కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని రెండు ఆసుపత్రులలో ఇఎస్‌ఐసి ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది; తద్వారా ఈ ఆసుపత్రుల్లో క్లిష్టమైన వైద్య చికిత్స సదుపాయాన్ని పెంచడానికి వీలు కల్పిస్తుంది
కోవిడ్ -19 చికిత్సకు 30 ఆసుపత్రులలో 300 ఐసియు, 250 వెంటిలేటర్ పడకలతో సహా 4200 పడకలు కేటాయించబడ్డాయి
Posted On:
09 MAY 2021 8:05PM by PIB Hyderabad
కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇఎస్‌ఐసి ఢిల్లీ ఎన్‌సిఆర్ ప్రాంతంలోని రెండు ఆసుపత్రులలో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసింది. ఫరీదాబాద్‌లోని ఇఎస్‌ఐసి హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీలో 440 ఎల్‌పిఎం సామర్థ్యం గల ప్లాంట్‌ను ఏర్పాటు చేయగా, 220 ఎల్‌పిఎం సామర్థ్యం గల మరో ప్లాంట్‌ను న్యూఢిల్లీలోని జిల్‌మిల్‌లోని ఇఎస్‌ఐసి ఆసుపత్రిలో ఈ రోజు ప్రారంభించారు. తద్వారా ఈ ఆసుపత్రుల్లో ఐసియు మరియు వెంటిలేటర్ పడకల లభ్యత పెరుగుతుంది.
దేశవ్యాప్తంగా 30 ఆసుపత్రులను అతితక్కువ సమయంలో కోవిడ్ అంకితమైన వైద్యశాలలుగా మార్చడం ద్వారా కోవిడ్ -19 వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కార్పొరేషన్ చురుకుగా సహకారం అందిస్తుంది. ఈ ఆసుపత్రులలో సుమారు 4200 పడకలు ఉన్నాయి. వీటిలో 300 ఐసియు పడకలు కాగా 250 వెంటిలేటర్ పడకలు ఉన్నాయి. ఈ సదుపాయాన్ని దేశ పౌరులందరికీ అందుబాటులో ఉంచారు. ఈ ఆసుపత్రులలో పడకల లభ్యత గురించి లబ్ధిదారులు తెలుసుకోవడానికి డాష్‌బోర్డ్ కూడా ప్రారంభించబడింది.
ఈ ఘనత సాధించినందుకు కేంద్ర సహాయ మంత్రి (ఐ / సి) శ్రీ సంతోష్ గంగ్వార్ ఇఎస్‌ఐసి ఆసుపత్రుల వైద్యులు, నర్సులు మరియు పారా మెడికల్ సిబ్బందిని అభినందించారు. ఈ మహమ్మారి సమయంలో వారు అత్యున్నత సేవలు అందిస్తున్నారని అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
***
(Release ID: 1717420)
Visitor Counter : 152