నీతి ఆయోగ్
కోవిడ్ మహమ్మారి సమయంలో ఆన్‌లైన్‌ద్వారా వివాదాల పరిష్కారం పాత్ర ఎంతో కీలకం: జస్టిస్ డాక్టర్ డి.వై.చంద్రచూడ్ నీతిఆయోగ్, ఆగామి, ఒమిడ్యార్ చే ఒడిఆర్ హ్యాండ్‌బుక్ విడుదల
Posted On:
10 APR 2021 7:52PM by PIB Hyderabad
వికేంద్రీకరణ, ప్రజాస్వామికీకరణ,న్యాయం అందించే యంత్రాంగ ఇబ్బందులు తొలగించడంలో ఆన్‌లైన్ వివాదాల పరిష్కార విధానం (ఒడిఆర్)కీలకపాత్ర పోషించనున్నదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్న్నారు. ఆన్‌లైన్‌వివాద పరిష్కారానికి సంబంధించిన ఒకహ్యాండ్‌బుక్‌ను విడుదల చేసే కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ మాటలన్నారు. ఈ హ్యాండ్‌బుక్‌ను ఆగామి, ఒమిడ్యార్ ఇండియాలు నీతిఆయోగ్, ఐసిఐసిఐ బ్యాంక్, అశోకా ఇన్నొవేటర్స్ ఫర్‌ద పబ్లిక్, ట్రైలీగల్, డాల్‌బెర్గ్, డ్వారా , ఎన్ ఐ పిఎఫ్ పి తో కలిసి రూపొందించాయి.
కోవిడ్ -19 మన జీవితాలను ఊహించని విధంగా మార్చిరేసింది. కోర్టుల నిర్వహణపై కూడా దీని ప్రభావం కనిపించింది. వర్చువల్ విధానంలో వాదనలకు వీలు కలిగింది. ఈ మార్పు ప్రతిఒక్కరికీ అంటే అడ్వకేట్లు, కక్షిదారులు, కోర్టు సిబ్బందికి తొలుత కష్టమైన వ్యవహారమే, అయితే మొదట్లో ఈ ప్రక్రియ నెమ్మదిగా సాగినప్పటికీ, వర్చువల్ హియరింగ్‌లు ఇప్పుడు న్యాయవ్యవస్థలో తమ స్థానాన్ని పదిలపరుచుకున్నాయని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.
కోవిడ్ మహమ్మారి అనంతర పరిస్థితులలో తిరిగి భౌతికంగా వాదనలు వినే పద్ధతి కావాలని కోరుకోవడం , వద్దనడం వంటివి ఉన్నప్పటికీ ఒడిఆర్ కు ఉన్న పలు ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుత పరిస్థితులలో ఇది అవసరమని ఆయన అన్నారు.
సంప్రదాయ లిటిగేషన్ కాలహరణం, ఖర్చుతో , శ్రమతో కూడుకున్నదని ఒడిఆర్ హ్యాండ్‌బుక్ ప్రస్తావిస్తున్నదని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థ ఈ సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితులలో తరచూ ముందు కోర్టుకు వచ్చే కొన్ని రకాల కేసులు ఒడిఆర్ వల్ల తగ్గుతాయన్నారు.
ప్రస్తుతం డిజిటల్‌గా పరివర్తన చెందిన ప్రపంచంలో ఒడిఆర్ నిర్వహించగల పాత్ర పట్ల తనకు విశ్వాసం ఉన్నట్టు జస్టిస్ చంద్ర చూడ్ తెలిపారు. “ ఇది కేవలం వర్చువల్ ప్రక్రియలో నిర్వహించబడుతున్నందుకు కాక, ఇందులో అన్ని రకాల డిజిటల్ పరిష్కారాలు అందుబాటులో ఉండడమే కారణం, నా దృష్టిలో గత ఏడాదిగా వర్చువల హియరింగ్‌ల నుంచి నేర్చుకున్న ఒక ప్రధాన అనుభవం, చాలా సరళమైన మార్పుల వల్ల ఈ ప్రక్రియ చాలా సమర్థవంతంగా ఉండగలదన్నది. అలాగే అన్ని పార్టీలచే డిజిటల్ ఫైళ్ళను ఉపయోగించడం, నోట్సును డిజిటలైజ్ చేయగల సామర్థ్యం, అన్ని డాక్యుమెంట్లు ఒకే చోట ఉంచే సౌలభ్యం ఇందులో ఉంది. అన్ని వివాద పరిష్కారాలను ఆన్‌లైన్ ద్వారా చేయడం వల్ల మరింత అవసరమైన సమాచారాన్ని పొందడానికి వీలు కల్పిస్తుంది. ఇది ఒడిఆర్ ప్రక్రియను భవిష్యత్తులో మరింత మెరుగు పరచడానికి భూమికను ఏర్పరుస్తుంది. అంతేకాదు, ఈ సమాచారాన్ని కోర్టుల వర్చువల్ అనుభవాన్ని మరింత అర్ధవంతంగా మెరుగుపరుచుకునేందుకువాడవచ్చు. చివరగా సమర్ధమైన ఒడిఆర్ సేవలు అందుబాటులోకి రావడం వల్ల వివాదంతో ముడిపడి ఉన్న పార్టీల దృష్టికోణంలో మార్పు వచ్చి, ఈ ప్రక్రియను మరింత అందుబాటులోకి తేవడానికి చవకగా లభించడం, మరింతగా పాల్గొనేలా చేయడానికి దోహదపడుతుంది.
అన్ని పార్టీలు దీన్ని మరింత స్నేహపూర్వకంగా ,పరిష్కార-ఆధారితంగా పరిగణించేలా చేస్తుంది. ఇది చివరికి మరింత సమర్థవంతమైన వివాద పరిష్కారానికి వీలు కలిగిస్తుంది, ”అని ఆయన అన్నారు. హ్యాండ్ బుక్ గురించి మాట్లాడుతూ , జస్టిస్ చంద్రచూడ్, ఇది మూడు కీలక అంశాలను గుర్తిస్తున్నదన్నారు. మొదటిది, దేశంలోని అన్ని వర్గాల ప్రజలలో డిజిటల్ కార్యకలాపాలు విస్తృత స్థాయిలో పెరగడం, రెండోది ఉన్నత న్యాయవ్యవస్థ మద్దతు, మూడవది డిజిటల్ చెల్లింపుల వంటి వాటి విషయంలో ఆర్‌బిఐ, ఎన్‌పిసిఐ వంటివి ఒడిఆర్ ను చేర్చడం .
హ్యాండ్ బుక్ గురించి మాట్లాడుతూ , జస్టిస్ చంద్రచూడ్, ఇది మూడు కీలక అంశాలను గుర్తిస్తున్నదన్నారు. మొదటిది, దేశంలోని అన్ని వర్గాల ప్రజలలో డిజిటల్ కార్యకలాపాలు విస్తృత స్థాయిలో పెరగడం, రెండోది ఉన్నత న్యాయవ్యవస్థ మద్దతు, మూడవది డిజిటల్ చెల్లింపుల వంటి వాటి విషయంలో ఆర్‌బిఐ, ఎన్‌పిసిఐ వంటివి ఒడిఆర్ ను చేర్చడం . కోవిడ్ మహమ్మారి దృష్ట్యా అన్ని కోర్టులలో వర్చువల్ హియరింగ్‌లకు పెద్ద ఎత్తున మారడం వంటివి ఉన్నాయి.
“ అలాంటి వ్యవస్థ సమర్ధత ఇక ఎంత మాత్రం సిద్ధాంత పరమైనది కాదు. ప్రస్తుత వ్యవస్థ పనిచేయాలంటే మెరుగుపడవలసిన పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి.పరిష్కరించాల్సినవీ ఉంటాయి. ఒడిఆర్‌కు సంబంధించిన అంశం కూడా అలాంటిదే.సంస్థలు దీని కోసం కొరుతున్నాయి. వర్చువల్ కోర్టులకంటే ఎక్కువ గా కోరుతున్నాయి. అయితే ఇలా ఒడిఆర్ కోసం కోరుకోవడం అంటే ప్రతి వివాద పరిష్కార ప్రక్రియను ఒడిఆర్‌తో మార్పు చేయడం కాదు.
దేశంలోప్రతిచోటా అక్షరాస్యతా , డిజిటల్ వ్యాప్తి సాధించే వరకు ఇది సుదూర అవకాశంగానే భావించాలి. అయితే ఒడిఆర్ కు ఇది అననుకూలమని అనుకోవడం లేదు. మరోవైవు దీని ఉపయోగం మరింత బలమైన డిజిటల్ వ్యాప్తి, అక్షరాస్యతను ముందుకు తీసుకుపొవడానికి ఉపకరిస్తుందని,” ఆయన అన్నారు.
ఆర్ధిక వ్యవస్థ పెరుగుదలకు ఒడిఆర్ ఎలా ప్రయోజన కరంగా ఉంటుందో ఒడిఆర్ హ్యాండ్ బుక్ గుర్తించిందని అన్నారు.వ్యాపారవర్గాలు, సమర్ధమైన సత్వర పరిష్కారాన్ని కోరుకుంటున్నాయని, వ్యక్తులకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉండనున్నదని ఆయన అన్నారు.
నీతి ఆయోగ్ సిఇఒ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ, ఒడిఆర్ హ్యాండ్‌బుక్ పలువురు కంట్రిబ్యూటర్ల సమష్టి కృషితో రూపుదిద్దుకున్నదన్నారు. ఇది ఒడిఆర్‌ను ఇండియాలో వీలు కల్పించాలని అలాగే వ్యాపార సంస్థలకు సంబంధించికార్యాచరణ ప్రక్రియలను రూపొందించాలని కోరుకుంటున్నదన్నారు.
కోవిడ్ మహమ్మారి ఒడిఆర్ సత్వర అవసరాన్ని సూచిస్తున్నది. కోర్టులముందుకు వస్తున్న వివాదాలు ముఖ్యంగా రుణ, ఆస్థి, వాణిజ్య, రిటైల్ వివాదాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నందున ఒడిఆర్ అవసరం ఉంది. వ్యాపార, షాప్ొనర్లకు సంబంధించి ఉడాన్ ఇండియా వారి బి2 బి ప్లాట్‌ఫామ్ ఒక నెలలో 1800 వివాదాలను ఒడిఆర్ సర్వీస్‌ప్రొవైడర్‌ను ఉపయోగించుకుని పరిష్కరించింది. ప్రతి వివాద పరిష్కారానికి126 నిమిషాలు సగటున పట్టింది. రాగల నెలల్లో ఒడిఆర్ , సత్వర వివాదాల పరిష్కారానికి ఒక యంత్రాంగంగా ఉపయోగపడనుంది. ఒడిఆర్ హ్యాండ్ బుక్ వ్యాపార వర్గాలు అలా చేయడానికి వీలు కల్పిస్తుంది.
మరింత సమాచారం కోసం సందర్శించండి disputeresolution.online
***
(Release ID: 1711025)
Visitor Counter : 203