అంతరిక్ష విభాగం
భారతదేశాని కి, జపాన్ కు మధ్య విద్య పరమైన, పరిశోధన పరమైన సహకారం - ఆదాన, ప్రదానాల కు గాను ఎమ్ఒయు
Posted On:
07 APR 2021 3:54PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన నేశనల్ ఎట్ మాస్ఫేరిక్ రిసర్చ్ లాబరేటరీ కి (ఎన్ఎఆర్ఎల్), జపాన్ లోని క్యోటో లో గల క్యోటో యూనివర్సిటీ కి చెందిన రిసర్చ్ ఇన్స్ టిట్యూట్ ఫార్ సస్ టేనబుల్ హ్యూమనస్ఫియర్ కు (ఆర్ఐఎస్ హెచ్) మధ్య 2020 నవంబరు 4న, 2020 నవంబరు 11న సంబంధిత సంస్థ ల మధ్య విద్య పరమైన, పరిశోధనాత్మకమైన సహకారం మరియు పరస్పర ఆదాన ప్రదానం కోసం ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాలైన సంగతి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకు రావడమైంది.
ఉద్దేశ్యాలు
• వాతావరణ విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం ఎన్ఎఆర్ఎల్ మరియు ఆర్ఐఎస్‌హెచ్ ల పరిశోధన సదుపాయాల ను వినియోగించుకొంటూ సహకార పూర్వకమైన విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు/ ప్రచార ఉద్యమాలు తత్సంబంధిత అధ్యయనాలు, విజ్ఞాన శాస్త్ర సంబంధిత సామగ్రి ఆదాన ప్రదాన ప్రచురణలు, సమాచారం సంయుక్త పరిశోధన సమావేశాలు, వర్క్ షాపులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకుల రాకపోకల రంగాల లో ఉభయ సంస్థలు వాటి సహకారాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఈ అవగాహన పూర్వక ఒప్పంద పత్రం వీలు కల్పిస్తుంది.
• ఈ ఎమ్ఒయు మాధ్యమం ద్వారా జపాన్ లోని శిగరాకీ లో మిడిల్ ఎండ్ అపర్ ఏట్ మాస్ఫియర్ (ఎమ్ యు) రేడార్, ఇండోనేశియా లోని కోతోతాబంగ్ లో గల ఇక్వెటరియల్ ఎట్ మాస్ఫియర్ రేడార్ (ఇఎఆర్), ఆర్ఐఎస్‌హెచ్ కు చెందిన అనుపూరక ఉపకరణాల తో పాటు ఎన్ఎఆర్ఎల్ వద్ద గల మేసస్ఫియర్-స్ట్రాటస్ఫియర్-ట్రోపస్ఫియర్ (ఎమ్ఎస్ టి ) రేడార్ , ఇంకా ఇతర ఉపలబ్ధ అనుపూరక ఉపకరణాల వంటి సదుపాయాలను పరస్పరం ఉపయోగించుకోవడం సాధ్యపడనుంది.
పూర్వరంగం
ఎన్ఎఆర్ఎల్, ఆర్ఐఎస్‌హెచ్ లు వాతావరణ సంబంధ విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విజ్ఞానం రంగం తో పాటు శాస్త్రవేత్త ల పరస్పర ఆదాన- ప్రదానం లోనూ సహకారాన్ని అందించుకొంటూ వస్తున్నాయి. ఈ వ్యవస్థ ను ఒక అవగాహనపూర్వక ఒప్పంద పత్రం మాధ్యమం ద్వారా 2008వ సంవత్సరం లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పైన ప్రస్తావించిన అవగాహనపూర్వక ఒప్పంద పత్రాన్ని 2013వ సంవత్సరం లో తిరిగి నవీకరించుకోవడమైంది. ఉభయ పక్షాలు కొత్త దిశానిర్దేశాలకు అనుగుణం గా సహకారాత్మక అనుసంధానానికి ప్రోత్సహాన్ని అందించడం కోసం ఒక సరికొత్త అవగాహనపూర్వక ఒప్పంద పత్రం పైన 2020వ సంవత్సరం నవంబరు లో సంతకాలు చేశాయి; ఈ పత్రాన్ని ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి, పుచ్చుకొన్నాయి.
ఆర్ఐఎస్‌హెచ్ నడుపుతున్న వాతావరణ రేడార్ సంబంధిత అంతర్జాతీయ పాఠశాల లో రిసోర్స్ పర్సన్స్ గా ఎన్ఎఆర్ఎల్ శాస్త్రవేత్తలు విధుల ను నిర్వర్తిస్తున్నారు. క్యోటో యూనివర్శిటీ కి చెందిన ఆచార్యులు, పరిశోధకుల బృందమొకటి ఎన్ఎఆర్ఎల్ ను సందర్శించింది; ఈ రెండు సంస్థలు చేపడుతున్న సహకారాత్మక పరిశోధన లను పటిష్టపరచడం కోసం ఒక కేంద్రిత కార్యశాల ను నిర్వహించడం జరిగింది.
***
(Release ID: 1710185)
Visitor Counter : 154