సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ఎన్‌ఐసి సీనియర్ టెక్నికల్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ కుమార్ పంకజ్ కన్నుమూశారు

Posted On: 01 MAY 2021 7:59PM by PIB Hyderabad

కోవిడ్ వల్ల కలిగిన సమస్యల కారణంగా న్యూ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ సీనియర్ టెక్నికల్ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ కుమార్ పంకజ్ ఈ రోజు న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయసు 51 సంవత్సరాలు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

 
శ్రీ పికె పంకజ్ ఎన్ఐసి ప్రధాన కార్యాలయంలో సైంటిస్ట్ బి గా మార్చి 1993లో తన వృత్తిని ప్రారంభించారు.  మరణించిన సమయంలో ఆయన సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు దాని అనుబంధ సంస్థల్లో (ఆర్ఎన్ఐ, పబ్లికేషన్స్ డివిజన్లు) పనిచేస్తున్నారు.


డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ ఇన్ఫర్మేటిక్స్, నీతి అయోగ్, డి / ఓ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (డిఐపిఎఎప్‌), డెవలప్మెంట్ నార్త్ ఈస్టర్న్ రీజియన్ మొదలైన సంస్థల్లో  ఎన్ఐసి యొక్క అనేక ప్రాజెక్టులలో ఆయన ఎంతో కృషి చేశారు. అవసరమైనప్పుడు బివోసీ మరియు పిఐబిలకు కూడా ఆయన తన సహకారం అందించారు.


ఎన్ఐసి యొక్క ప్రకాశవంతమైన మరియు అత్యంత నిబద్ధత కలిగిన అధికారులలో ఒకరిగా ఆయన గుర్తుంచుకోబడతారు.

***


(Release ID: 1715496) Visitor Counter : 121