శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న దేశానికి వరం
సిఎస్ఐఆర్ - సిఎంఈఆర్ఐ ఆక్సిజన్ శుద్ధి ప్లాంట్
Posted On:
22 APR 2021 4:48PM by PIB Hyderabad
సిఎస్ఐఆర్ - సిఎంఈఆర్ఐ అభివృద్ధి చేసిన ' ఆక్సిజన్ శుద్ధి" పరిజ్ఞానం కొవిడ్-19 రూపంలో దేశం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న సమయంలో వరంగా మారింది. కరోనావైరస్ సోకి తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నవారికి ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తోంది. ప్రస్తుతం దేశం మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నది. ఆక్సిజన్ కు డిమాండ్ పెరుగుతున్న సమయంలో ఆక్సిజన్ సిలెండర్ల రవాణా, నిల్వ అంశాలలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని అధిగమించడానికి సిఎస్ఐఆర్ - సిఎంఈఆర్ఐ ' ఆక్సిజన్ శుద్ధి" పరిజ్ఞానాన్ని అభివృధి చేసింది. దీనిని వినియోగంలోకి తేవడానికి హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఉన్న మెస్సర్స్ అపోలో కంప్యూటింగ్ లాబొరేటరీస్ (పి) లిమిటెడ్ అనుమతి పొందింది.
సిఎస్ఐఆర్ - సిఎంఈఆర్ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ (డాక్టర్) హరీష్ హిరానీ యూనిట్ పనిచేసే విధానాన్ని వివరించారు. సులభంగా లభించే ఆయిల్ ఫ్రీ రెసిప్రొకేటింగ్ కంప్రెసర్, ఆక్సిజన్ గ్రేడ్ జియోలైట్ జల్లెడలు, వాయు పీడనంతో పనిచేసే పరికరాలతో ఈ యూనిట్ కు రూపకల్పన చేశారు. ఇది ఒక నిమిషంలో 90% పైగా స్వచ్ఛత కలిగిన 15 లీటర్ల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తుంది. అవసరమైన సమయంలో ఇది నిమిషానికి 70 లీటర్ల వరకు ఆక్సిజన్ ను ఉత్పత్తి చేయగల సామర్ధ్యం కలిగి ఉంటుంది. 30% స్వచ్ఛత కలిగి వుండే ఈ ఆక్సిజన్ ను ఐసొలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు తక్షణం అందించడానికి వీలు ఉంటుంది. దీనితో మారుమూల ప్రాంతాల్లో కూడా కావలసిన పరిమాణంలో ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుంది. అవసరమైన ప్రాంతాల్లో యూనిట్ ను ఏర్పాటు చేసుకొనే సౌకర్యం ఉండడంతో ఆక్సిజన్ సరఫరాను వికేంద్రీకరించడానికి అవకాశం కలుగుతుంది.
దీనితోపాటు, రోగి శ్వాస తీసుకుంటున్న సరళిని గ్రహించి, గాలి పీల్చే సమయంలో మాత్రమే ఆక్సిజన్ ను సరఫరా చేయగల పల్స్ డోస్ మోడల్ ని అభివృద్ధి చేయడానికి పరిశోధనలను ప్రారంభించామని హరీష్ హిరానీ తెలిపారు. దీనివల్ల ప్రస్తుతం నిరంతరం అందిస్తున్న విధంగా కాకుండా శ్వాస పీలుచుకొనే సమయంలో ఆక్సిజన్ అందించడానికి వీలు కలుగుతుందని అన్నారు. దీనితో ఆక్సిజన్ కు వున్న డిమాండ్ 50%వరకు తగ్గుతుందని ఆయన వివరించారు.
ఆక్సిజన్ శుద్ధి యూనిట్ల ఏర్పాటుకు సాంకేతిక పరిజ్ఞానం బదిలీ కోసం ఇప్పటికే భారతీయ కంపెనీలు / తయారీ సంస్థలు / MSME లు / స్టార్ట్ అప్‌ల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను సిఎస్ఐఆర్ - సిఎంఈఆర్ఐ ఆహ్వానించింది.
సాంకేతిక పరిజ్ఞానం బదిలీ జరిగిన సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడిన అపోలో కంప్యూటింగ్ లాబొరేటరీస్ ప్రతినిధి జైపాల్ రెడ్డి మొదటి నమూనాను 10 రోజుల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మే రెండవ వారం లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 300 యూనిట్ల ను ఉత్పత్తిని చేయగల సామర్ధ్యం తమకు ఉందని అన్నారు. డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తిని ఎక్కువ చేస్తామని అన్నారు. విడిగా లేదా సమీకృత ఆక్సిజన్ ఎన్‌రిచ్మెంట్ యూనిట్ 'స్వాత్ వాయు' టెక్నాలజీతో అభివృద్ధి చేస్తామని అన్నారు. చిన్న ఆసుపత్రులు, ఐసోలేషన్ కేంద్రాలు, మారుమూల గ్రామాలు, ప్రదేశాలలో ఈ యూనిట్ ‘మినీ ఐసియు’గా పనిచేస్తుందని రెడ్డి అన్నారు. ఆక్సిజన్ సాంద్రతలను ఉపయోగించడం ద్వారా రోగులకు అవసరమైన ఆక్సిజన్ ను ఇది అందిస్తుంది. ప్రారంభ దశలో కోవిడ్ రోగులకు ఈ సదుపాయం కల్పిస్తే వారు ఎక్కువ సార్లు ఆసుపత్రులకు రాకుండా చూడవచ్చునని, వెంటిలేటరీ సహాయం లేకుండా వీరికి చికిత్స అందించవచ్చునని అన్నారు. చాలా సందర్భాలలో నివారించవచ్చు. ఆక్సిజన్ సిలిండర్ల వల్ల ఇటీవలి జరుగుతున్న ప్రమాదాలను కూడా ఈ యూనిట్ప్ర ఉపయోగం ద్వారా నివారించడానికి అవకాశం కలుగుతుంది. ఓయీయు ఉపయోగంపై సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహనా కల్పిస్తూ శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలని ప్రొఫెసర్ హరీష్ హిరానీ చేసిన సూచనను జైపాల్ రెడ్డి ప్రశంసించారు.
***
(Release ID: 1713479)
Visitor Counter : 241