నీతి ఆయోగ్

అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల దత్తత, బలోపేతం, సాధికారత, విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఏఐసీటీఈ తో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఒప్పందం

Posted On: 14 APR 2021 6:35PM by PIB Hyderabad

అటల్ టింకరింగ్ ల్యాబ్ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థుల నైపుణ్యాలను వినూత్న సాంకేతిక అంశాలతో మరింత మెరుగుపరచి వారిని ప్రపంచ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి  (ఏఐసీటీఈ) తో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఒప్పందం కుదుర్చుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఏఐసీటీఈ, నీతి ఆయోగ్, విద్యా మంత్రిత్వ శాఖ ఇన్నోవేషన్ సెల్ లు కలసి పనిచేయాలన్న తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. దేశవ్యాపితంగా అమలు జరిగే కార్యక్రమాల్లో విద్యార్థుల నైపుణ్యాలను మెరుగు పరచడానికి వినూత్న కార్యక్రమాలను అమలు చేయాలని నిర్ణయించారు. 

ఒప్పందంలో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత  ప్రాంతాల్లో 7200కి పైగా ఏర్పాటైన అటల్ టింకరింగ్ ల్యాబులను  (ఎటిఎల్) ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న 2500కి పైగా ఉన్న సంస్థల ఇన్నోవేషన్ కౌన్సిళ్లతో (ఐఐసి) తొలుత అనుసంధానం చేస్తారు. 

 విద్యార్థులు వినూత్నంగా సృజనాత్మకంగా ఆలోచించి ప్రాజెక్టులకు రూపకల్పన చేయడానికి పాఠశాలల్లో పనిచేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలను నెలకొల్పారు. విద్యార్థుల ఆలోచనా సరళిలో మార్పులు తెచ్చి వారు వినూత్నంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకోవడానికి ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఐఐసిలు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. దీనిద్వారా విద్యార్థులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మారడానికి ప్రోత్సాహాలను అందించడం జరుగుతోంది. 

  ఎటిఎల్,   ఐఐసి విధానాలు విద్యార్థుల శక్తిసామర్ధ్యాలను పదును పెట్టి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన వ్యవస్థలను కలిగివున్నాయి. ఈ రెండు వ్యవస్థలు మరింత సమర్థతతో పనిచేసేలా చూడడానికి  ఎటిఎల్ లను  ఐఐసి లు దత్తత తీసుకుంటాయి.   అఖిల భారత సాంకేతిక విద్యా మండలి,  అటల్ ఇన్నోవేషన్ మిషన్, నీతి ఆయోగ్ లు పరస్పర సహకారంతో విద్యావ్యవస్థలో వినూత్న మార్పులను అమలు చేయడానికి కార్యక్రమాలను అమలు చేస్తాయి. 

పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల మధ్య అవగాహనను మరింత మెరుగు పరచాలన్న నూతన విద్యా విధానం 2020 లక్ష్యాల సాధనకు ఈ నిర్ణయం సహకరిస్తుంది. ఆన్ లైన్ లో చదువు చెప్పడం, విద్యర్ధులకు సలహాలు సూచనలను ఇవ్వడం, అందరూ కలసి ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం లాంటి అంశాలకు ప్రాధాన్యత లభిస్తుంది. ఈ కార్యక్రమంతో సంబంధం ఉన్నవారందరూ దీనిలో పాల్గొంటారు. 

ఒప్పందం కుదిరిన సందర్భంగా మాట్లాడిన  అటల్ ఇన్నోవేషన్ మిషన్ మిషన్ డైరక్టర్  ఆర్ రమణన్  గత రెండు సంవత్సరాలుగా సాంకేతిక విద్యా మండలితో కలసి తమ సంస్థ పనిచేస్తున్నదని తెలిపారు. ఎటిఎల్‌లను వాటి విద్యార్థులను ఏఐసీటీఈ దత్తత తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. దీనివల్ల ఎటిఎల్‌ విద్యామెరుగుపడుతుందని తెలిపారు. ర్థుల సృజనాత్మక శక్తి మరింత మెరుగుపడతాయని అన్నారు.  ఏఐసీటీఈ కేంద్రాలు విద్యార్థుల నైపుణ్యాలను సాన పెడతాయని ఆయన వివరించారు. 

సమావేశంలో మాట్లాడిన  ఏఐసీటీఈ చైర్మన్ డాక్టర్ అనిల్ సహస్రబుధే  విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంతో పాటు భారతీయ విజ్ఞానం , దానితోముడిపడి వున్న ఉన్న విలువలను వారికి తెలియజేయవలసిన అవసరం ఉందని అన్నారు. 

  అటల్ ఇన్నోవేషన్ మిషన్ తో కుదిరిన అవగాహన వల్ల విద్యార్థులను తీర్చిదిద్దడానికి అవకాశం కల్పిస్తుందని  డాక్టర్ అనిల్ సహస్రబుధే అన్నారు. సమాజానికి అవసరమైన విద్యార్థులను రెండు సంస్థలు కలసి తీర్చిదిద్దుతాయని అన్నారు. రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, 3 డి, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ మొదలైన వాటిని ఉపయోగిస్తూ విద్యార్థులకు విలువలతో కూడిన శిక్షణను అందిస్తామని ఆనయ వివరించారు. 

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ (సిఐఓ)  డాక్టర్  అభయ్ జెరె మాట్లాడుతూ వినూత్న దేశంగా భారతదేశం రూపుదిద్దుకోవడానికి వినూత్నంగా అలోచించి నిర్ణయాలను తీసుకొనే వ్యవస్థ అభివృద్ధి చెందవలసి ఉంటుందని అన్నారు. ఈ దిశలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ల మధ్య కుదిరిన అవగాహన ఉపకరిస్తుందని అన్నారు. దీనిద్వారా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఆలోచనతో విద్యార్థులు రూపొందుతారని ఆయన అన్నారు. 

ఈ ఒప్పందం వల్ల సృజనాత్మక ఆలోచనల రూపకల్పన కోసం నిర్వహిస్తున్న పోటీల్లో పాల్గొని ఎదగడానికి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి విద్యార్థులకు అవకాశం కలుగుతుంది. 

 

***



(Release ID: 1711950) Visitor Counter : 235


Read this release in: English , Urdu , Hindi , Punjabi