నీతి ఆయోగ్
అనుసంధాన వాణిజ్యం : డిఙటల్ రంగంలో భారతదేశవాసులందరికీ ప్రయోజనం కలిగించేలా ప్రణాళిక ఆవిష్కరణ అంశంపై నివేదికను విడుదల చేసిన నీతి ఆయోగ్, మాస్టర్ కార్డ్.
Posted On:
10 MAY 2021 8:59PM by PIB Hyderabad
అనుసంధాన వాణిజ్యం : డిఙటల్ రంగంలో భారతదేశవాసులందరికీ ప్రయోజనం కలిగించేలా ప్రణాళిక ఆవిష్కరణ అంశంపై నివేదికను నీతి ఆయోగ్, మాస్టర్ కార్డ్ కలిసి ఆవిష్కరించాయి. దేశంలోని 1.3 బిలియన్ ప్రజలందరికీ డిజిటల్ సేవలు అందించడానికి చేపట్టాల్సిన ప్రణాళికపై ఈ నివేదికలో సిఫారసులు చేశారు. ఈ క్రమంలో ఏర్పడే సవాళ్లను ఈ నివేదిక గుర్తించింది.
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజీవ్ కుమార్, సిఇవో అమితాబ్ కాంత్, మాస్టర్ కార్డ్ సీనియర్ ఉపాధ్యక్షులు శ్రీ రవి అరోరా ఇంకా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఐదు సార్లు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి చర్చించిన తర్వాత ఈ నివేదికను రూపొందించారు. వ్యవసాయ రంగం, చిన్న తరహా పరిశ్రమలు, సైబర్ సెక్యూరిటీ , పట్టణాభివృద్ధి మొదైలన రంగాల్లో విధానాలు, సామర్థ్య నిర్మాణ రంగాల్లోని పలు అంశాలను ఈ నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. మాస్టర్ కార్డ్ మద్దతుతో నీతి ఆయోగ్ నిర్వహించిన ఈ సమావేశాల్లో ప్రభుత్వ ప్రతినిధులతోపాటు, బ్యాంకులు, ఆర్ధిక సహాయ సంస్థల ప్రతినిధులు, ఇంకా పలు ఇతర సంబంధిత రంగాలకు చెందినవారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజీవ్ కుమార్ దేశంలో సాంకేతికరంగ పాత్రను, తద్వారా డిజిటలీకరణను అందరికీ అందుబాటులోకి తేవడంపైనా సమగ్రంగా మాట్లాడారు. దేశవ్యాప్తంగా ప్రజలు నగదు రహిత విధానాలవైపు మల్లుతున్నారని ఆయన అన్నారు.
గత ఏడాది అక్టోబర్ నవంబర్ నెలల్లో పలువురు నిపుణులు జరిపిన చర్చలు ఆధారంగా ఈ నివేదికను తయారు చేశారు. ఇందులో భాగగా చర్చించిన అంశాల్లో ముఖ్యమైనవి ఇలా వున్నాయి.
భారతదేశంలో అణగారిన వర్గాలకు సంబంధించిన డిజిటల్ సౌలబ్యాలను మరింత వేగవంతం చేయాలని నిశ్చయించారు. సూక్ష్మ తరహా పరిశ్రమలకు తగిన చెల్లింపులు, మూలధనం అందుబాటులోకి తేవడం ఆయా సంస్థలు డిజిటల్ పరిధిలోకి రావటం జరగాలి అని ఈ నివేదికలో పేర్కొన్నారు.
డిజిటల్ రంగంపట్ల నమ్మకం పెరిగేలా సాంకేతికపరమైన మార్పులు చేయాలి. సైబర్ పరంగా పటిష్టత తేవాలి. వ్యవసాయరంగంలో డిజిటలీకరణ హామీని అమల్లోకి తేవాలి. దేశంలోని పౌరులందరికీ డిజిటల్ సేవలందాలని నివేదికలో స్పష్టం చేశారు.
కోవిడ్ అనంతర పరిస్థితుల్లో దేశ భవిష్యత్తులో కీలకంగా మారే వ్యాపార విధానాలను ప్రోత్సహించడం, పటిష్టమైన వ్యవస్థలను నిర్మించడం చాలా ముఖ్యమని నీతి ఆయోగ్ సిఇవో శ్రీ అమితాబ్ కాంత్ అన్నారు. డిజిటల్ పరంగా ఆర్ధిక సేవలందించడంలో భారతదేశం ముందడుగు వేస్తోందని దేశంలోని పౌరులందరికీ డిజిటల్ చెల్లింపుల పరిష్కారాలు తీసుకురావడంలో భారతదేశ కృషికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయని ఆయన అన్నారు. ఆర్ధికసాంకేతిక నిపుణులు కీలకపాత్ర పోషిస్తూ పరిశ్రమలకు అవసరమైన రుణాలు అందుబాటులోకి తెస్తున్నారని ఆయన అన్నారు.
ఈ నివేదికలోని ప్రధానమైన సిఫారసుల వివరాలు ఇలా వున్నాయి.
చెల్లింపుల మౌలిక సదుపాయాల వ్యవస్థలను బలోపేతం చేయడంద్వారా ఎన్ బి ఎఫ్ సీలకు తగిన స్థాయిలో పరిస్థితులుండేలా ప్రోత్సహించాలి. ఎంఎస్ ఎంఇల అభివృద్ధికి సంబంధించిన రుణ మార్గాలను విస్తృతం చేయాలి. వినియోగదారులు మోసపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వ్యవసాయరంగ ఎన్ బి ఎఫ్ సిలకు తక్కువ వ్యయంతో కూడిన మూలధనం అందుబాటులో వుండేలా చూడాలి. దీర్ఘకాలిక డిజిటల్ ఫలితాలుండేలా ఫిజిటల్ (ఫిజికల్ + డిజిటల్) విధానం అమలు చేయాలి. భూములకు సంబంధించిన రికార్డులను డిజిటీకరణ చేయాలి. నగరాల్లో ప్రయాణాలు సులభతరం చేయడానికిగాను, గుంపులు, క్యూలు తక్కువగా వుండేలా చూడడానికిగాను స్మార్ట్ ఫోన్లు, కాంటాక్ట్ రహితకార్డుల వినియోగాన్ని పెంచాలి. కోవిడ్ 19 కారణంగా దేశవ్యాప్తంగా డిజిటల్ రంగ ప్రాధాన్యత అందరికీ అర్థమవుతోంది. డిజిటల్ సాంకేతికతల కారణంగా ప్రాధమిక జీవనోపాధి సౌకర్యాల అందుబాటు కొనసాగింది.
పూర్తి నివేదికను చదవాలనుకుంటే..
https://niti.gov.in/writereaddata/files/Connected-Commerce-Full-Report.pdf
***
(Release ID: 1717595)
Visitor Counter : 218