ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల కార్యక్రమం – 86వ రోజు


టీకా ఉత్సవంలో తొలిరోజు పనిప్రదేశాల్లో టీకాలు ప్రారంభం
నిన్న రాత్రి 8 వరకు 27.69 లక్షల టీకా డోసులు

మొత్తం టీకాలు 10 కోట్ల 43 లక్షల డోసులు
మొదటి డోసులు 9 కోట్ల పైమాటే

60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన మొదటి డోసులు 4 కోట్లు

Posted On: 11 APR 2021 9:57PM by PIB Hyderabad

కోవిడ్ 19 ను అరికట్టే దిశలో భారత్ చురుకుగా ముందడుగు వేస్తోంది. దేశవ్యాప్తంగా చేపట్టిన టీకా మహోత్సవ్ ప్రత్యేక కార్యక్రమంలో పని ప్రదేశాలలోనే టీకాలిచ్చే కార్యక్రమం మొదలైంది. అయితే, నిన్న ఆదివారం కావటంతో ప్రైవేట్ పని ప్రదేశాలలోనే అమలు జరిగింది.  ప్రతి రోజూ సగటున 63,800 కోవిడ్ టీకా కేంద్రాలు పని చేస్తున్నాయి. అయితే, ఇప్పుడు సగటున మరో 18,800 కేంద్రాలు పెరిగాయి. ఆదివారం కావటంతో టీకాల సంఖ్య కాస్త తక్కువగానే నమోదైంది. టీకా ఉత్సవ్ మొదటి రోజున సాయంత్రం 8 గంటలవరకు 27 లక్షలకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది. ఆదివారం సాయంత్రం 8 గంటలవరకు దేశవ్యాప్తంగా ఇచ్చిన తీకా డోసుల సంఖ్య 10,43,65,035 కు చేరింది

15,55,837 శిబిరాలద్వారా సాధించిన ఈ పురోగతిలో  90,12,768 డోసులు ఆరోగ్య సిబ్బందికిచ్చిన మొదటి డోసుల,  55,23,718 రెండో డోసులు, కోవిడ్ యోధులకిచ్చిన   99,94,360 మొదటి డోసులు,  47,93,536 రెండో డోసులు, 45-60 ఏళ్ళమధ్య ఉన్నవారికిచ్చిన  3,19,49,793 మొదటి డోసులు,  6,76,609 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారికిచ్చిన  4,04,76,731 మొదటి డోసులు, 19,37,520 రెండో డోసులు కలిసి ఉన్నాయి.

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య వారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

90,12,768

55,23,718

99,94,360

47,93,536

3,19,49,793

6,76,609

4,04,76,731

19,37,520

9,14,33,652

1,29,31,383

 

ఇప్పటిదాకా మొత్తం 9 కోట్లకు పైగా (9,14,33,652)  మొదటి డోస్ టీకాల పంపిణీ జరగగా అందులో 60 ఏళ్ళు పైబడిన లబ్ధిదారుల 4 కోట్లకు పైగా (4,04,76,731) ఉన్నారు.  

దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల కార్యక్రమం మొదలైన 86వ రోజైన నిన్న ఒక్కరోజే  27,69,888 టీకా డోసులిచ్చారు. అందులో 25,47,691 మంది లబ్ధిదారులు మొదటి డోసు అందుకున్నవారు ఉండగా  2,22,197 మంది రెండో డోస్ అందుకున్నారు.  

తేదీఏపెఇల్ 11,  2021 (86వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

45-60 ఏళ్ళ మధ్య వారు

60 పైబడ్డవారు

మొత్తం

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

1వ డోస్

2వ డోస్

8705

15429

40745

34327

1673140

35127

825101

137314

2547691

222197

 

 ****


(Release ID: 1711110) Visitor Counter : 142


Read this release in: English , Urdu , Hindi