రక్షణ మంత్రిత్వ శాఖ
తక్కువ బరువు గల తేలికపాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అభివృద్ధి చేసిన డీఆర్‌డీఓ
Posted On:
01 APR 2021 4:45PM by PIB Hyderabad
భారత సైన్యం గుణాత్మక అవసరాలను తీర్చేలా 'డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) పరిశోధన శాల, కాన్పూర్‌లోని 'డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (డీఎంఎస్‌ఆర్‌డీఈ) 9.0 కిలో గ్రాముల బరువున్న తేలిక పాటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను (బీపీజే) అభివృద్ధి చేసింది. ఈ 'ది ఫ్రంట్ హార్డ్ ఆర్మర్ ప్యానెల్' (ఎఫ్‌హెచ్ఏపీ) జాకెట్‌ను ఛండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (టీబీఆర్ఎల్) వద్ద పరీక్షించారు. సంబంధిత బీఐఎస్ ప్రమాణాలను ఈ ఎఫ్‌హెచ్ఏపీ తట్టుకొని నిలిచింది.
ఈ కీలకమైన అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ప్రతి గ్రాము బీపీజే బరువు తగ్గింపు సైనికుల సౌకర్యాన్ని పెంచడంలో కీలకమైనదిగా నిలుస్తుంది మనుగడను కూడా నిర్ధారిస్తుంది.
ఈ టెక్నాలజీ మీడియం సైజ్ బీపీజే బరువును 10.4 నుండి 9.0 కిలోగ్రాములకు తగ్గిస్తుంది.
ఈ ప్రయోజనం కోసం ప్రయోగశాలలలో చాలా నిర్దిష్ట పదార్థాలు మరియు ప్రాసెసింగ్ టెక్నాలజీలు అభివృద్ధి చేయబడ్డాయి. సైనికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా తేలికపాటి బీపీజేలను అభివృద్ధి చేసినందుకు డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు మరియు పరిశ్రమ వర్గాల్ని రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ అభినందించారు. తేలికపాటి బీజీజేలను అభివృద్ధి చేసిన డీఎంఎస్‌ఆర్‌డీఈ బృందాన్నిరక్షణ శాఖ ఆర్ అండ్ డీ శాఖ కార్యదర్శి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి అభినందించారు.
***
(Release ID: 1709198)
Visitor Counter : 221