కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

వలస కూలీలు, కార్మికుల స్థితిగతులపై అఖిలభారత సర్వేకి 3రోజుల ఆన్.లైన్ శిక్షణ!

కార్యక్రమంలో భాగస్వాములైన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు,
వివిధ రాష్ట్రాల అధికారులు, నోడల్ సిబ్బంది

Posted On: 15 APR 2021 4:12PM by PIB Hyderabad

దేశంలోని వలసకూలీల, కార్మికుల స్థితిగతులపై రెండు సర్వేలను చేపట్టిన కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ, సదరు సర్వేల తొలిదశ క్షేత్రస్థాయి పనులను ఇప్పటికే ప్రారంభించింది. ఉపాధిపై వివిధ సంస్థల ప్రాతిపదికగా ఆలిండియా క్వార్టర్లీ ఎస్టాబ్లిష్మెంట్ బేస్డ్ ఎంప్లాయిమెంట్ సర్వే (ఎ.క్యు.ఇ.ఇ.ఎస్.) పేరిట త్రైమాసిక సర్వేని, వలసకూలీలపై అఖిలభారత సర్వేని కేంద్ర కార్మిక శాఖ చేపట్టింది. ఈ రెండు సర్వేలకు సంబంధించిన తొలిదశ క్షేత్రస్థాయి పనులకు ఈ ఏడాది ఏప్రిల్ ఒకటిన శ్రీకారం చుట్టారు. 

  కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అనుబంధించిన కార్మిక సంస్థ ఆధ్వర్యంలో అఖిలభారత స్థాయిలో జరుగుతున్న ఈ సర్వేలకు బ్రాడ్.కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బెసిల్-బి.ఇ.ఎస్.ఐ.ఎల్.) ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సహకారాన్ని, మానవ వనరుల సంబంధాలను అందజేస్తోంది. ఈ సర్వేల్లో భాగంగా టాబ్లెట్లు వాడకం, కంప్యూటర్ల సహాయంతో వ్యక్తిగత ఇంటర్వ్యూలను చేపట్టేందుకు భారీ సంఖ్యలో క్షేత్రస్థాయి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు అవసరం.  ఎన్యూమరేటర్లను, సూపర్వేజర్లను దేశం నలుమూలనుంచి నియమించుకుంటారు. సర్వేలు మరింత సమర్థంగా, సజావుగా, విజయవంతంగా సాగేందుకు వీలుగా ఈ సూపర్వైజర్లకు, సర్వే క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఇవ్వడం చాలా అవసరం.

 https://ci4.googleusercontent.com/proxy/51RxncBl7xjwGJX90ygo1YnNbzfwBQ_2hZzfYA9_ivGIEWIpw9Y82mjmfkD3F2kgPJv57-rGtdV0kaZO_G0PShQ7eHi0Q4YE30H-NYne13PkZPjPDsRVcS4bnQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001O4JD.jpg

 

   దేశంలో కోవిడ్-19 మహమ్మారి వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, ఈ సర్వేలకోసం ఆన్ లైన్ ద్వారా మూడు రోజుల సర్వేని కార్మిక సంస్థ నిర్వహించింది. రెండు అఖిల భారత స్థాయి సర్వేలకోసం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 900మందికి పైగా క్షేత్రస్థాయి సూపర్వైజర్లకు, ఎన్యూమరేటర్లకు ఈ నెల 13నుంచి 15వ తేదీవరకూ ఆన్ లైన్ ద్వారా శిక్షణ అందించారు. 

  ఈ శిక్షణా కార్యక్రమాన్ని కేంద్ర కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్ డి.పి.ఎస్. నెగీ ఈ నెల 13వ తేదీన ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి కార్మిక సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హర్ దీప్ సింగ్ చోప్రా, కార్మిక సంస్థ సీనియర్ అధికారులు, పలువురు పాఠ్యాంశ నిపుణులు హాజరయ్యారు.

https://ci5.googleusercontent.com/proxy/cJf_FNRWnw8eNHwIBRGBZSZ0sWV59IEYRHC7qyQfD2Q6kd6_orfaWvY82_vo9tQBUmmVkL2ug2WQo9aD97j4kILUccoNvS2tfVQlV6qxx7mxjeBwcnPaS5viAw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002JOLW.jpg

ఈ సందర్భంగా నెగీ మాట్లాడుతూ, దేశంలోని కార్మికుల ప్రయోజనాలే లక్ష్యంగా భారత ప్రభుత్వం రూపొందించే విధానాలకోసం  ఈ సర్వేలు అత్యంత ఆవశ్యకమని వివరించారు. దేశంలోని కార్మికుల స్థితిగతుల మెరుగుదలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి గురించి, వారికోసం విధానాల రూపకల్పనకు కావలసిన సమాచార ఆవశ్యతకను గురించి ఆయన ముఖ్యంగా ప్రస్తావించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో ఆయన ముచ్చటిస్తూ, సర్వేల్లో పాల్గొనే క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణ ఆవశ్యతను గురించి వివరించారు. మొత్తం శిక్షణా కార్యక్రమాన్ని రెండు భాగాలుగా విభజించారు. ఒక్కో భాగానికి ఒకటిన్నర రోజు చోప్పున వ్యవధిని కేటాయించారు. తొలి భాగంగా, వలసకూలీలపై అఖిల భారత సర్వే గురించిన శిక్షణను ఈ నెల 13వ తేదీనుంచి, 14 తేదీ మధ్యాహ్నం వరకూ అందించారు. ఇక సంస్థల ప్రాతిపదిన జరిపే అఖిలభారత త్రైమాసిక సర్వేపై శిక్షణను ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నంనుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ అందించారు.

https://ci5.googleusercontent.com/proxy/t1I5LBMYlAxp2bFEWE30rvAvXT1AzRcyT0iJHwTxjWq5dFAvkiFMlef8IvacMWiKAIJFpvFjIrpoVmO4-3XilBBwhk7kZYn9ZEic48JTxX9xLvA8flNX7iq0aA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003ODXH.jpg

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపరంగా  అందుబాటులో ఉన్న అధునాతనమైన ఉపకరణాల వినియోగంతో వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో ఈ ఆన్ లైన్ శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణకు హాజరయ్యేందుకు  900మందికిపైగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు వీడియో కాన్ఫరెన్సింగ్ లింక్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఎంపిక చేసిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు కూడా ఈ శిక్షణలో పాల్గొన్నారు.  అనుభవశాలులైన శిక్షకులు, సబ్జెక్ట్ నిపుణులు, కార్మిక సంస్థ సీనియర్ అధికారులు ఈ సందర్భంగా శిక్షణ అందించారు.

 

• వలసకూలీలపై అఖిల భారత సర్వేకోసం, అమితాబ్ పాండా, దీపక్ కుమార్, కుమారి ఆయూషీ మిశ్రా, కుమారి శ్రేయా దీక్షిత్ లు శిక్షకులుగా వ్యవహరించారు.

• సంస్థల ప్రాతిపదికన నిర్వహించే అఖిల భారత త్రైమాసిక సర్వేకి సంబందించి,  రాకేశ్ కుమార్, గౌరవ్ భాటియా, మన్ ఇందర్ కుమార్, డాక్టర్ శ్వేతా జాలా శిక్షకులుగా వ్యవహరించారు. 

 

  అఖిల భారత సర్వేలను నిర్వహించే కార్మిక సంస్థ, సర్వేల ఉద్దేశాలు, సర్వే చేపట్టే పద్ధతులు, విధానాలు, సర్వేల నిర్వహణలో వారి పాత్ర, బాధ్యతలు, సర్వేకి సంబంధించిన భాగస్వామ్య వర్గాలు, సర్వేలో వినియోగించే నిర్వచనాలు తదితర అంశాలపై సర్వే భాగస్వాములకు అవగాహన కల్పించడంపైనే ఈ శిక్షణలో ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించారు.  సర్వేలో జాబితా షెడ్యూల్.ను భర్తీ చేయడం, చిన్న గ్రామాలవారీగా గ్రూపులను ఏర్పాటు చేయడం తదితర అంశాలను గురించి కూడా శిక్షకులు ఈ కార్యక్రమంలో వివరించారు.  

 

https://ci3.googleusercontent.com/proxy/ReefdzbGxKByUfHuZ0eaUV3Eill28ejsP_YQvvfnqLiXLkJvFmROxws7ISrSO2nPSMyJ2cLRUfkJ7TapEKiQOZnBbQ0yLZ4SWqSqqpY3KIAqfzV98dTjmEjfcA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ATIN.jpg

 

ఆన్ లైన్ ద్వారా నిర్వహించిన ఈ శిక్షణా కార్యక్రమం పూర్తిగా విజయవంతమైంది. మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో 900మందికి పైగా ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయి సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. శిక్షణ చివరి రోజున కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్ ముగింపు ప్రసంగం చేశారు.

  ఆన్ లైన్ ద్వారా శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు రానున్న కొద్దిరోజుల్లోనే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పనులను ప్రారంభిస్తారు. త్రైమాసిక ఎంప్లాయిమెంట్ సర్వేకి సంబంధించిన తొలి నివేదిక ఈ ఏడాది జూలైలో, వలసకూలీలపై సర్వే తొలి నివేదిక ఈ ఏడాది నవంబరు నెలలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  వలస కూలీలపై అఖిల భారత సర్వేలో దేశంలోని వలస కూలీల స్థితిగతులపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తారు. వలసకూలీల జనాభా, సామాజక ఆర్థిక అంశాలు, కోవిడ్ నేపథ్యంలో వారి పరిస్థితి తదితర అంశాలపై కూడా ఈ సర్వేలో సమాచారం సేకరిస్తారు. వలసకూలీలపై కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ప్రభావాన్ని గురించి అవగాహనకు ఈ సర్వే దోహదపడుతుంది. దీనితో, వలస కూలీలపై వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికగా ప్రభుత్వం విదానాలను రూపకల్పన చేసేందుకు వీలు కలుగుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న వలస కూలీలపై కోవిడ్ వైరస్ వ్యాప్తి ప్రభావాన్ని తెలుసుకునేందుకు కూడా ఈ సర్వే ద్వారా వీలవుతుంది.

  ఇక వివిధ సంస్థల ప్రాతిపదికన అఖిల భారత స్థాయిలో జరిగే త్రైమాసిక సర్వేలో భాగంగా త్రైమాసిక ప్రాతిపదికన కార్మికుల పరిస్థితులపై సమాచారాన్ని ఆయా సంస్థలనుంచి నేరుగా సేకరిస్తారు. అందుకే దీనిని సంస్థల ప్రాతిపదికన చేపట్టే సర్వేగా రూపొందించారు. కార్మిక సంబంధమైన మార్కెట్ స్థితిగతులు, డిమాండ్ ప్రాతిపదికన అంచనాలు సంబంధిత సమాచారాన్ని ఈ సర్వేద్వారా సేకరిస్తారు.

  ఈ సర్వేని రెండు విభాగాలుగా నిర్వహిస్తారు. ఒకటేమో త్రైమాసిక ప్రాతిపదికన ఉపాధిపై నిర్వహించే సర్వే, మరొకటేమో ఏరియా ఫ్రేమ్ ఎస్టాబ్లిష్మెంట్ సర్వే...

  త్రైమాసిక ప్రాతిపదికన ఉపాధిపై జరిపే సర్వే ద్వారా,.. పదిమంది అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులను, కార్మికులను నియమించుకునే సంస్థలకు సంబంధించిన ఉపాధి అంచనాలను సేకరిస్తారు.  ఏరియా ఫ్రేమ్ సర్వే మాత్రం, కార్మిక సంక్షేమ విధాన రూపకల్పనకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. 9మంది అంతకంటే తక్కువ మంది కార్మికులను నియమించుకునే సంస్థలకు ఉపాధి అంచనాల సమాచారాన్ని ఈ సర్వే అందిస్తుంది.

 

***(Release ID: 1712114) Visitor Counter : 56


Read this release in: English , Urdu , Hindi , Punjabi