కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

కొవిడ్-19 మహమ్మారి ఇటీవలి ఉధృతి నేపథ్యంలో ఈఎస్‌ఐ కార్పొరేషన్ తీసుకున్న చర్యలు

Posted On: 23 APR 2021 8:47PM by PIB Hyderabad

కొవిడ్-19 మహమ్మారి ఉధృతిని ఎదుర్కోవటానికి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయిస్‌ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసి) దాని వాటాదారులతో పాటు సాధారణ ప్రజలను ఆదుకునేందుకు పలు చర్యలు చేపట్టింది.

భారతదేశం అంతటా 229 ఐసియు / 163 వెంటిలేటర్ పడకలను కలిగి ఉన్న 3676 కోవిడ్ ఐసోలేషన్ బెడ్లతో ఈఎస్‌ఐసి నడుపుతున్న మొత్తం 21 ఈఎస్ఐసి హాస్పిటల్స్ కొవిడ్ -19 డెడికేటెడ్ హాస్పిటల్ గా పనిచేస్తున్నాయి. ఇవి సాధారణ ప్రజలకు కొవిడ్ వైద్య సేవలను ప్రత్యేకంగా అందిస్తున్నాయి. అంతేకాకుండా, ఆరు ఈఎస్‌ఐసి హాస్పిటల్స్ కూడా కోవిడ్ మరియు నాన్-కోవిడ్ సేవలను అందిస్తున్నాయి.

అలాగే, భారతదేశం వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న 2023 పడకలు కలిగిన 26 ఈఎస్‌ఐ ఆస్పత్రులు కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్స్ గా పనిచేస్తున్నాయి.

తీవ్రమైన కొవిడ్-19 వ్యాధితో బాధపడుతున్న రోగుల ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడే ప్లాస్మా థెరపీని ఈఎస్‌ఐసి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, ఫరీదాబాద్ (హర్యానా) మరియు ఈఎస్‌ఐసి మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, సనత్ నగర్ (తెలంగాణ) లలో ప్రారంభించారు.

ఈఎస్‌ఐసి ఆసుపత్రిని ప్రత్యేకమైన కోవిడ్ -19 ఆసుపత్రిగా ప్రకటించినట్లయితే టై-అప్ హాస్పిటల్స్ నుండి వైద్య సేవలను అందించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయబడతాయి. ఇటువంటి సందర్భాల్లో ఈఎస్‌ఐ లబ్ధిదారులను రిఫరల్‌గా ద్వితీయ /ఎస్‌ఎస్‌టి కన్సల్టేషన్‌ /చేరిక/ ఎంక్వైరీ అందించడానికి టై-అప్ హాస్పిటల్స్‌కు సూచించవచ్చు. ఈ సమయంలో సంబంధిత ఈఎస్‌ఐసీ హాస్పిటల్ ప్రత్యేక కోవిడ్ -19 ఆసుపత్రిగా పనిచేస్తుంది.ఈఎస్‌ఐ లబ్ధిదారులు అతని / ఆమె అర్హతకు అనుగుణంగా, రిఫెరల్ లేఖ లేకుండా నేరుగా టై-అప్ ఆసుపత్రి నుండి అత్యవసర / అత్యవసర వైద్య చికిత్సను పొందవచ్చు.

రాష్ట్ర / కేంద్ర ఆరోగ్య అధికారులతో సమర్థవంతమైన సమన్వయం కోసం ప్రతి ఈఎస్‌ఐసీ ఆసుపత్రిలో కోవిడ్ నోడల్ అధికారులను ఎంపిక చేశారు.

పైన పేర్కొన్న వాటితో పాటు, ప్రతి ఈఎస్‌ఐసీ ఆసుపత్రికి కనీసం 20% కొవిడ్‌ బెడ్‌లు ఈఎస్‌ఐ ఐపీలు, లబ్ధిదారులు, సిబ్బంది మరియు పెన్షనర్లకు కేటాయించాలని సూచనలు జారీ చేయబడ్డాయి.

ఈ క్లిష్ట సమయాల్లో ఈఎస్‌ఐ లబ్ధిదారుల కష్టాలను తగ్గించడానికి ప్రైవేట్ ఆస్పత్రులనుండి ఔషధాలను కొనుగోలు చేయడానికి ఈఎస్‌ఐసీ అనుమతించింది. తర్వాత ఈఎస్‌ఐసి చేత రీయింబర్స్‌మెంట్ ఇవ్వబడుతుంది.

కొవిడ్‌ చికిత్సకు ప్రత్యేకంగా కేటాయించబడిన (నేరుగా ఈఎస్‌ఐసిచే నడపబడుతున్న) హాస్పిటళ్లలో ఈ కింది సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి

 

వరుస సంఖ్య

 సౌకర్యం

మొత్తం

1

కోవిడ్ పడకలు

2843

2

ఐసోలేషన్ బెడ్స్

2397

3

కోవిడ్ యూనిట్‌లో ఆక్సిజన్ సప్లైతో
పడకలు (ఐసియుతో సహా)

1556

4

కొవిడ్ కోసం మొత్తం ఐసీయూ పడకలు

229

5

వెంటిలేటర్‌తో ఐసియూ పడకలు

163

6

వెంటిలేటర్ లేకుండా ఐసియూ పడకలు

36

 

6 కోవిడ్ + నాన్ కోవిడ్ ఈఎస్ఐసీ హాస్పిటల్లో (నేరుగా ఈఎస్‌ఐసీచే నడపబడుతున్న) ఈ కింది సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి

వరుస సంఖ్య

సౌకర్యం

మొత్తం

1

కోవిడ్ పడకలు

440

2

ఐసోలేషన్ బెడ్స్

396

3

కోవిడ్ యూనిట్‌లో ఆక్సిజన్
సప్లైతో పడకలు (ఐసియుతో సహా) 

416

4

కొవిడ్ కోసం మొత్తం ఐసీయూ పడకలు

53

5

వెంటిలేటర్‌తో ఐసీయూ పడకలు

47

6

వెంటిలేటర్ లేకుండా ఐసీయూ పడకలు

6

 

26 ప్రత్యేకమైన కోవిడ్ ఈఎస్‌ఐసి హాస్పిటల్లో  (సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి) ఈ కింది సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి

వరుస

సంఖ్య

సౌకర్యం

మొత్తం

1

కోవిడ్ పడకలు

2023

2

కోవిడ్ యూనిట్‌లో ఆక్సిజన్
సప్లైతో పడకలు (ఐసియుతో సహా)

1153

3

కొవిడ్ కోసం మొత్తం ఐసీయూ పడకలు

81

4

వెంటిలేటర్‌తో ఐసీయూ పడకలు

56

5

వెంటిలేటర్ లేకుండా ఐసీయూ పడకలు

25


ఇంకా మెరుగైన మరియు సత్వర వైద్య సేవలను అందించడానికి రోజూ ఎంవోహెచ్‌&ఎఫ్‌డబ్లూ, ప్రభుత్వం జారీ చేస్తున్న అన్ని మార్గదర్శకాలను ఈఎస్‌ఐసీ హాస్పిటల్స్ అనుసరిస్తున్నాయి.  ఇటువంటి చర్యలన్నింటినీ అమలు చేయడం కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈఎస్‌ఐసీ కేంద్రకార్యాలయం నుండి క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

 

***(Release ID: 1713707) Visitor Counter : 46


Read this release in: English , Urdu , Hindi , Punjabi