ఆర్థిక మంత్రిత్వ శాఖ

ట్యుటికోరిన్‌ పోర్టులో 300 కేజీలకుపైగా కొకైన్‌ స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ; అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ.2 వేల కోట్లు ఉంటుందని అంచనా

Posted On: 21 APR 2021 8:06PM by PIB Hyderabad

ట్యుటికోరిన్‌ వీవోసీ నౌకాశ్రయానికి దిగుమతి అయిన సరుకులో కొకైన్‌ దాచి తీసుకొచ్చారన్న ప్రత్యేక నిఘా వర్గాల సమాచారంతో, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు, కలపతో కూడిన ఓ కంటైనర్‌లో తనిఖీలు జరిపారు. ఈ కంటైనర్‌ పనామా నుంచి ఆంట్వెర్ప్‌, కొలంబో మీదుగా ట్యుటికోరిన్‌ చేరింది.   

 

    ఈ కంటైనర్‌లో ఉన్న కలప మధ్య దాచిన 9 సంచులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ పొరల మధ్య కట్టుదిట్టంగా చుట్టిన ఇటుకల వంటి 302 తెల్లటి అచ్చులు ఈ సంచుల్లో కనిపించాయి. వీటి బరువు 303 కేజీలు కాగా, వీటిని కొకైన్‌గా నిర్ధరించారు. ఎన్డీపీఎస్‌ చట్టం-1985 ప్రకారం, సరకుతోపాటు కంటైనర్‌ను కూడా అధికారులు జప్తు చేశారు. ఈ మాదక ద్రవ్యాల రవాణాపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది.

***



(Release ID: 1713321) Visitor Counter : 161


Read this release in: English , Urdu , Hindi