించాల్సిన వ్యూహాత్మక పద్ధతులు:

https://www.mohfw.gov.in/pdf/TrainingresourcesforCOVID1930MARCH.pdf

https://diksha.gov.in/igot/

https://www.mohfw.gov.in/pdf/iGOTCovid19Circular(2).pdf

టెలిమెడిసిన్ మార్గదర్శక సూత్రాలు:

https://www.mohfw.gov.in/pdf/Telemedicine.pdf

కాంటాక్ట్ ట్రేసింగ్ పై అనుసరించే సమగ్ర వ్యాధి నిఘా కార్యక్రమం(ఐ.డి.ఎస్.పి.)లో పాటించాల్సిన మార్గదర్శక సూత్రాలు: https://www.ncdc.gov.in/showfile.php?lid=570

వ్యాధిసంక్రమణ, ముందస్తు నిరోధక చర్యలపై, ఆరోగ్య రక్షణవ్యవస్థ ద్వారా తీసుకునే నియంత్రణ చర్యలపై జాతీయ మార్గదర్శక సూత్రాలు:

https://www.mohfw.gov.in/pdf/National%20Guidelines%20for%20IPC%20in%20HCF%20-%20final%281%29.pdf

పి.పి.ఇ. కిట్ల హేతుబద్ధ వినియోగంపై మార్గదర్శక సూత్రాలు: https://www.mohfw.gov.in/pdf/GuidelinesonrationaluseofPersonalProtectiveEquipment.pdf

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సి.పి.సి.బి.) ఆధ్వర్యంలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ: https://cpcb.nic.in/uploads/Projects/Bio-Medical-Waste/BMW-GUIDELINES-COVID_1.pdf

స్వల్ప లక్షణాల కేసుల డిశ్చార్జి ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శక సూత్రాలు: https://www.mohfw.gov.in/pdf/ReviseddischargePolicyforCOVID19.pdf

కోవిడ్ నుంచి కోలుకున్న అనంతరం బాధితులు పాటించాల్సిన మార్గదర్శక సూత్రాలు: https://www.mohfw.gov.in/pdf/PostCOVID13092020.pdf

 

***


(Release ID: 1719317) Visitor Counter : 170


Read this release in: English , Urdu , Hindi , Marathi