పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
డ్రోన్ల ద్వారా కరోనా టీకా డెలివరీ చేసే సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం ఐసీఎంఆర్‌కు అనుమతి
Posted On:
22 APR 2021 7:30PM by PIB Hyderabad
డ్రోన్లను ఉపయోగించి కరోనా టీకాలను డెలివరీ చేసే అంశంలో సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం, 'ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్' (ఐసీఎంఆర్)కు 'పౌర విమానయాన మంత్రిత్వ శాఖ', 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్' (డీజీసీఏ) షరతులతో కూడిన అనుమతినిచ్చాయి. కాన్పూర్ ఐఐటీతో కలిసి ఐసీఎంఆర్ ఈ ప్రాజెక్టు చేపడుతోంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లేదా ఒక సంవత్సరం వరకు ఈ అనుమతి చెల్లుబాటు అవుతుంది.
డోన్ల వినియోగం కోసం ఈ క్రింది సంస్థలకు కూడా షరతులతో కూడిన అనుమతులు లభించాయి. ఒక ఏడాదిపాటు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అనుమతి చెల్లుబాటు అవుతుంది.
* జీఐఎస్ ఆధారిత ఆస్తుల సమాచారం &ఎలక్ట్రానిక్ టాక్స్ రిజిస్టర్ తయారు చేయడానికి - డెహ్రాడూన్, హాల్‌ద్వానీ, హరిద్వార్, రుద్రపూర్‌లో ఉన్న నగర్ నిగమ్ సంస్థకు
* రైలు ప్రమాద స్థలాల పరిశీలన, రైల్వే ఆస్తుల రక్షణ కోసం - పశ్చిమ మధ్య రైల్వే, 'కోటా'కు ఏడాది పాటు అనుమతి
* రైలు ప్రమాద స్థలాల పరిశీలన, రైల్వే ఆస్తుల రక్షణ కోసం - పశ్చిమ మధ్య రైల్వే, 'కట్నీ'కు ఏడాది పాటు అనుమతి
వీటితో పాటు, ఆస్తుల తనిఖీ, నమోదు కోసం వేదాంత లిమిటెడ్ (కెయిర్న్ ఆయిల్ &గ్యాస్) సంస్థకు 08/04/2022 వరకు డ్రోన్ వినియోగానికి షరతులతో కూడిన అనుమతి దక్కింది.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ విధించిన షరతులను కచ్చితంగా పాటిస్తేనే ఆయా సంస్థలకు అనుమతి చెల్లుబాటు అవుతుంది. ఏ షరతును ఉల్లంఘించినా అనుమతి రద్దుతోపాటు, ఆ సంస్థపై చర్యలు తీసుకుంటారు. పైన పేర్కొన్న సంస్థలు డ్రోన్లను ఉపయోగించేందుకు అనుమతి మంజూరుపై జారీ చేసిన ప్రజా ప్రకటన లింకులను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.
****
(Release ID: 1713515)