భారత పోటీ ప్రోత్సాహక సంఘం
గంగవరం పోర్ట్ లిమిటెడ్ కి చెందిన 89.6 శాతం ఈక్విటీ వాటాను అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లిమిటెడ్ కొనుగోలు చేయడానికి ఆమోదించిన - సి.సి.ఐ.
Posted On:
13 APR 2021 4:57PM by PIB Hyderabad
గంగవరం పోర్ట్ లిమిటెడ్ (“జి.పి.ఎల్”) కి చెందిన 89.6 శాతం ఈక్విటీ వాటాను, అదానీ పోర్ట్స్ &స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లిమిటెడ్ (“ఏ.పి.ఎస్.జెడ్”) కొనుగోలు చేయడానికి, కాంపిటీషన్ చట్టం, 2002 లోని సెక్షన్ 31 (1) కింద, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సి.సి.ఐ) 2021 ఏప్రిల్, 13వ తేదీ న, ఆమోదించింది.
ఈ ప్రతిపాదిత కలయిక, జి.పి.ఎల్. కి చెందిన 89.6 శాతం వాటాను (అంటే, గంగవరం పోర్టును నిర్వహించే అస్తిత్వాన్ని) ఏ.పి.ఎస్.ఈ.జెడ్. కొనుగోలు చేయడానికి సంబంధించినది.
గుజరాత్, గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశాలో ఉన్న ఆరు సముద్రతీర రాష్ట్రాల్లోని, 11 దేశీయ ఓడరేవులలో, ఏ.పి.ఎస్.ఈ.జెడ్. ప్రస్తుతం, సమగ్ర పోర్టు మౌలిక సదుపాయాలను అందిస్తోంది. ఏ.పి.ఎస్.ఈ.జెడ్. పూర్తి రవాణా అవసరాలను (అనగా - నౌకల నిర్వహణ నుండి ఏంకరేజ్, పైలటేజ్, టగ్ పుల్లింగ్, బెర్తింగ్, అంతర్గత రవాణా, నిల్వ, నిర్వహణ, ప్రాసెసింగ్ తో పాటు రోడ్డు లేదా రైలు ద్వారా తుది తరలింపు వరకు) నిర్వహిస్తుంది.
వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన తేదీ నుండి ముప్పై సంవత్సరాల రాయితీ కాలానికి, ఆ తర్వాత మరో 20 సంవత్సరాల కాలానికి (10 సంవత్సరాల చొప్పున రెండు పర్యాయాలు) పొడిగించే విధంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో "బిల్డ్-ఓన్-ఆపరేట్-ట్రాన్స్ఫర్" ప్రాతిపదికన రాయితీ ఒప్పందానికి అనుగుణంగా, జి.పి.ఎల్. సంస్థ ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్ లోని గంగవరం వద్ద డీప్-వాటర్-పోర్ట్ ను సొంతం చేసుకొని, అభివృద్ధి చేసి, నిర్వహించే ప్రక్రియలో నిమగ్నమై ఉంది.
అన్ని వివరాలతో కూడిన సి.సి.ఐ. ఆదేశం త్వరలో అందుబాటులోకి రానుంది.
*****
(Release ID: 1711573)
Visitor Counter : 188