జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్ జీవన్ మిషన్: కర్ణాటక 2022 మార్చి నాటికి 25 లక్షల ట్యాప్ కనెక్షన్లను అందించాలని భావిస్తోంది
Posted On:
18 APR 2021 3:56PM by PIB Hyderabad
జల్ జీవన్ మిషన్ కింద కర్ణాటక ఆ రాష్ట్ర వార్షిక కార్యాచరణ ప్రణాళికను ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించింది. 2021-22 సంవత్సరానికి రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికతో పాటు సంతృప్త ప్రణాళిక వివరాలను సమర్పించింది. తద్వారా ప్రతి గ్రామీణ నివాసానికి నీటి కనెక్షన్ అందుతుంది. 2021-22లో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 25 లక్షల ట్యాప్ కనెక్షన్లను అందించాలని ఆ రాష్ట్రం యోచిస్తోంది.
కర్ణాటక రాష్ట్రంలో 91.19 లక్షల గ్రామీణ కుటుంబాలు ఉన్నాయి. వాటిలో 28.44 లక్షలు (31.2%) గృహాలకు మాత్రమే కుళాయి నీటి సరఫరా ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని 23 పంచాయతీలు మరియు 676 గ్రామాలను 'హర్ ఘర్ జల్'గా ప్రకటించారు, అంటే ప్రతి గ్రామీణ ఆవాసానికి కుళాయి నీటి సరఫరా. ప్రతి ఇంటిలో నీటి నిర్వాహకులుగా ఉన్న స్త్రీలు మరియు యువతులకు 'జీవన సౌలభ్యాన్ని' అందించడమే కాకుండా విద్యను అభ్యసించడానికి, విభిన్న వృత్తులను నేర్చుకోవడానికి, వారి అప్‌గ్రేడ్ చేయడానికి సమయాన్ని అందించడం తద్వారా సమాజాన్ని శక్తివంతం చేయడం ఈ కార్యక్రమ ఉద్దేశం. ఈ కార్యక్రమం ద్వారా కుటుంబంతో సమయాన్ని గడపడంతో పాటు నీటి కోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన దుస్థితి తప్పుతుంది.
కర్ణాటకలో 95% పాఠశాలలు మరియు 95% అంగన్వాడీ కేంద్రాలు, 84% ఆశ్రమశాలలు, 91% గ్రామ పంచాయతీ భవనాలు మరియు 92% ఆరోగ్య కేంద్రాలకు నీటి కనెక్షన్లు ఉన్నాయి. రాబోయే కొద్ది నెలల్లో అభ్యాస కేంద్రాలు, జిపి భవనం మరియు ఆరోగ్య కేంద్రాలను కవర్ చేయాలని రాష్ట్రం యోచిస్తోంది. ప్రజల్లో గ్రేవాటర్ నీటి నిర్వహణ మరియు ప్రవర్తన మార్పు అత్యవసరం. తద్వారా పరిమిత వనరు అయిన నీటిని న్యాయబద్దంగా వినియోగిస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరువు పీడిత మరియు ఎడారి ప్రాంతం, ఎస్సీ / ఎస్టీ ఆధిపత్య నివాసాలు, ఆకాంక్ష జిల్లాలు మొదలైన వాటికి ప్రాధాన్యతనిచ్చే 17,111 గ్రామాలను కవర్ చేయాలని రాష్ట్రం యోచిస్తోంది.
రాష్ట్రం సమర్పించిన ప్రణాళికపై జాతీయ కమిటీ విశ్లేషించి సలహా ఇచ్చింది. గత సంవత్సరం నుండి పనిని పూర్తి చేయడమే కాకుండా, ప్రస్తుత సంవత్సరానికి ప్రణాళిక చేయబడిన పనులను వేగంగా ట్రాక్ చేయడానికి సమగ్ర ప్రయత్నాలు చేయాలని రాష్ట్రాన్ని కోరింది. 2021-22 నాటికి కర్ణాటకలో ఉన్న 30 జిల్లాల్లో 2 జిల్లాల్లోని గ్రామీణ గృహాలకు 100% ట్యాప్ నీటి కనెక్షన్ ఉండేలా చూడాలని రాష్ట్రం యోచిస్తోంది. ఇంటిలోనే కాకుండా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా సరఫరా చేసే నీటిని పరీక్షించాల్సిన అవసరాన్ని కమిటీ నొక్కి చెప్పింది.
పారదర్శకత మరియు జవాబుదారీతనం పెంచెందుకు కర్ణాటక రాష్ట్రం 'భూమి ఆన్‌లైన్ - పరిహారా' అని పిలిచే ఒక బలమైన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని అభివృద్ధి చేసింది. ఇది రోజువారీగా తాగునీటి సరఫరాకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి శీఘ్రంగా మరియు సులభంగా యంత్రాంగాన్ని అందిస్తుంది.
జెజెఎం అనేది కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యక్రమం. దేశంలోని ప్రతి గ్రామీణ ఆవాసానికి ట్యాప్ ద్వారా త్రాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 1,189 కోట్ల రూపాయల కేంద్ర నిధిని కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2021-22 రూ.3,000 కేంద్ర నిధులను రాష్ట్రం అందుకునే అవకాశం ఉంది. అందుకోసం గ్రామాల్లో గృహ కుళాయి నీటి కనెక్షన్‌ను సమకూర్చడానికి నిధులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి రాష్ట్రానికి సరైన ప్రణాళిక అవసరం.
వార్షిక కార్యాచరణ ప్రణాళిక త్రాగునీటి వనరుల బలోపేతం/వృద్ధి, నీటి సరఫరా, గ్రే వాటర్ శుద్ధి మరియు పునర్వినియోగం, గ్రామంలోని నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, ఐఇసి ప్రణాళిక, నీటి నాణ్యత పర్యవేక్షణ మరియు నిఘా, శిక్షణ వంటి సహాయక చర్యలకు సంబంధించిన ప్రణాళికను వివరిస్తుంది. 2021-22లో 14,000 గ్రామీణ ప్రజలకు మేసన్, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, మోటారు మెకానిక్స్, ఫిట్టర్, పంప్ ఆపరేటర్లుగా నైపుణ్య శిక్షణ ఇప్పించాలని రాష్ట్రం యోచిస్తోంది. గ్రామాల్లో నైపుణ్యం గల మానవ వనరులను సృష్టించడం వల్ల నీటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది.
జల్ జీవన్ మిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రాలు / యుటిల వార్షిక కార్యాచరణ ప్రణాళిక (ఏఏపి) చేపట్టే నెల రోజుల కార్యక్రమం. ప్రతిపాదిత ఏఏపికు సంబంధించిన పరిశీలన చేయడానికి జల్ శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల సభ్యులు,నీతి విభాగాలు పనిచేస్తాయి. ఆ తరువాత జాతీయ బృందం క్రమం తప్పకుండా క్షేత్ర సందర్శనలతో పాటు సంవత్సరమంతా నిధులు విడుదల చేయబడతాయి. మిషన్ సజావుగా అమలు కావడానికి మరియు 'హర్ ఘర్ జల్' లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడటానికి సాంకేతిక సహాయాన్ని మార్గనిర్దేశం చేయడానికి మరియు అందించడానికి తరచూ సమీక్ష సమావేశాలు జరుగుతాయి.
2021-22లో అదనంగా జల్ జీవన్ మిషన్ కోసం రూ 50,011 కోట్ల బడ్జెట్ కేటాయింపులు జరిపారు. వాటితో పాటు 15వ ఫైనాన్స్ కమిషన్ టైడ్-గ్రాంట్ కింద రూ. 26,940 కోట్ల హామీ ఫండ్ అందుబాటులో ఉంది. వీటి ద్వారా నీరు&పారిశుధ్యం కోసం ఆర్‌ఎల్‌బి / పిఆర్‌ఐల ప్రయోజనం కలుగుతుంది. ఈ విధంగా 2021-22లో దేశవ్యాప్తంగా గ్రామీణ గృహాలకు ట్యాప్ నీటి సరఫరాను అందించేందుకు రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ తరహా పెట్టుబడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతను అందిస్తుంది.
***
(Release ID: 1712614)
Visitor Counter : 126