ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ 19 టీకాలు – 94వ రోజు


రికార్డ్ స్థాయిలో నేడు 73,600 కోవిడ్ టీకా శిబిరాలు

రాత్రి 8 వరకు 31.03 లక్షలకు పైగా టీకాలు

12.69 కోట్లు దాటిన మొత్తం టీకాల సంఖ్య
అన్ని ఎయిమ్స్ లో ఆక్సిజెన్, ఐసియు-వెంటిలేటర్ పడకలపెంపు

Posted On: 19 APR 2021 9:47PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన టీకాల సంఖ్య 12.69 కోట్లు దాటగా ఈరోజు వేసిన టీకాలు రాత్రి 8 గంటలకు  31.03 దాటాయి.

 ఈరోజు నిర్వహించిన శిబిరాల సంఖ్య ఇంతకుముందెన్నడూ లేనంత రికార్డు స్థాయిలో ఉంది. మొత్తం 73,600 టీకా కేంద్రాలు ఈరోజు

పనిచేశాయి. ఇది సగటు కేంద్రాల సంఖ్య కంటే  28,600  అధికం. సాదహారణంగా సగటున రోజుకు 45,000 టీకా కేంద్రాలు

పనిచేస్తుంటాయి.పనిప్రదేశాలలో టీకాలివ్వటం వలన ఈ శిబిరాల సంఖ్య గణనీయంగా పెరిగింది.

 

సోమవారం రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం దేసవ్యాప్తంగా ఇప్పటిదాకా 12,69,56,032 టీకాలిచ్చారు.

అందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసులు   91,69,353, రెండో డోసులు 57,66,012 , కోవిడ్ యోధులకిచ్చిన

మొదటి డోసులు 1,14,21,780 , రెండో డోసులు 56,64,213, 45-60 ఏళ్ళ మధ్యవారికిచ్చిన మొదటి డోసులు

 4,23,06,422, రెండో డోసులు 13,03,610, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన మొదటి డోసులు  4,66,41,581, రెండో డోసులు   

6,83,061 ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

91,69,353

57,66,012

1,14,21,780

56,64,213

4,23,06,422

13,03,610

4,66,41,581

46,83,061

10,95,39,136

1,74,16,896

 

టీకాల కార్యక్రమం మొదలైన 94వ రోజైన నేడు రాత్రి 8 గంటలవరకు మొత్తం 31,03,474 టీకా డోసులిచ్చారు. ఇందులో

21,67,374 మంది లబ్ధిదారులు మొదటి డోస్ తీసుకోగా  9,36,100 మంది రెండో డోస్ తీసుకున్నారు. పూర్తి నివేదిక ఇంకా

అందాల్సి ఉంది.

 

తేదీ : ఏప్రిల్ 19, 2021 ( 94వ రోజు)   

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

33,222

45,964

1,57,876

1,31,817

12,39,960

1,65,646

7,36,316

5,92,673

21,67,374

9,36,100

 

భారతప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా అన్ని ఎయిమ్స్ ( న్యూ ఢిల్లీ, భువనేశ్వర్, భోపాల్, జోధ్ పూర్, పాట్నా, రాయ్ పూర్,

రిషీకేష్, మంగళగిరి, నాగపూర్, జిప్మెర్-పుదుచ్చేరి, పిజిఐ ఎం ఇ ఆర్ – చండీగఢ్ సహా) ఆక్సిజెన్ తో కూడిన పడకలు, వెంటిలేటర్లతో

కూడిన ఐసియు పడకలు పెంచాయి.

వాటిలో గతంలో 1448 ఆక్సిజెన్ పడకలు, 519 ఐసియు-వెంటిలేటర్లు ఉండేవి. వీటి సంఖ్యను ఇప్పుడు 2113

పడకలకు,  676 ఐసియు-వెంటిలేటర్ పడకలకు పెంచారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వలన రాష్ట్రాలలో

అత్యవసరంగా ఉన్న ఆస్పత్రి పడకలు అందుబాటులోకి వస్తాయి. ఆక్సిజెన్ కొరత ఉన్నట్టు తెలిసిన చోట్ల ఎయిమ్స్ వలన

కొంత వరకు పరిస్థితి చక్కబడుతుంది. 

 

 ***



(Release ID: 1712825) Visitor Counter : 176


Read this release in: English , Urdu , Hindi