నౌకారవాణా మంత్రిత్వ శాఖ

పోర్ట్స్, షిప్పింగ్ & జలమార్గాల మంత్రిత్వ శాఖ 58 వ జాతీయ మారిటైమ్ దినోత్సం-2021 ను జరుపుకుంది.


ఏప్రిల్ 5 ను జాతీయ మారిటైమ్ దినోత్సంగా జరుపుకుంటారు

భారతదేశం మారుతోంది, భారతదేశం ముందుకు దూసుకువెళ్తోంది , గతంలో మాదిరిగానే మనం సముద్ర నాయకుడిలా వ్యవహరిస్తూ నూతన భారతదేశం నిర్మిస్తున్నాము, భారతదేశం సముద్ర రంగం ద్వారా ప్రపంచాన్ని మళ్లీ నడిపిస్తుంది: శ్రీ మాండవియా

Posted On: 05 APR 2021 6:51PM by PIB Hyderabad

పోర్ట్స్, షిప్పింగ్ & జలమార్గాల మంత్రిత్వ శాఖ 58 వ జాతీయ మారిటైమ్ దినోత్సం-2021 ను జరుపుకుంది. ఏప్రిల్ 5, 1919న  మొట్టమొదటి భారతీయ వ్యాపార నౌక అయిన 'ఎస్.ఎస్.లోయల్టీ' (ఎం/ఎస్‌. సిందియా స్టెమ్ నావిగేషన్‌ కంపెనీ) ముంబై నుండి లండన్‌కు బయల్దేరింది. ఆ చారిత్రకక ఘటనకు గుర్తుగా ఏటా ఏప్రిల్‌ 5న జాతీయ మారిటైమ్ దినోత్సంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది భారత జాతీయ మారిటైమ్ దినోత్సం ఇతివృత్తం భారత ప్రభుత్వం చేపట్టిన‘ఆత్మ నిర్భర్ భారత్’చొరవతో ‘కొవిడ్‌-19 ను మించిన సస్టైనబుల్ షిప్పింగ్’.


జాతీయ మారిటైమ్ దినోత్సవం సందర్భంగా, ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల సహాయ మంత్రి (ఐ / సి) శ్రీ మన్సుఖ్ మాండవియా మారిటైమ్ సమాజాన్ని అభినందించారు. వారి కృషి, ఉత్సాహం, ధైర్యంతో పాటు కొవిడ్ మహమ్మారి సమయంలో వారు పోషించిన పాత్రను అభినందించారు. భారత ప్రధాని ఇటీవల ప్రారంభించిన మారిటైమ్ ఇండియా విజన్ -2030 భారతదేశ సముద్ర రంగానికి వచ్చే దశాబ్ద కాలాని మార్గదర్శకమని చెప్పారు. కేంద్రీకృత విధానంతో త్వరలోనే భారత సముద్ర రంగం బలంగా, సాంకేతికంగా, అత్మనిర్భర్‌గా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

‘భారతదేశం మారుతోంది, భారతదేశం ముందుకు పరుగెత్తుతోంది, కొత్త భారతదేశం నిర్మించబడుతోంది, మనం గతంలో సముద్ర నాయకుడిలాగే ఉన్నాము, సముద్ర రంగం ద్వారా భారతదేశం  ప్రపంచాన్ని మళ్లీ నడిపిస్తుంది’ అని చెబుతూ శ్రీ మాండవియ తన ప్రసంగాన్ని ముగించారు.


58 వ జాతీయ మారిటైమ్ దినోత్సవానికి స్మారక చిహ్నంగా శ్రీ మాండవియా ఈ-మ్యాగజైన్‌ను ప్రారంభించారు. మరియు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని నేషనల్ మారిటైమ్ డే సెలబ్రేషన్ కమిటీ ఏర్పాటు చేసిన అవార్డులను ప్రదానం చేశారు.


కోవిడ్ కాలంలో మారిటైమ్ సమాజం ముఖ్యపాత్ర పోషించిందని, ప్రపంచ సముద్ర రంగంలో భారతదేశానికి నాయకత్వ స్థానం ఇవ్వడానికి ప్రగతిశీల విధాన మార్పులను తీసుకురావడానికి మంత్రిత్వ శాఖ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సంజీవ్ రంజన్ అన్నారు.


మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, డిజి షిప్పింగ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు, పోర్ట్ అధికారులు మరియు మారిటైమ్‌ రంగానికి చెందిన ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు:

https://youtu.be/zFRQq1AhwzI

***



(Release ID: 1709796) Visitor Counter : 190