ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రజలకు ఉపరాష్ట్రపతి శుభాకాంక్ష‌లు

Posted On: 13 MAY 2021 3:33PM by PIB Hyderabad

 

ఈద్-ఉల్-ఫితర్ ప‌ర్వ‌దినం సందర్భంగా ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఉప‌రాష్ట్రప‌తి సందేశం యొక్క పూర్తి వచనం ఈ క్రింది విధంగా ఉంది-
"ఈద్-ఉల్-ఫితర్ యొక్క సంతోషకరమైన సందర్భంగా మన దేశ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు శుభాభినంద‌న‌లు తెలియజేస్తున్నాను.
ఈద్-ఉల్-ఫితర్ పవిత్ర రంజాన్ మాసం ముగింపును సూచిస్తుంది. సమాజంలో సోదర‌భావాన్ని మరియు సమైక్యతను సూచిస్తుంది. ఈ పండుగ మన జీవితంలో కరుణ, దాతృత్వం, ఔధార్యం యొక్క ఆత్మ, ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తుంది.
మన దేశంలో పండుగలు ఎల్లప్పుడూ కుటుంబం మరియు స్నేహితుల‌ను కలిసి వచ్చి వేడుకలు జరుపుకునే సందర్భం. కోవిడ్‌-19 మహమ్మారి యొక్క పరిస్థితిని బట్టి, కోవిడ్‌ ఆరోగ్యం మరియు పరిశుభ్రత ప్రోటోకాల్‌లకు కట్టుబడి పండుగను జరుపుకోవాలని నాతోటి పౌరులను కోరుతున్నాను. ఈద్-ఉల్-ఫితర్ ప‌ర్వ‌దినంతో ముడిపడి ఉన్న గొప్ప ఆదర్శాల‌తో మన జీవితాలను మేటి శాంతి, సామరస్యం మరియు మానవత్వం యొక్క ఆత్మతో సుసంపన్నం చేద్దాం.”

***(Release ID: 1718434) Visitor Counter : 23