ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఏజ్ కేర్ ఇండియా 40 వార్షికోత్సవం పెద్దల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కోవిడ్ వారియర్ల తల్లుల త్యాగాలను గుర్తు చేసుకున్న మంత్రి


'' దేవుడు సర్వాంతర్యామి, తల్లుల రూపంలో దేవుడు ప్రతి చోటా వుంటారు" : హర్షవర్ధన్

'' కోవిడ్ ప్రారంభ సమయంలో ఒకేఒక్క ప్రయోగశాల కలిగివున్న దేశంలో ప్రస్తుతం 2000 ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయి'' మంత్రి

Posted On: 04 APR 2021 5:01PM by PIB Hyderabad

ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో ఈ రోజు జరిగిన ఏజ్ కేర్ ఇండియా 40 వార్షికోత్సవంలో  కేంద్ర  ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా నిర్వహించిన పెద్దల దినోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు ఎయిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్. గులేరియా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సీతా రామ్ భారతీయ ఇన్స్టిట్యూట్‌లోని మెడిసిన్ అండ్  నేషనల్ సైన్స్ అకాడమీ ప్రొఫెసర్ ఎమెరిటస్ మరియు సీనియర్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ జె.ఎస్. గుల్రియా,  సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ జిపి సేథ్ లకు “అత్యంత ప్రముఖ సీనియర్ సిటిజన్” అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. . 

వైద్య రంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులకు పురస్కారాలను ప్రధానం చేసి వారిని సత్కరించిన ఏజ్ కేర్ ఇండియా ను అభినందించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పెద్దలకు ఆరోగ్య సంరక్షణ కల్పిస్తున్న సంస్థను అందిస్తున్న సేవలను ప్రస్తుతించారు. 

కోవిడ్ సమయంలో ప్రజల ఆరోగ్య సంరక్షణ అంశంలో ఆరోగ్య కార్యకర్తలు విలువైన సేవలను అందించారని మంత్రి అన్నారు. వైద్య వృత్తిలో వున్న  కుమారులు కుమార్తెల తల్లులు   కొవిడ్ సమయంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని మంత్రి అన్నారు. తమ కుమారులు, కుమార్తెలు ప్రమాదంలో వున్నారని తెలిసినా వారి తల్లితండ్రులు వృత్తి నుంచి తప్పుకోవాలని వారిని ఎన్నడూ కోరలేదని ఆయన అన్నారు. భగవంతుడు  సర్వాంతర్యామి అని రుజువు చేయడానికి తల్లులు తార్కాణమని మంత్రి అన్నారు. 

ప్రతిఒక్కరి సహకారంతో భారతదేశం కోవిడ్-19ని సమర్ధవంతంగా ఎదుర్కొని వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో విజయం సాధించిందని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. చైనాలో కోవిడ్ ని గుర్తించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ  చేసిన వెంటనే భారతదేశం రంగంలోకి దిగి 48 గంటల్లో నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసిందని మంత్రి వివరించారు. రోజుకి 10 లక్షల పరీక్షలను నిర్వహిస్తున్నామని అన్నారు. కోవిడ్ ప్రారంభం అయిన సమయంలో దేశంలో ఒకేఒక్క ప్రయోగశాల అందుబాటులో ఉందని. ఇప్పుడు ఈ సంఖ్య 2000కి పెరిగిందని ఆయన వివరించారు. 

మహమ్మారి తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో భారత్ 150 కి పైగా దేశాలకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేసిందని మంత్రి అన్నారు .  భారతదేశంలో  7.5 కోట్ల మోతాదులటీకాలను  అందించి 6.5 కోట్లకు పైగా మోతాదులను ఇతర దేశాలకు కూడా సరఫరా చేశామని మంత్రి వివరించారు.

పెద్దల ఆరోగ్య సంరక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు.  “వృద్ధులు మరియుఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకాలు వేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నాము. ప్రజలందరి మరియు ముఖ్యంగా దేశంలోని వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ” అని మంత్రి అన్నారు. వృద్ధుల ఆరోగ్య సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇప్పటికే "వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం జాతీయ కార్యక్రమం" (ఎన్‌పిహెచ్‌సిఇ) అమలు చేస్తున్నాదని తెలిపారు. 

 భారతదేశ మనుగడ రెండు సిద్ధాంతాలపై ఆధారపడి ఉందని మంత్రి అన్నారు.మానవతావాదం మరియు జాతీయవాదం అనే రెండు సిద్ధాంతాలు ఆధారంగా విలువలతో కూడిన నూతన భారతదేశ ఏర్పాటు తమ లక్ష్యమంటూ  2017 లో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ప్రసంగం చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు.  ఏజ్-కేర్ ఇండియా వంటి సంస్థలు అటువంటి ప్రయత్నంలో పెద్ద పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు.

ఆరోగ్య సంరక్షణకు ఏజ్-కేర్ ఇండియా అందిస్తున్న సేవలకు ప్రభుత్వ సహకారం ఉంటుందని డాక్టర్ హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. 

***



(Release ID: 1709540) Visitor Counter : 163


Read this release in: Punjabi , English , Urdu , Hindi