ఆయుష్
ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా రెండు రోజుల శాస్త్రీయ సదస్సు ఈ రోజు ప్రారంభమైంది
Posted On:
10 APR 2021 2:03PM by PIB Hyderabad
" హోమియోపతి - రోడ్‌మ్యాప్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్" అనే రెండు రోజుల సదస్సును న్యూఢిల్లీలో ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపద్ యెసో నాయక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త అపెక్స్ పరిశోధన సంస్థ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి (సిసిఆర్‌హెచ్) ఈ సమావేశాన్ని నిర్వహించింది. హోమియోపతి వ్యవస్థాపకులు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిక్ శామ్యూల్ హనీమాన్ జన్మదినం సందర్భంగా ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని (డబ్ల్యూహెచ్‌డీ) జరుపుకుంటారు.
అంటువ్యాధులను నియంత్రించడంలో హోమియోపతి సహకారం ఇప్పటికే అందరికీ తెలిసిందని సభలో ప్రసంగించిన శ్రీ శ్రీపాద్ నాయక్ ఉద్ఘాటించారు. కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వ మద్దతుతో హోమియోపతి కౌన్సిల్ అపారమైన సేవలు చేసిందని చెప్పారు. ఆయుష్ వైద్య విధానాల పరిశోధన ప్రతిపాదనలను ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. దానికి హోమియోపతి నుండి అధిక స్పందన వచ్చింది. వీటిలో కొన్ని టాస్క్ ఫోర్స్ కమిటీ మరియు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నుండి ఆమోదం పొందాయి. ఔషధంకు చెందిన ఇంటిగ్రేషన్ ఈ విధంగా పరీక్షించబడిందని.. సిసిఆర్‌హెచ్ ఈ సమావేశానికి ఇతివృత్తంగా ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.
ఈ సందర్భంగా, ఆయుష్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వైద్య రాజేష్ కోటేచా కోవిడ్-19 పై రోగనిరోధకతతో పాటు యాడ్ఆన్ చికిత్స కోసం నిర్వహించిన అన్ని పరిశోధన అధ్యయనాల ఫలితాలను అందించినందుకు సిసిఆర్‌హెచ్‌ను అభినందించారు. డా.రాజ్ కె. మంచంద, డైరెక్టర్, ఆయుష్, ఢిల్లీ ప్రభుత్వం మాట్లాడుతూ " విధాన రూపకర్తలు మరియు నిపుణుల మధ్య అనుభవాన్ని పంచుకోవడానికి ఈ శాస్త్రీయ సదస్సు ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పారు. హోమియోపతి రంగంలో పరిశోధకులు, వైద్యులు మరియు విద్యావేత్తలను సుసంపన్నం చేస్తారని ఆయన చెప్పారు.
సిసిఆర్‌హెచ్ సైంటిఫిక్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ వి.కె.గుప్తా మాట్లాడుతూ " ఈ సదస్సు అందించే నిర్మాణాత్మక సిఫార్సులు భారతదేశంలోని ప్రజారోగ్య వ్యవస్థలో హోమియోపతిని మరింత పరిపుష్టం చేస్తాయని"వ్యాఖ్యానించారు.
సిసిఆర్‌హెచ్ ప్రత్యేకమైన డిజిటల్ చొరవ అయిన హోమియోపతిక్ క్లినికల్ కేస్ రిపోజిటరీ (హెచ్‌సిసిఆర్) పోర్టల్ హోమియోపతిక్ క్లినిషియన్లు, పరిశోధకులు, వైద్య విద్యార్థులను సమాచారం అందించడం లక్ష్యంగా ఏర్పాటు చేశారు.
ఆరోగ్య సంరక్షణలో హోమియోపతిని మరింత సమర్థవంతంగా తయారు చేసేందుకు అవసరమైన చర్యలను గుర్తించడానికి విధాన నిర్ణేతలు మరియు నిపుణులు తమ అనుభవాలను పంచుకునే లక్ష్యంతో ఈ సదస్సును ఏర్పాటు చేశారు. సదస్సు ప్రారంభోత్సవంలో సిసిఆర్‌హెచ్ హోమియోపతిక్ క్లినికల్ కేస్ రిపోజిటరీని ప్రారంభించింది. హోమియోపతి ద్వారా చికిత్స పొందిన కేసులను దేశవ్యాప్తంగా ఉన్న అభ్యాసకుల నుండి హోమియోపతి ద్వారా సాక్ష్యాలను రూపొందించడానికి ఈ డేటాబేస్‌ను రూపొందించారు. ఈ సందర్భంగా సిసిఆర్‌హెచ్ ఏర్పాటు చేసిన ఈ-లైబ్రరీని కూడా ప్రారంభించారు. క్లినికల్ ప్రాక్టీస్ మరియు విద్యకు పరిశోధన యొక్క అనువాదాన్ని అందించే సిసిఆర్‌హెచ్ ప్రచురణలు కూడా విడుదలయ్యాయి.
హోమియోపతి ఎదుర్కొంటున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో అనే దానితో పాటు విధాన రూపకర్తలు ఆలోచించడానికి మరియు వారి అభిప్రాయాలను తెలియజేయడానికి భారతదేశంలో ఇంటిగ్రేటివ్ మెడిసిన్ పరిధిలో హోమియోపతికి స్కోప్ మరియు అవకాశాలపై ప్రారంభోత్సవలో ప్యానెల్ చర్చ జరిగింది. చర్చలో శ్రీ.రోషన్ జగ్గీ, డాక్టర్ అనిల్ ఖురానా, డాక్టర్ రాజ్ కె మంచంద, మరియు డాక్టర్ ఎంఎల్ ధావాలేలు పాల్గొన్నారు.
అల్లోపతి ఆసుపత్రుల సహకారంతో కొవిడ్-19పై సిసిఆర్‌హెచ్ పరిశోధన పత్రాలను ప్రదర్శించడంతో శాస్త్రీయ సెషన్ ప్రారంభమైంది. ప్రముఖ అభ్యాసకులు, పరిశోధకులు మరియు విద్యావేత్తలు హోమియోపతికి మద్దతుగా పరిశోధన పత్రాలను సమర్పించారు.
ప్రపంచ ఆరోగ్య సంరక్షణ సంక్షోభం నెలకున్న తరుణంలో సమర్థవంతమైన ఉపశమన విధానంగా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ గుర్తించబడాలని చర్చజరిగింది. అలాగే ఈ సెషన్‌లో ఇంట్రా ఆయుష్ కొలాబరేషన్ అనే ఆంశంపై ఇంటర్ డిసిప్లినరీ రంగానికి చెందిన అనుభవజ్ఞులైన వక్తలు ఇంటిగ్రేటివ్ క్లినికల్ కేర్‌లో తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సదస్సులో డాక్టర్ అనసూయ, బి. డాక్టర్ పర్వీన్ ఒబెరాయ్, డాక్టర్ ఎకె గుప్తా, డాక్టర్ విశాల్ చాధా మరియు డాక్టర్ ఎకె ద్వివేది తమ అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
ప్రశంసలు పొందిన ఇద్దరు అంతర్జాతీయ వక్తలు డాక్టర్ మైఖేల్ ఫ్రాస్, ప్రొఫెసర్ మెడిసిన్, వియన్నా ఇంటర్నల్ మెడిసిన్ మరియు ఇంటర్నల్ ఇంటెన్సివ్ కేర్ మెడిసిన్ స్పెషలిస్ట్ మరియు హాంకాంగ్‌కు చెందిన హెచ్‌కే అసోసియేషన్ ఆఫ్ హోమియోపతి అధ్యక్షుడు డాక్టర్ టు కా లూన్ ఆరోన్‌లు వర్చువల్ సమావేశంలో జాయిన్ కానున్నారు. ఇంటిగ్రేటివ్ క్లినికల్ కేర్‌పై వారి అనుభవాన్ని పంచుకుంటారు. అలాగే కేలంబక్కం, చెట్టినాడ్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, రీజెనరేటివ్ బయాలజీ అండ్ బయోటెక్నాలజీ విభాగం డాక్టర్ అంతారా బెనర్జీ హోమియోపతిపై తన పరిశోధన పత్రాలను పంచుకోనున్నారు.
నేషనల్ హెల్త్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ క్యాన్సర్, డయాబెటిస్, హృదయ సంబంధ వ్యాధులు మరియు స్ట్రోక్ (ఎన్‌పిసిడిసిఎస్), క్యాన్సర్ మరియు కేరళ రాష్ట్రంలో ఉపశమన సంరక్షణ కార్యక్రమాలు, వృద్ధాప్య సంరక్షణ, పోషకాహారలోపాన్ని అరికట్టడానికి కమ్యూనిటీ ఆధారిత చొరవ మొదలైన ఆంశాలపై నిపుణులు తమ అనుభవాలను సూచనలను హోమియోపతిపై సదస్సులో పంచుకుంటారు.
***
(Release ID: 1710948)
Visitor Counter : 215