జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్: గుజరాత్ 2021-22 వార్షిక కార్యాచరణ ప్రణాళికను సమర్పించింది

2022-23 నాటికి ‘హర్ ఘర్ జల్’ రాష్ట్రంగా మారే ప్రణాళికలో భాగంగా 2021-22లో 10 లక్షల ట్యాప్ కనెక్షన్లను అందించాలని గుజరాత్ యోచిస్తోంది

Posted On: 27 APR 2021 3:57PM by PIB Hyderabad

గుజరాత్ రాష్ట్రం 2021-22 సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ కింద ఆ రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికను తాగునీరు మరియు పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి అధ్యక్షత వహించిన జాతీయ కమిటీకి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సాచురేషన్‌ ప్రణాళిక వివరాలతో నివేదిక సమర్పించారు. తద్వారా రాష్ట్రంలోని ప్రతి గ్రామీణ గృహానికి ట్యాప్‌ నీటి కనెక్షన్ లభిస్తుంది. 2021-22లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 10 లక్షల పంపు నీటి కనెక్షన్లను అందించాలని రాష్ట్రం యోచిస్తోంది. 2020-21 మధ్యకాలంలో మెరుగైన ప్రదర్శన చూపినందుకు గాను గుజరాత్  జెజెఎం కింద రూ .100 కోట్ల పనితీరు ప్రోత్సాహక గ్రాంట్‌ను అందుకుంది. ఆ కార్యక్రమం సందర్భంగా గుజరాత్ 2022-23 నాటికి ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాధించాలనే నిబద్ధతను పునరుద్ఘాటించింది.

రాష్ట్రంలో 93 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలు ఉన్నాయి. అందులో 77.16 లక్షల  (83%) గృహలకు కుళాయి నీటి సరఫరా ఉంది. జల్ జీవన్ మిషన్ కింద గత 1½ సంవత్సరంలో గుజరాత్ లోని గ్రామీణ గృహాల్లో 12 లక్షల ట్యాప్‌ కనెక్షన్లు అందించబడ్డాయి. ఇప్పటివరకు గుజరాత్‌లోని 5 జిల్లాలు, 31 బ్లాక్‌లు, 8,242 గ్రామాలను ‘హర్ ఘర్ జల్’ గా ప్రకటించారు. అంటే ఆ ప్రాంతాల్లోని ప్రతి గ్రామీణ గృహాలకు కుళాయి నీటి సరఫరా ఉంది. ఎస్సీ / ఎస్టీ ఆధిపత్య నివాసాలు, సాగి గ్రామాలు వంటి ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాన్ని కోరారు. 100 రోజుల్లోగా 100 శాతం అంగన్‌వాడీ కేంద్రాల్లో పైపుల ద్వారా నీటి సరఫరాను అందించడంలో రాష్ట్రం చేసిన కృషిని కమిటీ ప్రశంసించింది. ఈ కార్యక్రమం 2020 అక్టోబర్ 2 న ప్రారంభించబడింది.

జల్ జీవన్ మిషన్ కింద రాష్ట్రాలు / యుటిల వార్షిక కార్యాచరణ ప్రణాళిక (ఎఎపి) ను చేపట్టే కార్యక్రమం  తాగునీరు మరియు పారిశుధ్య శాఖ కార్యదర్శి మరియు వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు మరియు నీతి ఆయోగ్ అధ్యక్షతన జాతీయ కమిటీ నిర్వహిస్తుంది. ఆ తరువాత, ఎప్పటికప్పుడు చేసిన పురోగతి మరియు వ్యయాల ఆధారంగా సంవత్సరమంతా నిధులు విడుదల చేయబడతాయి. ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్రానికి సహాయపడటానికి వివరణాత్మక ప్రణాళిక కసరత్తు చేపట్టారు.

2024 నాటికి ప్రతి గ్రామీణ గృహాల్లో ట్యాప్‌ నీటి కనెక్షన్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా జెజెఎం  కార్యక్రమం అమలు చేస్తోంది. 2020-21లో రూ. 983 కోట్లు (పనితీరు ప్రోత్సాహకం రూ .100 కోట్లు సహా )  రాష్ట్రానికి విడుదల చేశారు.  2021-22లో గుజరాత్‌కు జల్ జీవన్ మిషన్ కింద వివిధ పనులను చేపట్టడానికి కేంద్ర నిధులుగా సుమారు రూ.  2,000 కోట్లు అందించింది.

జల్ జీవన్ మిషన్ కింద 2021-22లో  రూ .50,011 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో పాటు, 15 వ ఫైనాన్స్ కమిషన్ కింద రూ .26,940 కోట్ల భరోసా ఫండ్ కూడా అందుబాటులో ఉంది. అలాగే రాష్ట్ర ప్రాజెక్టుల నిధుల కింద  2021-22లో గ్రామీణ గృహాలకు పంపు నీటి సరఫరా ఉండేలా దేశవ్యాప్తంగా  రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నారు.

జల్ జీవన్ మిషన్ ప్రతి గ్రామంలో గ్రామ కార్యాచరణ ప్రణాళిక (విఐపి) మరియు పాని సమితి రాజ్యాంగంపై దృష్టి పెడుతుంది. గుజరాత్ గ్రామ పంచాయతీ లేదా దాని ఉపకమిటీ ద్వారా నీటి సరఫరా వికేంద్రీకృత నిర్వహణలో మార్గదర్శకుడు అంటే పాని సమితి 2002 లో గుజరాత్‌లో వాటర్ అండ్ మేనేజ్‌మెంట్ సపోర్ట్ ఆర్గనైజేషన్ (వాస్మో) కింద ప్రారంభమైంది. గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థల అమలు, నిర్వహణ, ఆపరేషన్ మరియు నిర్వహణప్రణాళికలో స్థానిక సమాజం  కీలక పాత్ర పోషించింది. పాని సమితి రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయబడింది. ఇప్పటివరకు 17 వేల 107 గ్రామ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశారు. తాగునీటి భద్రతను నిర్ధారించడంలో స్థానిక సమాజం ప్రధాన పాత్ర పోషిస్తున్న రాష్ట్రం అనుసరించే బాటప్-అప్ విధానాన్ని ఇది నిర్ధారిస్తుంది.

ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్, ఎస్‌బిఎం, పిఆర్‌ఐలకు 15 వ ఫైనాన్స్ కమిషన్ మంజూరు, కాంపా నిధులు, లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్స్ మొదలైన వివిధ కార్యక్రమాల కలయిక ద్వారా అందుబాటులో ఉన్న అన్ని వనరులను డొవెటైల్ చేయడానికి జేజేఎం క్రింద, ప్రయత్నాలు జరుగుతాయి. గ్రేవాటర్ నిర్వహణ మరియు నీటివనరుల పెంపుదల కోసం రాష్ట్రం తన కన్వర్జెన్స్ ఫండ్‌ను ఉపయోగించుకోవాలని కమిటీ సూచించింది.

తాగునీటి వనరులను బలోపేతం చేయడం / పెంచడం, గృహాలకు పంపు నీటి కనెక్షన్లను అందించడానికి నీటి సరఫరా పనులు, గ్రే వాటర్ ట్రీట్మెంట్ & పునర్వినియోగం మరియు గ్రామంలో నీటి సరఫరా వ్యవస్థ నిర్వహణపై ఎఎపి నొక్కి చెబుతుంది. రాష్ట్ర, జిల్లా మరియు ఉప జిల్లా స్థాయిలో 765 మంది నిపుణులు / సహాయక సిబ్బందిని ఈ కార్యక్రమం నిమగ్నం చేయాలని రాష్ట్రం యోచిస్తోంది. దీనికి తోడు ఇంజనీరింగ్ కేడర్ (సూపరింటెండెంట్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ మరియు జూనియర్ ఇంజనీర్), బ్లాక్ స్థాయి అధికారులు, పాని సమితి సభ్యుల నుండి 8,520 మందికి శిక్షణ ఇవ్వాలని వారు యోచిస్తున్నారు. రాష్ట్రంలో 6,000 మంది సిబ్బందికి ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మాసన్, పంప్ ఆపరేటర్ మరియు మోటారు మెకానిక్ గా శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ పొందిన మానవ వనరులు నీటి సరఫరా అవస్థాపనతో పాటు వాటి ఆపరేషన్ మరియు నిర్వహణకు ఉపయోగపడతాయి.

సరఫరా చేయబడిన నీటి నాణ్యతను నిర్ధారించడానికి ఎప్పటికప్పుడు నీటి వనరులు మరియు డెలివరీ పాయింట్ల పర్యవేక్షణను నిర్వహించడానికి జల్ జీవన్ మిషన్ కింద స్థానికులను ప్రోత్సహిస్తున్నారు.పిహెచ్‌ఇ డిపార్ట్మెంట్ స్థానిక ప్రజలను శక్తివంతం చేయడానికి మరియు పరస్పర చర్య చేయడానికి కమ్యూనిటీని సులభతరం చేస్తుంది. ఇందుకోసం, పంచాయతీలకు సకాలంలో సేకరణ మరియు ఫీల్డ్ టెస్ట్ కిట్ల సరఫరా కోసం ప్రతి గ్రామంలో కనీసం ఐదుగురు మహిళలను గుర్తించడం, ఫీల్డ్ టెస్ట్ కిట్లను ఎలా ఉపయోగించాలో మహిళలకు శిక్షణ ఇవ్వడం మరియు రిపోర్టింగ్ వంటి కార్యకలాపాలను చేర్చడానికి కార్యాచరణ ప్రణాళికను నిర్వహిస్తారు.  గుజరాత్‌లో కేవలం 1 ఎన్‌ఎబిఎల్ గుర్తింపు పొందిన రాష్ట్ర స్థాయి నీటి పరీక్ష ప్రయోగశాల, 14 జిల్లా ప్రయోగశాలలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని నీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఉన్న వాటికి ఎన్‌ఎబిఎల్ అక్రిడిటేషన్‌తో జిల్లా, బ్లాక్ లెవల్ వాటర్ టెస్టింగ్ లాబొరేటరీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ప్రజలు తమ నీటి పరీక్షను నామమాత్రపు రేటుకు చేయించుకోగలుగుతారు.

నీటి సరఫరా యొక్క కార్యాచరణను పర్యవేక్షించడానికి గ్రామాలలో నీటి సరఫరాను కొలవడానికి మరియు పర్యవేక్షించడానికి పైలట్ ఐవోటి ఆధారిత సెన్సార్లను ఏర్పాటు చేయాలని రాష్ట్రం యోచిస్తోంది. తద్వారా తగినంత పరిమాణంలో త్రాగునీరు మరియు ప్రతి గ్రామీణ గృహాలకు క్రమం తప్పకుండా మరియు దీర్ఘకాలిక ప్రాతిపదికన అందించబడుతున్న నాణ్యత తెలుసుకోబడుతుంది.


 

****(Release ID: 1714472) Visitor Counter : 12


Read this release in: English , Urdu , Hindi , Gujarati