జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ మిషన్: పంజాబ్ 2022 నాటికి ‘హర్ ఘర్ జల్’ రాష్ట్రంగా అవతరిస్తుంది

Posted On: 19 APR 2021 7:52PM by PIB Hyderabad

పంజాబ్ రాష్ట్రం తమ జల్ జీవన్ మిషన్ వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమర్పించింది.  తమరాష్ట్రం 2022 నాటికి ప్రణాళిక ప్రకారం ‘హర్ ఘర్ జల్’ లక్ష్యాన్ని సాధించాలనే నిబద్ధతనుఈ సందర్భంగా  పునరుద్ఘాటించింది. పంజాబ్‌లో 34.73 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉన్నాయి. వీటిలో 25.88 లక్షలు (74.5%) కుటుంబాలకు కుళాయి నీటి సరఫరా ఉంది. 2021-22లో ఈ రాష్ట్రం మరో 8.87 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లను అందించాలని యోచిస్తోంది. తద్వారా ప్రతి గ్రామీణ గృహానికి కుళాయి కనెక్షన్ లభిస్తుంది. ఈ రాష్ట్రంలో 1,634 ఆవాసాలు ఆర్సెనిక్, ఫ్లోరైడ్  ఇతర కాలుష్యాల వల్ల ప్రభావితమయ్యాయి. వీటిలో 558 ఆవాసాలు రాష్ట్రం పరిధిలోకి వస్తాయి. మిగిలిన ఆవాసాల కోసం, స్వల్పకాలిక చర్యగా త్రాగునీటిని రాష్ట్రం అందిస్తుంది.

రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల జల్ జీవన్ మిషన్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక (ఆప్)ను  గురించి చర్చించడం, ఖరారు చేయడం వంటి పనులను  తాగునీరు  పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ నిర్వహిస్తుంది. ఇందులో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాల, నీతి ఆయోగ్ సభ్యులు ఉంటారు.  తదనంతరం త్రైమాసిక పురోగతిని బట్టి,  ఎప్పటికప్పుడు అయ్యే ఖర్చుల ఆధారంగా సంవత్సరమంతా నిధులను విడుదల చేస్తారు.  ప్రణాళికాబద్ధమైన కార్యకలాపాలను సజావుగా అమలు చేయడానికి, లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి,  సాంకేతిక సహాయాన్ని అందించడానికి జాతీయ బృందం రెగ్యులర్గా గ్రామాలను సందర్శిస్తుంది. జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన్ని 'హర్ ఘర్ జల్' గా మార్చడానికి సహకారం అందిస్తుంది.

అన్ని పాఠశాలల్లో,  అంగన్వాడీ కేంద్రాలలో 100% కుళాయి కనెక్షన్ల లక్ష్యం సాధించడానికి రాష్ట్రం చేసిన కృషిని జాతీయ కమిటీ ప్రశంసించింది. జల్ జీవన్ మిషన్ కింద ఒకటిన్నర సంవత్సరాల్లో 9.09 లక్షల కుళాయి కనెక్షన్లను ఇచ్చారు. ఇప్పటివరకు, పంజాబ్‌లోని 4 జిల్లాలు, 29 బ్లాక్‌లు, 5,715 పంచాయతీలు  6,003 గ్రామాలలను ‘హర్ ఘర్ జల్’ గా ప్రకటించారు. అంటే ప్రతి గ్రామీణ గృహాలకు కుళాయి ద్వారా నీరు లభిస్తుంది.

పారదర్శకత,  జవాబుదారీతనం కోసం పంజాబ్ ప్రభుత్వం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్సివ్ సిస్టమ్‌తో డిజిటల్ విధానంలో 24x7 పాటు నడిచే కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఈ అనలాగ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ డిసెంబర్ 2020 లో అప్‌గ్రేడ్ అయింది. గత సంవత్సరం ఈ కాల్సెంటర్ 97.76 శాతం ఫిర్యాదులను పరిష్కరించింది . పెండింగ్ ఫిర్యాదుల గురించి రోజువారీగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు ఎస్ఎంఎస్లు, వాట్స్ యాప్ సందేశాలు, ఇ-మెయిల్ , ఫోన్ ద్వారా రిమైండర్‌లను పంపిస్తున్నారు. జల జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. ఇది ప్రతి గ్రామీణ గృహాలకు కుళాయిల ద్వారా నీటిని అందించడానికి ప్రారంభించిన కార్యక్రమం. కుళాయి కనెక్షన్ల కోసం కేంద్రం 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 362 కోట్ల రూపాయల నిధి కేటాయించింది. 2021-22లో రాష్ట్రానికి కేంద్ర నిధిగా 750 కోట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

జల్ జీవన్ మిషన్ కింద, 2021-22లో  జెజెఎమ్ కోసం రూ .50,011 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో పాటు, 15 వ ఫైనాన్స్ కమిషన్ కింద రూ .26,940 కోట్ల అష్యూర్డ్ ఫండ్ కూడా ఆర్ఎలబీలకు, పీఆర్ఐలకు అందుబాటులో ఉంటుంది. పారిశుద్ధ్యం, మంచినీటి సదుపాయాల కల్పన కోసం ఈ నిధులను వాడుతారు. ఈ విధంగా, 2021-22లో  గ్రామీణ గృహాలకు పంపు నీటి సరఫరా కోసం రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నది.  ఈ తరహా పెట్టుబడులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

 

జల్ జీవన్ మిషన్ కింద  వివిధ పథకాల, నిధుల కలయిక ద్వారా గ్రామ స్థాయిలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఎంజిఎన్ఆర్ఇజిఎస్, జెజెఎం, ఎస్‌బిఎం, పిఆర్ఐలు, కాంపా నిధులు, లోకల్ ఏరియా డెవలప్‌మెంట్ ఫండ్స్, పీఆర్ఐలకు 15 వ ఫైనాన్స్ కమిషన్ మంజూరు చేసిన నిధులను కలుపుతారు. గ్రామాల్లో నీటి సరఫరా ప్రణాళిక, అమలు, నిర్వహణ, కార్యకలాపాల్లో గ్రామ సంఘాలు/ గ్రామ పంచాయతీలు,  వినియోగదారుల సమూహాలు పాల్గొనాలని అధికారులు కోరారు. దీనివల్ల గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థలు దీర్ఘకాలిక సుస్థిరతను సాధిస్తాయి. తద్వారా తాగునీటి భద్రతను సాధ్యపడుతుంది. నీటి సంరక్షణ కోసం ఐఈసీ ప్రచారాన్ని ప్రారంభించాలని రాష్ట్రాన్ని కేంద్రం కోరింది.

తాగునీటి వనరుల బలోపేతం / వృద్ధి, నీటి సరఫరా, మురికినీటి శుద్ధీకరణ, పునర్వినియోగం  గ్రామంలోని నీటి సరఫరా వ్యవస్థ  ఆపరేషన్ & నిర్వహణపై ఆప్ దృష్టి సారిస్తుంది. రాష్ట్ర, జిల్లా నీటి  పారిశుద్ధ్య మిషన్ అధికారులు, ఇంజనీరింగ్ కేడర్  స్టేట్ & డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజ్‌మెంట్ యూనిట్ సిబ్బందితో సహా 60,610 మందికి నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలని రాష్ట్రం యోచిస్తోంది. పంజాబ్ రాష్ట్రంలోని 8 వేల మందికి మేసన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్  ఫిట్టర్‌గా శిక్షణ ఇస్తారు. 2020-21లో 2,373 మంది సిబ్బందికి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ పొందిన నిపుణులు నీటి సరఫరా మౌలిక సదుపాయాలను పెంచుతారు, వాటి బాగోగులను చూసుకుంటారు.

జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రజలందరికీ నామమాత్రపు రేటుతో నీటిని పరీక్షించడానికి జిల్లా & రాష్ట్ర స్థాయిలో నీటి నాణ్యత పరీక్ష ప్రయోగశాలలను తెరుస్తారు. నీటి నాణ్యతను పర్యవేక్షించడానికి గ్రామసంఘాలను ప్రోత్సహిస్తున్నారు.  పీహెచ్ఈ విభాగం  ఇందుకోసం చర్యలు తీసుకుంటుంది.  ఇందుకోసం సమయానుగుణంగా పరీక్షల పరికరాలను సమకూర్చుకొని సరఫరా చేస్తారు.  ఫీల్డ్ టెస్ట్ కిట్లను ఉపయోగించేందుకు ప్రతి గ్రామంలో కనీసం ఐదుగురు మహిళల శిక్షణ ఇస్తారు.  పరీక్ష ఫలిత ఫలితాలను నివేదించడం వంటివి కూడా నేర్పుతారు.  పంజాబ్లో రోజూ  డెలివరీ పాయింట్ల వద్ద 21,846 పరీక్షలు , నీటి వనరుల వద్ద 19,179 రసాయన పరీక్షలు చేస్తారు. నీటి పరీక్ష ప్రయోగశాలలకు ఎన్ఎబిఎల్ గుర్తింపు  ఉండేలా రాష్ట్రం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

 

***


(Release ID: 1712823) Visitor Counter : 154


Read this release in: English , Urdu , Hindi , Punjabi