ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మధ్యప్రదేశ్ లో కోవిడ్ పరిస్థితిపై కేంద్ర హోమ్ కార్యదర్శి అధ్యక్షతన సమీక్ష సమావేశం
“పరీక్షించు, ఆనవాలు గుర్తించు, చికిత్స అందించు, టీకాలు వేయి” వ్యూహం మీద దృష్టి
ఆక్సిజెన్ పడకలు, ఐసియు పడకలను బలోపేతం చేయాలని సూచన
Posted On:
15 APR 2021 3:51PM by PIB Hyderabad
కేంద్ర హోం శాఖ కార్యదర్శి శ్రీ అజయ్ కుమార్ భల్లా, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్ తో కలిసి జరిపిన్ ఔన్నత స్థాయి సమావేశంలో మధ్యప్రదేశ్ లో కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించారు. అక్కడ నిఘా పెంపు, వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలగురించి ఆరోగ్య అధికారులతో చర్చించారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఇక్బాల్ సింగ్ బెయిన్స్, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, డిజిహెచ్ ఎస్ డాక్టర్ సునీల్ కుమార్ తోబాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్, నిఘా విభాగం అధికారి కూడా పాల్గొన్నారు.
వారం వారం మధ్యప్రదేశ్ లో తాకా కోవిడ్ కేసులు 13.4% చొప్పున పెరుగుదల నమోదు చేసుకున్నాయి. గత రెండు వారాల్లో రాష్ట్రంలో దాదాపు 79% కేసుల పెరుగుదల నమోదైంది. గత 30 రోజుల్లో 44 జిల్లాల్లో అత్యధిక సమ్ఖ్యలో కోవిడ్ కేసులు రావటం కలవరపరచింది. భోపాల్, ఇండోర్, గ్వాలియర్, ఖండ్వా జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అక్కడి వ్యాధి నిర్థారణ పరీక్షలు, విశ్లేషణలమీద కూదా ఈ సమావేసంలో చర్చించారు. ఏప్రిల్ 7-13 మధ్య వారానికి, 17-23 మధ్య వారానికి జరిగిన ఆర్ టి-పిసిఆర్ పరీక్షలు 67% నుంచి 73% కు పెరగటం, యాంటిజెన్ పరీక్షలు 31% నుంచి 25 % కు తగ్గటం కూడా పరిశీలించారు. ఎన్ 95 మాస్కులు, పిపిఇ కిట్లు, హెచ్ సి క్యు టాబ్లెట్లు వెంటిలేటర్లు, ఆక్సిజెన్ సిలిండర్లు తగినన్ని అందుబాటులో ఉండటం గురించి కూడా ఈ సమావేశంలో చర్చించారు.
కోవిడ్ కు రాష్టం స్పందించటంలో ఎదురవుతున్న ప్రధాన అవరోధాలను కూడా కేంద్ర హోం కార్యదర్శి చర్చించారు. పడకల కొరత, ఆక్సిజెన్ సరఫరాతో కూడిన పడకల కొరత, ఇతర మౌలిక సదుపాయాల కొరత గురించి ప్రస్తావించారు. అత్యవసరం కాని సందర్భాలలో ప్రజల కదలికలు నియంత్రించాలని, గుమికూడటాన్ని నివారించాలని, వ్యాధి సోకే అవకాశమున్న సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండేట్టు చూడాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించారు. పట్టణ ప్రాంతాలమీద మరింతగా దృష్టి సారించాలని కూడా కోరారు.
ఇప్పుడున్న సౌకర్యాలకు తోడుగా రైల్వే, ఇ ఎస్ ఐ, సెయిల్ కోల్ ఇండియా తదితర కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలోని ఆస్పత్రులు వినియోగం కోసం అవసరమైతే ఆ విషయం తెలియజేయాలని కూడా రాష్ట అధికారులను హోమ్ శాఖ కార్యదర్శి కోరారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల్కు అనుగుణంగా ఎంబిబిఎస్ ఫైనలియర్ విద్యార్థులను, నర్సింగ్ విద్యార్థులను కూడా వైద్యసేవలకు వాడుకోవాలని సూచించారు. ఆస్పత్రులలో ఆక్సిజెన్ ను హేతుబద్ధంగా వాడుకొవాలని సూచించారు. ఇందుకోసం రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు జారీచేసిన మార్గదర్శకాలను పాటించాలని పిలుపునిచారు. ఆస్పత్రులు, జిల్లా సమీక్షా సంఘాలు ఎప్పటికప్పుడు ఆక్సిజెన్ అవసరాలను సమీక్షించాలని ఇందుకోసం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎలాంటి కొరతా లేకుండా చూసుకోవాలని కోరారు.
మరణాల సంఖ్య తదితర అంశాలను క్షుణ్ణంగా సమీక్షించిన అనంతరం ఈ క్రింది వ్యూహం పాటించాల్సిందిగా మధ్యప్రదేశ్ అధికారులకు సూచించారు:
కోవిడ్ పరీక్షల సంఖ్య అన్ని జిల్లాలలో గణనీయంగా పెంచటం కనీసం 70శాతం ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేయటం, జన సాంద్రత ఎక్కువగా ఉన్నచోట్ల స్క్రీనింగ్ పరీక్షలకు రాపిట్ యాంటిజెన్ పరీక్షలు జరపటం , తాజా గా క్లస్టర్లు బైటపడుతున్న చోట్లమీద దృష్టిపెట్టటం. రాపిడ్ యాంటిజెన్ లో నెగటివ్ వచ్చిన వాళ్ళకి కచ్చితంగా ఆర్ టి-పిసిఆర్ పరీక్షలు జరపటం
వ్యాధి వ్యాప్తి నివారణకు ఆనవాలు పట్టటం, నియంత్రించటం, నిఘాపెంచటం అనే పద్ధతులు పాటించటం
దగ్గరగా సంచరించినవారిని కనీసం 25-30 మందిని గుర్తించి ఆనవాళ్ళు కనబడగానే 72 గంటల్లోగా ఐసొలేషన్ కు తరలించటం, మరిన్ని పరీక్షలు జరపటం
సోకినవారిని, వారితో కలసి తిరిగిన వారిని గుర్తించి వాటి ఆధారంగా క్లస్టర్లను ఎంపిక చేయటం. కంటెయిన్మెంట్ జోన్లను నిర్థారించటం
చికిత్స అందించటం, ఇళ్లలో ఐసొలేషన్ లొ ఉన్నవారికి కూడా తగిన వైద్య సాయం అందించటంలో రాష్టం పాత్ర గురించి మరోమారు గుర్తు చేశారు.
ఐసొలేషన్ పడకల పెంపు, ఆక్సిజెన్ పడకలు అందుబాటులో ఉంచటం, ఐసియు పడకలు తగినన్ని సిద్ధం చేయటం, అంబులెన్స్ లు సిద్ధంగా ఉంచటం మీద దృష్టి సారించాలని కోరారు.
అత్యవసర పరిస్థితులకు తగినంత ఆక్సిజెన్ అందుబాటుకు ప్రణాళికలు సిద్ధంచేయటం, మరణాలు తగ్గించటం మీద దృష్టిపెట్టటం, చికిత్సావిధానాలు సక్రమంగా పాటించటం మీద దృష్టిపెట్టాలన్నారు.
కోవిడ్ వ్యాప్తి నిరోధానికి తగినట్టు ప్రజలు వ్యవహరించటం మీద దృష్టిపెట్టాలని, ప్రజలలో అవగాహన పెంచటానికి స్థానిక సాంస్కృతిక, కళా బృందాలను వాడుకోవాలని కోరారు. అవసరమైతే పోలీసుల సాయంతో నిర్బంధంగా జాగ్రత్తలు పాటించేట్టు చూడటం కూడా సూచనలలో ఉంది. నిర్దిష్ట కాలపరిమితికి తగినట్టుగా కోవిడ్ టీకాలు వేయించటం మీద కూడా దృష్టిపెట్టాలని రాష్ట అధికారులకు కేంద్ర అధికారులు సూచించారు.అర్హులైన ఆరోగ్య సిబ్బందికి, కోవిడ్ యోధులకు 100% టీకాలు పూర్తిచేయాలన్నారు.
****
(Release ID: 1712116)
Visitor Counter : 158