రైల్వే మంత్రిత్వ శాఖ
మహారాష్ట్ర, ఎంపి, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, యుపిలకు ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ల ద్వారా దాదాపు 4200 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ బట్వాడా
268 ట్యాంకర్లకన్నా ఎక్కువ సరుకు రవాణా
68కి పూగా ప్రయాణాలు పూర్తి
తొలి ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను పొందిన కాన్పూర్
నేటివరకు 293 మెట్రిక్ టన్నులను మహారాష్ట్రకు, 1230 మెట్రిక్ టన్నులు యుపికి, 271 మెట్రిక్ టన్నులు ఎంపికి, 555 మెట్రిక్ టన్నులు హర్యానాకు, 123 మెట్రిక్ టన్నులు తెలంగాణకు, 40 మెట్రిక్ టన్నులు రాజస్థాన్‌కు, 1679 మెట్రిక్ టన్నులు ఢిల్లీకి చేరవేత
Posted On:
09 MAY 2021 4:20PM by PIB Hyderabad
అన్ని ఆటంకాలను అధిగమించి, నూతన పరిష్కారాలను కనుగొంటూ భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు ద్రవరూపంలోని మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఒ)ను చేరవేస్తూ ఉపశమనాన్ని కల్పించే తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.
ఇప్పటివరకూ, భారతీయ రైల్వేలు 268 ట్యాంకర్ల ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 4200 మెట్రిక్ టన్నుఎల్ఎంఒను చేరవేసింది.
ఇంతవరకూ, 68 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు తమ ప్రయాణాన్ని పూర్తి చేశాయి.
ఆక్సిజన్ కోరుతున్న రాష్ట్రాలకు సాధ్యమైనంత స్వల్ప సమయంలో ఎంత సాధ్యమైతే అంత ఎల్ఎంఒను చేరవేసేందుకు భారతీయ రైల్వేలు కృషి చేస్తోంది.
ఈ ప్రకటన వెలువడే సమయం వరకూ, 293 మెట్రిక్ టన్నులను మహారాష్ట్రలో, 1230 మెట్రిక్ టన్నులు యుపిలో, 271 మెట్రిక్ టన్నులు ఎంపిలో, 555 మెట్రిక్ టన్నులు హర్యానా, 123 మెట్రిక్ టన్నులు తెలంగాణ, 40 మెట్రిక్ టన్నులు రాజస్థాన్‌కు, 1679 మెట్రిక్ టన్నులను ఢిల్లీకి చేర్చింది.
ప్రస్తుతం రైల్వేలు కాన్పూర్ వంటి నూతన నగరాలకు ఆక్సిజన్‌ను బట్వాడా చేస్తోంది. సోమవారం నాడు కాన్పూర్ 80 మెట్రిక్ టన్నుల ఎల్ఎంఒను అందుకుంది.
నూతన ఆక్సిజన్‌ను బట్వాడా చేయడం అన్నది క్రియాశీలమైన విషయం, అయితే ప్రస్తుతం దానికి సంబంధించిన గణాంకాలు ఎప్పటికప్పుడు తాజాగా వెలువడుతున్నాయి. మరింత ఎలఎంఒను నింపిన ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు సోమవారం రాత్రి తమ ప్రయాణాన్ని ప్రారంభించనున్నాయి.
***
(Release ID: 1717312)
Visitor Counter : 211