పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

వాడిన వంటనూనెతో తయారైన బయో డీజిల్ మొదటి సరఫరాను ఇండియన్ ఆయిల్ తిక్రికలాన్ టెర్మినల్ నుండి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు.


పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపే జీవ ఇంధనాలను భారతదేశం ఉపయోగించడంలో ఇది ఒక మైలురాయని ప్రధాన్ అభివర్ణించారు

Posted On: 04 MAY 2021 2:56PM by PIB Hyderabad

ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ తిక్రికలాన్ టెర్మినల్ నుండి ఈఓఐ పథకం కింద తయారు చేసిన యుకో (వాడిన వంట ఆయిల్) ఆధారిత బయోడీజిల్ డీజిల్  మొదటి సరఫరాను పెట్రోలియం & సహజ వాయువు  ఉక్కు మంత్రి  ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి  తరుణ్ కపూర్, ఇండియన్ ఆయిల్ చైర్మన్ ఎస్ ఎం వైద్య చైర్మన్ పాల్గొన్నారు. యుకోను బయోడీజిల్‌గా మార్చడానికి  ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ‘యుకో నుంచి బయోడీజిల్ తీయడానికి’ ఆసక్తి గల వారి నుంచి పెట్రోలియం  సహజ వాయువు  ఉక్కు మంత్రి, ఆరోగ్య  కుటుంబ సంక్షేమం, సైన్స్ & టెక్నాలజీ  ఎర్త్ సైన్సెస్ మంత్రితో కలిసి ఆసక్తి వ్యక్తీకరణలను (ఎక్స్ప్రెషనల్ ఆఫ్ ఇంట్రెస్ట్–ఈఓఐ) ప్రారంభించారు. 2019  ఆగస్టు 10న ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా ఈఓఐలను ఆహ్వానించారు. ఇటువంటి “ఈఓఐలను” ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎంసీలు లు) తరచుగా విడుదల చేస్తున్నాయి. మొదటి దశలో, 200 స్థానాల్లో యుకో తయారీకి  10.08.2019 నుండి 09.11.2020 మధ్య 11 ఈఐఓలు వచ్చాయి. దేశవ్యాప్తంగా మరో 300 ప్రాంతాల కోసం  ఈఓఐ ప్రచురణను 31.12.2021 వరకు పొడిగించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఓఎంసీలు లు క్రమానుగతంగా ఐదు సంవత్సరాలకు పెరుగుతున్న ధర హామీలను అందిస్తాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పదేళ్లపాటు ఆఫ్-టేక్ గ్యారంటీలు ఉంటాయి. ఇప్పటివరకు 22.95 కోట్ల లీటర్ల (557.57 టీపీడీ) సామర్థ్యం కలిగిన బయోడీజిల్ ప్లాంట్ల కోసం ఇండియన్ ఆయిల్ 23 ఎల్ఓఐలను జారీ చేసింది. ఈ పథకం వల్ల ఇండియన్ ఆయిల్ 31.3.2021 నాటికి ఢిల్లీ తిక్రికలాన్ టెర్మినల్ వద్ద 51 కెఎల్  యుకో-బయోడీజిల్ ను తయారు చేసింది.

ఈ సందర్భంగా  ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ చమురు పరిశ్రమకు మహమ్మారి  గట్టి సవాళ్లు విసిరినప్పటికీ ఇంధన సరఫరాలకు అంతరాయం లేకుండా చేయడంలో ఆయిల్ ఇండస్ట్రీ పోషించిన పాత్రను అభినందించారు. ఈ సంక్షోభంలో సాధారణ వ్యాపారాలకు తోడు దేశానికి వైద్య ఆక్సిజన్ సరఫరాకు మద్దతు ఇస్తున్నందున ఓఎంసీలు లను ఆయన ప్రశంసించారు. వివిధ కార్యక్రమాల ద్వారా దేశంలో లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాలను మెరుగుపర్చడానికి ఇండియన్ ఆయిల్ నాయకత్వ పాత్రను పోషించిందని ప్రధాన్ అన్నారు. ఇండియన్ ఆయిల్  తిక్రికలాన్ టెర్మినల్ నుండి యుకో ఆధారిత బయోడీజిల్  మొదటి సరఫరా గురించి మంత్రి ప్రస్తావిస్తూ “ భారతదేశంలో జీవ ఇంధనాల వాడకాన్ని పెంచడంలో ఒక మైలురాయిని అధిగమించాం.  యుకో పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.  దేశీయంగా బయోడీజిల్ సరఫరాను పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం,  గ్రామీణ ప్రాంతాలకు ఉపాధిని కల్పించడం ద్వారా దేశం గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలను పొందుతుంది”అని ఆయన వివరించారు. ఈ దిశలో ఓఎంసీలు లు పోషించిన చురుకైన పాత్రను ఆయన ప్రశంసించారు. యుకో తయారీ కోసం  ఇప్పటికే 30 ఎల్ఓఐలను ఓఎంసీలు జారీ చేశాయని వెల్లడించారు. కేంద్ర పెట్రోలియం & సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి  తరుణ్ కపూర్ మాట్లాడుతూ, “ఈ కార్యక్రమంలో ద్వారా మనదేశం జీవ ఇంధన శకంలోకి ప్రవేశించింది. యుకో భారత పెట్రోలియం రంగంలో విప్లవాత్మక మార్పులను తెస్తుంది. బయోడీజిల్‌ తయారీకి ముడిపదార్థాల లభ్యత ఒక పెద్ద సమస్య. యుకోను సమర్థంగా ఉపయోగించుకోవడం పురోగమనం. డీజిల్లో ఐదుశాతం బయోడీజిల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని చేరుకోవడానికి మాకు సహాయపడుతుంది. కలుషితంగా మారిన వంటనూనెను ఆహార గొలుసు నుండి మరింత ఉత్పాదక ఇంధనంగా మార్చడానికి ఇది సహాయపడుతుంది”అని ఆయన అన్నారు.

ఛైర్మన్ ఇండియన్ ఆయిల్  ఎస్ ఎం వైద్య మాట్లాడుతూ, “అనారోగ్యకరమైన వాడిన వంట నూనె నుంచి బయోడీజిల్ను పొందటానికి చేపట్టిన “ రాంధన్ సే ఇంధన్ ” విప్లవానికి దిగడానికి ఇండియన్ ఆయిల్ అన్ని విధాలా సహకరిస్తుంది. మేము యుకో  చివరి చుక్కను కూడా కనుగొని, బయోడీజిల్‌కు మార్చాలని కోరుకుంటున్నాము. తద్వారా మరింత శక్తిమంతమైన, సురక్షితమైన, పచ్చదనంతో కూడిన ఆరోగ్యకరమైన దేశంగా భారత్ మారుతుంది. ఈ కార్యక్రమం స్వచ్ఛ ఆత్మనిర్భర్ దిశగా భారత్ వేస్తున్న మరో ముఖ్యమైన అడుగు”అని ఆయన వివరించారు ఇండియన్ ఆయిల్ ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్ అంతటా ఎనిమిది బయోడీజిల్స్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించిందని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

బయోడీజిల్ ... సంప్రదాయ లేదా ‘శిలాజ’ డీజిల్ మాదిరిగానే ప్రత్యామ్నాయ ఇంధనం. కూరగాయల నూనెలు, జంతువుల కొవ్వులు,  వాడిన నూనె నుండి దీనిని ఉత్పత్తి చేయవచ్చు. బయోడీజిల్  ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే దీని కార్బన్-న్యూట్రాలిటీ. అంటే వెహికిల్ ఇంజన్ దీనిని మండించినప్పుడు విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ను నూనెగింజ పూర్తిగా పీల్చుకుంటుంది. బయోడీజిల్ వేగంగా బయోడిగ్రేడబుల్.  పూర్తిగా విషరహితం.

 

***



(Release ID: 1716010) Visitor Counter : 210