ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 టీకాల కార్యక్రమం- 77వ రోజు
7 కోట్లకు పైగా టీకాలతో మరో మైలురాయి దాటిన భారత్ నిన్న సాయంత్రం 8 వరకు 12.76 లక్షల టీకాలు
Posted On:
02 APR 2021 9:51PM by PIB Hyderabad
కోవిడ్ మహమ్మారి మీద పోరులో భాగంగా భారత్ మరో కీలకమైన మైలురాయి దాటింది, ఈరోజుకు మొత్తం కోవిడ్ టీకా డోసుల సంఖ్య 7 కోట్లు దాటింది. అందులో మొదటి డోస్ అందుకున్నవారి సంఖ్య ఆరు కోట్లు దాటింది. నిన్న సాయంత్రం 8 గంటలవరకు టీకాలు టీసుకున్నవారి సంఖ్య 7,06,18,026 కు చేరింది. వీరిలో
89,03,809 మంది ఆరోగ్య సిబ్బంది మొదటి డోస్ తీసుకున్నవారు, 52,86,132 మంది రెండో డోస్ తీసుకున్నవారు ఉండగా 95,15,410 మంది మొదటి డోస్ తీసుకున్న కోవిడ్ యోధులు, 39,75,549 మంది రెండో డోస్ తీసుకున్న కోవిడ్ యోధులు, 4,29,37,126 మంది మొదటి డోస్ తీసుకున్న 45 ఏళ్ళు పైబడ్డవారు ఉన్నారు.
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45ఏళ్ళుపైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
89,03,809
|
52,86,132
|
95,15,410
|
39,75,549
|
4,29,37,126
|
6,13,56,345
|
92,61,681
|
టీకాల కార్యక్రమం మొదలైన 77వ రోజైన నిన్న సాయంత్రం 8 వరకు మొత్తం 12,76,191 టీకాల పంపిణీ జరిగింది. అందులో 12,40,764 మందికి మొదటి డోస్, 35,427 మందికి రెండో డోస్ ఇచ్చారు.
తేదీ: ఏప్రిల్ 2, 2021
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
45 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
1వ డోస్
|
1వ డోస్
|
2వ డోస్
|
17,861
|
8,487
|
38,986
|
26,940
|
11,83,917
|
12,40,764
|
35,427
|
(Release ID: 1709348)
Visitor Counter : 147