రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సింగపూర్, కువైట్ , ఖతార్ నుండి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ , క్రిటికల్ మెడికల్‌ పరికరాలతో భారతీయ నావికాదళ నౌకలు ఐరావత్, కోల్‌కతా , త్రిఖండ్ భారతదేశానికి చేరుకున్నాయి.

Posted On: 10 MAY 2021 6:01PM by PIB Hyderabad

కోవిడ్ -19 కి వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా చేపట్టిన ఆపరేషన్ 'సముదసేతు II' లో భాగంగా, ఐఎన్ఎస్ కోల్‌కతా న్యూ మంగళూరుకు చేరుకుంది, ఐఎన్ఎస్ త్రిఖండ్ ముంబైలోకి ప్రవేశించింది. ఐఎన్ఎస్ ఐరావత్ సోమవారం విశాఖపట్నం చేరుకుంది.   పెర్షియన్ గల్ఫ్ , సౌత్ ఈస్ట్ ఆసియాలోని స్నేహపూర్వక దేశాల నుండి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ , అనుబంధ వైద్య పరికరాల రవాణా కోసం కొవిడ్ రిలీఫ్ ఆపరేషన్ 'సముద్రసేతు II ’ కోసం మోహరించిన తొమ్మిది నౌకల్లో ఈ నౌకలు భాగం. ఐఎన్ఎస్ ఐరావత్ ఎనిమిది క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకులు , సుమారు 4000 ఆక్సిజన్ సిలిండర్లతో పాటు ఇతర క్లిష్టమైన వైద్య పరికరాలతో సింగపూర్ నుండి విశాఖపట్నం వచ్చింది.

 ఖతార్‌లోని హమద్ పోర్ట్ నుండి ముంబైకి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) క్రయోజెనిక్ కంటైనర్లను రవాణా చేయడానికి ఐఎన్ఎస్ త్రిఖండ్ను నియమించారు. ఈ ఓడ 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్‌తో ముంబై చేరుకుంది. కొవిడ్-19 మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఏర్పాటైన ఫ్రెంచ్ మిషన్ “ఆక్సిజన్ సాలిడారిటీ బ్రిడ్జ్” లోభాగంగా ఈ కంటైనర్లను త్రిఖండ్ తీసుకొచ్చింది. ఐఎన్ఎస్ కోల్‌కతా సోమవారం న్యూ మంగుళూరు నౌకాశ్రయానికి 400 బాటిల్స్ ఆక్సిజన్, రెండు 27 ఎంటీ కంటైనర్ లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, 47  కాన్సంట్రేటర్లను ఖతార్ , కువైట్ల నుంచి తీసుకొచ్చింది.  ఈ నౌకలు మూడు వేర్వేరు రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి ఓడరేవుల్లోకి ప్రవేశించాయి. మరో రెండు యుద్ధనౌకలు కువైట్ నుండి భారతదేశానికి చేరుతున్నాయి.  వైద్య సామగ్రిని తీసుకొని బయల్దేరడానికి ఒక ఓడ బ్రూనై వద్ద ఉంది.

***


(Release ID: 1717555) Visitor Counter : 211


Read this release in: English , Urdu , Hindi , Bengali