జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్ : వార్షిక ప్రణాళిక సమర్పించిన హిమాచల్ ప్రదేశ్


2022 నాటికి ' హర్ ఘర్ జల్' రాష్ట్రంగా అవతరించనున్న హిమాచల్ ప్రదేశ్

Posted On: 02 MAY 2021 2:48PM by PIB Hyderabad

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో వున్న ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ కల్పించాలన్న లక్ష్యంతో హిమాచల్ ప్రదేశ్  ప్రభుత్వం దీనికి సంబంధించి 2021-22 ఆర్ధిక సంవత్సరం వార్షిక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ వార్షిక కార్యాచరణ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జల్ జీవన్ మంత్రిత్వశాఖ కార్యదర్శి అధ్యక్షతన సమావేశమైన జాతీయ కమిటీకి  సమర్పించింది. 2022 జూలై నాటికి ' హర్ ఘర్ జల్' లక్ష్యాన్ని 2022 జూలై నాటికి సాధిస్తామని హిమాచల్ ప్రదేశ్ పునరుద్ఘాటించింది. 

రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 17.94 లక్షల కుటుంబాలు నివసిస్తున్నాయి. వీటిలో 13.02 లక్షల కుటుంబాలు (76.41%) మంచి నీటి కోసం కొళాయి కనెక్షన్ కలిగివున్నాయి. 2019 ఆగస్ట్ లో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన తరువాత రాష్ట్రంలో అయిదు లక్షలకు పైగా కొళాయి కనెక్షన్లను ఇచ్చారు. రాష్ట్రంలో ఇంతవరకు 8,458 గ్రామాలను ' హర్ ఘర్ జల్' గ్రామాలుగా ప్రకటించారు. దీనిప్రకారం ఈ గ్రామాల్లో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరు సరఫరా అవుతోంది.  2021-22 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో 2.08 లక్షల మంచి నీటి కనెక్షన్ లను ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో 100 % లక్ష్యాలను సాధించాలని రాష్ట్రం నిర్ణయించింది. ఇప్పటికే కిన్నర్, ఉనా, లహుల్ స్పిటి జిల్లాలను ' హర్ ఘర్ జల్' జిల్లాలుగా ప్రకటించారు. అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం పైపుల ద్వారా నీరు సరఫరా చేస్తోంది. 

2024 నాటికి గ్రామీణ ప్రాంతంలో వున్న ప్రతి ఇంటికి పైపుల ద్వారా నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో రాష్ట్రాలతో కలసి  కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తోంది. 2020-21లో కొళాయి కనెక్షన్లు ఇవ్వడానికి హిమాచల్ ప్రదేశ్ కు కేంద్రం 326 కోట్ల రూపాయలను గ్రాంటుగా కేటాయించింది.  హిమాచల్ ప్రదేశ్ కేంద్ర గ్రాంటుగా 548 కోట్ల రూపాయలను పొందింది. ఈ మొత్తంలో ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు కేంద్రం రాష్ట్రానికి విడుదల చేసిన 221 కోట్ల రూపాయలు కూడా వున్నాయి.  2021-22లో వివిధ పనులను చేపట్టడానికి కేంద్రం నుంచి రాష్ట్రానికి దాదాపు 700 కోట్ల రూపాయలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. జల్ జీవన్ మిషన్ కింద పనులను చేపట్టడానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, 15 ఆర్ధిక సంఘం గ్రాంటులు, ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, స్థానిక ప్రాంతాల అభివృద్ధి లాంటి కార్యక్రమాల కింద నిధులను సమీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రణాళికను పరిశీలించిన జాతీయ కమిటీ నీటి సరఫరా, వ్యర్ధ జలాలను శుద్ధి చేసి తిరిగి వినియోగించడం, జలవనరులను పటిష్టం  చేయడం లాంటి కార్యక్రమాలను అమలు చేయాలని సూచించింది.

జల్ జీవన్ మిషన్ కింద 2021-22లో  50,011 కోట్ల బడ్జెట్ నిధులు కాకుండా అదనంగా 15వ ఆర్ధిక సంఘం ఆర్‌ఎల్‌బి / పిఆర్‌ఐలకు నీటి సరఫరా, పారిశుధ్య నిధులు, రాష్ట్రాలకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంటులు, రాష్ట్ర ప్రాజెక్టులకు అందే నిధుల రూపంలో  కేటాయించిన 26,940 కోట్ల రూపాయలు అదనంగా అందుబాటులో ఉంటాయి. 2021-22లో దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహాలకు మంచి నీటి సరఫరా చేయడానికి రూపొందించిన ప్రాజెక్టుల అమలుకు లక్ష కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయనున్నారు. దీర్ఘ కాలంలో ప్రజలు జల్ జీవన్ మిషన్ కార్యక్రమాల అమలు  బాధ్యతను తీసుకొనేలా చూడడానికి ప్రతి గ్రామానికి కార్యాచరణ కార్యక్రమాన్ని రూపొందించి, నీటి సంఘాలను ఏర్పాటు చేయాలనీ జల్ జీవన్ మిషన్ మార్గదర్శకాలను రూపొందించింది. ప్రజలు భాగస్వాములు కావడంతో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాలపై సరైన పర్యవేక్షణ ఉంటుంది.హిమాచల్  ప్రదేశ్ లో గ్రామాల విస్తీర్ణం తక్కువగా ఉండడంతో గ్రామ పంచాయతీ స్థాయిలో కమిటీ లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు హిమాచర్ ప్రదేశ్ 3,213 గ్రామ స్థాయిలో మంచినీరు, పారిశుధ్య కమిటీలు ఏర్పాటు అయ్యాయి. 2021లో మిగిలిన 402 కమిటీలను ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు 16,645 గ్రామ కార్యాచరణ ప్రణాళికలు రూపొందాయి. 

కార్యక్రమాల అమలు కోసం జిల్లా రాష్ట్ర స్థాయిలో నిపుణులు, సహాయ సిబ్బందిని నియమించాలని హిమాచల్ ప్రదేశ్ నిర్ణయించింది. ఇంజినీరింగ్, నీటి సంఘాల సభ్యులు, గ్రామా పంచాయతీ గ్రామ స్థాయిలో 36,131 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాలను మెరుగుపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2021-22లో ప్లంబర్, ఫిట్టర్, ఎలెక్ట్రిషన్లుగా 4000 మంది స్థానికులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన సిబ్బందిని నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణ కోసం వినియోగిస్తారు. దీనివల్ల గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి చెందడమే కాకుండా యువతికి ఉపాధి లభిస్తుంది. 

రాష్ట్ర/ జిల్లా స్థాయిలో నీటి నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్న జల్ జీవన్ మిషన్ ఈ అంశంలో ఎక్కువ మంది పాల్గొనేలా చూడడానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. దీనికోసం ' జల్ శక్తి విభాగాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో కనీసం అయిదుగురు మహిళలకు నీటి నాణ్యత పరీక్ష పరికరాల వినియోగంలో శిక్షణ ఇవ్వడంతో పాటు వీటిని సకాలంలో కొనుగోలు చేసి సరఫరా చేయడానికి ప్రభుత్వం ప్రణాళికను రూపొందించింది. . నీటి నాణ్యతను పరిశీలించడానికి రాష్ట్రంలో 2021-22 లో 11 నూతన ప్రయోగశాలలను నెలకొల్పడానికి, 34 ప్రయోగశాలలకు జాతీయ గుర్తింపు పొందడానికి కృషి జరుగుతోంది. 

రసాయన జీవ వ్యర్ధాలను ప్రమాణాల ప్రకారం అరికట్టడానికి తగిన చర్యలను అమలు చేయాలని జాతీయ కమిటీ సూచించింది. కోవిడ్-19 పరిస్థితి, రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి కొరత,నీటి కాలుష్య అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా కమిటీ సూచించింది. సురక్షిత నీటిని గృహాలకు సరఫరా చేయడం వల్ల పారిశుధ్య పరిస్థితి మెరుగుపడడమే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ మంది గుమికూడకుండా చూడడానికి అవకాశం కలుగుతుంది. జల్ జీవన్ మిషన్ కింద అభివృద్ధి చేసిన సౌకర్యాలు సంవత్సరం పొడవునా పనిచేసేలా చూడడానికి క్షేత్ర స్థాయిలో పటిష్ట చర్యలను అమలు చేయాలని రాష్ట్రానికి జాతీయ కమిటీ సలహా ఇచ్చింది. 

జల్ జీవన్ మిషన్ క్రింద రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు రూపొందించే   వార్షిక కార్యాచరణ ప్రణాళికలను తాగునీరు మరియు పారిశుధ్య శాఖ కార్యదర్శి అధ్యక్షతన  ఇతర మంత్రిత్వ శాఖలు / విభాగాలు మరియు నీతి  ఆయోగ్ ప్రతినిధులు సభ్యులుగా ఉండే  జాతీయ కమిటీ పరిశీలిస్తుంది. పరిశీలన తరువాత త్రైమాసిక పురోగతి మరియు ఎప్పటికప్పుడు చేసిన వ్యయం, తనిఖీల ఆధారంగా ఏడాది పొడవునా నిధులు విడుదల చేయబడతాయి.  

 ‘హర్ ఘర్ జల్’ లక్యాన్ని సాధించడానికి రాష్ట్రాలకు సహాయపడటానికి  సమీక్షా సమావేశాలను జల్ జీవన్ మిషన్ నిర్వహిస్తున్నది.

***



(Release ID: 1715558) Visitor Counter : 179


Read this release in: English , Urdu , Hindi , Punjabi