ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డబ్ల్యూహచ్ఓ ను ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ హర్ష్ వర్ధన్


భారత ప్రాచీన ఆలోచన విధానం 'వసుధైవ కుటుంబకం' ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా భావిస్తుంది- వాక్సిన్ మైత్రికి వెనుక ఉన్న
మూల సూత్రమిదే... అన్న డాక్టర్ హర్ష్ వర్ధన్

Posted On: 07 APR 2021 11:38AM by PIB Hyderabad

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ కార్యాలయాన్ని ఉద్దేశించి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రసంగించారు. 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001K6MR.png

ప్రపంచ సమాజం కలిసి మహమ్మారితో పోరాడుతున్న సంవత్సరానికి గుర్తుగా ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఉందని అన్నారు. ఈ సంవత్సరానికి ఎంచుకున్న ఇతివృత్తం , 'ప్రతిఒక్కరికీ మంచి మరియు ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడం'.  మన విధానాలు, కార్యక్రమాలు మరియు చర్యలు అందరికీ ఆరోగ్యకరమైన భవిష్యత్తు వైపు తీసుకెళ్లాలి అని డాక్టర్ హర్ష్ వర్ధన్ తెలిపారు.

"ప్రజల ఆరోగ్యం ప్రాథమికంగా సమాజంలోని సామాజిక వస్తువులు మరియు సేవలకు న్యాయమైన ప్రాప్యతపై ఆధారపడి ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఆరోగ్యం సమ లభ్యత  మరియు సాంఘిక న్యాయం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. ఈ గత సంవత్సరం ఆరోగ్య సేవలకు సార్వత్రిక ప్రాప్యతను ప్రతి పౌరుడికి వారి సామాజిక-ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా నివారణ నుండి చికిత్స వరకు. నిర్ధారించాల్సిన అవసరం వచ్చింది" అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.

ఈ రోజు నిర్వహించిన ఈ కార్యక్రమం మంత్రిత్వ శాఖ, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉమ్మడి నిబద్ధత, ‘అందరికీ ఆరోగ్యం’ అని నిర్ధారించే స్థితిస్థాపక ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం లక్ష్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రాధమిక ఆరోగ్య సేవల బలమైన పునాది ఆధారంగా సార్వత్రిక ఆరోగ్య కవరేజీని అందించడం, ప్రజలకు ప్రోత్సాహక మరియు నివారణ నుండి చికిత్స, పునరావాసం మరియు ఉపశమన సంరక్షణ వరకు సమగ్ర సంరక్షణకు ప్రాప్తిని కలిగిస్తుందని నిర్ధారిస్తుంది. ఈ మార్గాల్లో ఇండియా తన ప్రధాన ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిందని చెప్పారు.  ఇందులో రెండు భాగాలున్నాయని ఆయన తెలిపారు.

సమగ్ర ప్రాధమిక ఆరోగ్య సంరక్షణను అందించడానికి 150,000 ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాల స్థాపన మొదటి ప్రయత్నం. ఆరోగ్య పద్ధతుల ప్రోత్సాహం, వ్యాధి నివారణ, సామాజిక అభివృద్ధి కోసం బహుళ రంగాల చర్యలపై దృష్టి సారించాలి. ఇందులో పౌరులు చురుకుగా పాల్గొంటారు. 

రెండవ భాగం ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఇది నగదు రహిత సౌకర్యం అందించేలా కుటుంబానికి రూ.5 లక్షల వరకు కవర్ అయ్యే ఆరోగ్య సంరక్షణ కల్పించడం.  

మన పౌరులలో 500 మిలియన్లకు పైగా ద్వితీయ మరియు తృతీయ సంరక్షణకు ప్రాప్యత భరోసా ఆరోగ్య సంరక్షణ సేవలను సమానంగా అందించే దిశగా చెప్పుకోదగినఅడుగులు పడ్డాయి. ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడానికి మరియు ఇలాంటి మార్గాల్లో ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి అసమానతలను పరిష్కరించడానికి, మరింత సంఘటిత మరియు కేంద్రీకృత చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ అన్నారు. సరిహద్దులు దాటి అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ చేసిన సూచన సద ఆచరణీయం అని ఆయన అన్నారు. ఈ దిశగా భారత్ కోవిడ్-19 కి ప్రతిస్పందనగా ప్రపంచానికి సహకారం అందించే దృక్పథంతో భారత్ పని చేస్తుందని ఆయన తెలిపారు. వాక్సిన్ మైత్రి అనే చొరవతో 80 దేశాలకు భారత్ కోవిడ్ వాక్సిన్ ను అందజేసిందని ఆయన చెప్పారు. ప్రాచీన తత్వం వసుధైవ కుటుంబం అనేది ఈ సంస్కృతిలో ఒక భాగమని, ప్రపంచం ఒక కుటుంబం అన్నదే మా సూత్రం అని కేంద్ర మంత్రి తెలిపారు. 

"ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2021 సందర్భంగా, భారత ప్రభుత్వం తరపున నేను ఒక విషయం పునరుద్ఘాతిస్తున్నాను, ప్రజలందరికీ, నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందేలా చూడాలన్నదే మా నిబద్ధత. ఎక్కడ, ఎప్పుడు ఏ అవసరమైన, ఆర్థిక ఇబ్బందులు లేకుండా సజావుగా, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించే దిశగా పయనం సాగిద్దాం" అని డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టం చేశారు. 

 

****



(Release ID: 1710058) Visitor Counter : 168