ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం- 92వ రోజు


17న సాయంత్రం 8 గంటలవరకు 25.65 లక్షలకు పైగా టీకాలు

12.25 కోట్లు దాటిన మొత్తం టీకాల సంఖ్య

प्रविष्टि तिथि: 17 APR 2021 10:27PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇచ్చిన మొత్తం టీకాల సంఖ్య శనివారం ( 17వ తేదీ) సాయంత్రం 8 గంటలకు 12.25 కోత్లు దాటింది. అందులో 17వ తేదీనాడు ఒక్కరోజే  సాయంత్రం 8 గంటలకల్లా 25.65 లక్షల టీకా డోసుల పంపిణీ జరిగింది. సాధారణం గా రోజుకు సగటున 45 వేల శిబిరాలు పనిచేస్తాయి. కానీ 17న అదనంగా దాదాపు 15 వేల శిబిరాలు పనిచేయటంతో మొత్తం  60,057 కోవిడ్ టీకా శిబిరాల ద్వారా పంపిణీ జరిగింది. పనిప్రదేశాలలో టీకాలివ్వటం వలన కూడా డోసుల సంఖ్య బాగా పెరిగింది.   

17వ తేదీ సాయంత్రం 8 గంటలకు అందిన నివేదిక ప్రకారం ఇప్పటిదాకా పంపిణీ చేసిన కొవిడ్ టీకాల సంఖ్య 12,25,02,790 కు చేరింది. ఇందులో ఆరోగ్య సిబ్బందికిచ్చిన 91,27,451 మొదటి డోసులు, 57,07,322 రెండో డోసులు,  కోవిడ్ యోధులకిచ్చిన 1,12,29,062 మొదటి డోసులు, 55,08,179 రెండో డోసులు, 45-60 ఏళ్ళ మధ్య ఉన్నవారికిచ్చిన 4,04,16,170 మొదటి డోసులు,  10,76,752 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన  4,55,60,187 మొదటి డోసులు, 38,77,667 రెండో డోసులు కలిసి ఉన్నాయి.   

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్యవారు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

91,27,451

57,07,322

1,12,29,062

55,08,179

4,04,16,170

10,76,752

4,55,60,187

38,77,667

10,63,32,870

1,61,69,920

 

టీకాల కార్యక్రమం మొదలైన 92వ రోజైన 17వ తేడీ శనివారం సాయంత్రం 8 గంటలకల్లా 25,65,179 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో 19,24,416 మంది లబ్ధిదారులు మొదటి డోస్ అందుకోగా 6,40,763 మంది రెండో డోస్ తీసుకున్నారు.  

తేదీ: ఏప్రిల్ 17, 2021 ( 92వ రోజు) 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్యవారు

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

22,023

36,504

85,022

99,607

11,92,195

1,15,242

6,25,176

3,89,410

19,24,416

6,40,763

 

 ****


(रिलीज़ आईडी: 1712524) आगंतुक पटल : 210
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi