భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ

ఏప్రిల్ 15న ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి , కారైకల్ లలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం


ఏప్రిల్ 16న కర్ణాటక దక్షిణ కోస్తా,కేరళ, మాహే మరియు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయి

ఏప్రిల్ 19న ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర లలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం

Posted On: 15 APR 2021 12:01PM by PIB Hyderabad

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) జాతీయ వాతావరణ అంచనా కేంద్రం ఏప్రిల్ 16 నుంచి 19వ తేదీ వరకు దేశంలో వాతావరణ పరిస్థితులపై బులెటిన్ విడుదల చేసింది. 

  జాతీయ వాతావరణ అంచనా కేంద్రం అందించిన సమాచారం ప్రకారం 

ఏప్రిల్ 15 (రోజు 1): తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ( గంటకి  40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో)  లతో కూడిన వడగళ్ళ వానలు కురుస్తాయి.

 మధ్య మహారాష్ట్ర, కోస్తా ఆంధ్ర, యానాం, ఒడిశా, ఛత్తీస్ ఘర్ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో ( గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడినవానలు కురుస్తాయి.

రాయలసీమ, మరాఠ్వాడలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు ( గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో) వర్షాలు కురుస్తాయి. 

జమ్మూ, కాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీఘర్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, విదర్భ, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కోస్తా ఆంధ్ర, యానాం, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో ( గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షాలు కురుస్తాయి.

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు, కొంకణ్,  గోవా, కర్ణాటక మరియు లక్షదీవుల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. 

* భారీ వర్ష సూచన: ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహె, తమిళనాడు, పుదుచ్చేరి, మరియు కారైకాల్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. 

* వడగాల్పులు: హర్యానా, సౌరాష్ట్ర మరియు కుచ్ ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. 

ఏప్రిల్ 16 ( రెండవ రోజు):

జమ్మూకాశ్మీర్, లడఖ్,గిల్గిట్-బాల్టిస్తాన్,  ముజఫరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు , వడగళ్ళు మరియు గాలులతో ( గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షాలు కురుస్తాయి. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, చత్తీస్ ఘర్, ఝార్ఖండ్, ఉప గంగ  పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, కేరెలా, మాహె లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులు ( గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) లతో కూడిన వర్షాలు కురుస్తాయి. తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్, విదర్భ, ఉప  హిమాలయ ప్రాంత పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్య మహారాష్ట్ర, మరత్వడ, ఒడిశా, కోస్తా ఆంధ్ర, యానాం,రాయలసీమ, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, లక్షదీవుల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. 

* భారీ వర్ష సూచన: కోస్తా, దక్షిణ కర్ణాటక, కేరెలా, మాహె, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. 

* పశ్చిమ రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో  ఇసుక తుపాను/ ఈదురుగాలులు ( గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం) వీచే అవకాశం వుంది. 

ఏప్రిల్ 17 ( మూడవ రోజు):

ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం లలో కొన్ని ప్రాంతాల్లో మెరుపులు , వడగళ్ళు మరియు గాలులతో ( గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షాలు కురుస్తాయి.జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్,ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా,  చండీఘర్, ఢిల్లీ,  పంజాబ్ లలోని కొన్ని  ప్రదేశాలలో మెరుపు, వడగళ్ళు మరియు గాలులు (గంటకి  30-40 కిలోమీటర్ల వేగంతో)లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుంది. రాజస్థాన్, అస్సాం, మేఘాలయ మరియు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర లలోని కొన్ని  ప్రదేశాలలో మెరుపులతో కూడిన గాలులు  (గంటకి  40-50 కిలోమీటర్ల వేగంతో)  వీస్తాయి. పశ్చిమ ఉత్తర ప్రదేశ్, చండీఘర్, ఢిల్లీ,    జార్ఖండ్, గంగా పశ్చిమ బెంగాల్ మరియు కేరళ & మాహేలలోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు  గాలులతో (గంటకి  30-40 కిలోమీటర్ల వేగంతో)కూడిన  వర్షం కురుస్తుంది. విదర్భ, బీహార్, అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్  , దక్షిణ కోస్తా కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి,కారైకల్ మరియు లక్షదీవుల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుంది. 

* భారీ వర్ష సూచన: జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మహే మరియు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ లలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుంది. 

* రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లోఇసుక తుపాను / గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది,

ఏప్రిల్ 18 ( నాల్గవ రోజు):

* ఉత్తరారఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అస్సాం, మేఘాలయ లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, గాలులతో ( గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షం కురిసే అవకాశం వుంది. జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిట్- బాల్టిస్తాన్ ,ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా,  చండీఘర్, ఢిల్లీ, పంజాబ్, తూర్పు ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, గంగా పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు  మరియు  గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో  కూడిన గాలులతో వర్షాలు కురిసే అవకాశం వుంది. బీహార్, అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ మరియు లక్ష దీవుల లోని కొన్ని  ప్రదేశాలలో మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం వుంది. 

* భారీ వర్ష సూచన: జమ్మూ కాశ్మీర్, లడఖ్, గిల్గిత్-బాల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్ మరియు కేరళ, మహే లలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదవుతుంది.

* రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లోఇసుక తుపాను / గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది,

ఏప్రిల్ 19:

ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్ , సిక్కిం, అస్సాం , మేఘాలయ మరియు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర లలోని కొన్ని ప్రాంతాల్లో మీదుగా వివిక్త ప్రదేశాలలో మెరుపులు  మరియు గాలులతో ( గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో)  కూడిన వర్షం కురుస్తుంది. 

గంగా పశ్చిమ బెంగాల్ మరియు జార్ఖండ్ లలోని కొన్ని ప్రదేశాలలో మెరుపులు  మరియు గాలులతో ( గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో)  కూడిన వర్షాలు కురిసే అవకాశం వుంది. అరుణాచల్ ప్రదేశ్, అండమాన్, నికోబార్ దీవులు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ మరియు కేరళ, మహే లలోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

(గ్రాఫిక్ లలో వివరాల కోసం  CLICK HERE ) 

 స్థాన నిర్దిష్ట సూచన,  హెచ్చరిక కోసం మౌసమ్ యాప్ ని దయచేసి డౌన్‌లోడ్ చేసుకోండి. వ్యవసాయ సంబంధిత సలహా కోసం మేఘదూత్ యాప్ మరియు మెరుపుల  హెచ్చరిక కోసం దమని యాప్ ,  జిల్లా వారీ హెచ్చరికల  కోసం రాష్ట్ర ఎంసీ  / ఆర్ఎంసీ వెబ్‌సైట్‌లను సందర్శించండి.

***



(Release ID: 1712030) Visitor Counter : 176