కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితులపై ప్రమాణాలకోసం కసరత్తు


కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ చొరవతో నిపుణుల కమిటీల నియామకం

Posted On: 01 APR 2021 1:52PM by PIB Hyderabad

  వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికుల వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితులకు సంబంధించిన చట్టాలను సరళీకరిస్తూ, వివిధ రకాలైన 13 కార్మిక శాసనాలను సమ్మిళితం చేస్తూ ఒకే చట్టాన్ని కేంద్రప్రభుత్వం రూపొందించింది. 2020వ సంవత్సరపు వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితుల చట్టం పేరిట ఈ చట్టానికి రూపకల్పన చేశారు.

 ఫ్యాక్టరీలు, ఓడరేవులు, నిర్మాణ స్థలాల్లో కార్మికుల భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితులకు సంబంధించి ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలను సమీక్షించేందుకు నిపుణుల కమిటీలను కేంద్రప్రభుత్వం నియమించింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన సబ్జెక్టు నిపుణులతో ఈ కమిటీలను నియమించారు. ఫ్యాక్టరీలు, ఓడరేవులకు సంబంధించిన నిపుణుల కమిటీకి చైర్మన్ గా,..ముంబైలోని ఫ్యాక్టరీ అడ్వైజ్ సర్వీసు, లేబర్ ఇన్.స్టిట్యూట్స్ డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం డైరెక్టర్ జనరల్ అయిన డాక్టర్ ఆర్.కె. ఇళంగోవన్.ను నియమించారు. భవననిర్మాణం, ఇతర నిర్మాణ పనులకు సంబంధించి నిపుణుల కమిటీకి చైర్మన్.గా చెన్నైలోని ఎల్. అండ్ టి డొమెస్టిక్ ఆపరేషన్స్ అధిపతి పి.ఎల్.ఎన్. మూర్తిని, అలాగే, అగ్నిమాపకం, రక్షణ ఇతర భద్రతా అంశాలకు సంబంధించిన కమిటీకి చైర్మన్ గా కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ అగ్నిమాపక అంశాల సలహాదారు డి.కె. షమీని నియమించారు.

 ప్రస్తుతం ఉన్న నియమ నిబంధనలు, సమీక్షకు అసవరమైన కారణాలను ఈ కింద చూడవచ్చు.:

క్రమ

సంఖ్య

 

నియమ నిబంధనల పేరు

 

నియమ నిబంధనలను రూపొందించిన సంవత్సరం

 

నియమ నిబంధనల రూపంలోని మొత్తం ప్రమాణాలు

 

సమీక్షకు కారణాలు

 

1

1948 సంవత్సరపు ఫ్యాక్టరీల చట్టం ప్రకారం రూపొందిన నియమ నిబంధనలు

 

1950

 

113

 

1. ఫ్యాక్టరీలు, రేపులు, నిర్మాణ స్థలాల్లో పనులకు సంబంధించి నియమ నిబంధనల రూపంలో ప్రస్తుతం ఉన్న ప్రమాణాలను,.. వాటిని వెలువరించిననాటినుంచి ఇప్పటివరకూ సమీక్షించలేదు. అంటే, 1950, 1990, 1998 సంవత్సరాల్లో నోటిఫై చేసినప్పటినుంచి వాటిపై సమీక్ష జరగలేదు. అందువల్ల సాంకేతిక పరిజ్ఞాన ప్రగతి, వ్యవస్థల్లో మార్పుల నేపథ్యంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వాటిని తప్పనిసరిగా నవీకరించాల్సి వచ్చింది.  

 

2

రేవు కార్మికుల (భద్రత, ఆరోగ్య సంక్షేమ) నిబంధనలు1990

1990

 

102

 

2. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితుల విషయంలో తాజా ప్రగతిని, ఇతర అంశాలను చట్టంలో పొందుపరచడం.

 

3

భవన నిర్మాణ, ఇతర నిర్మాణ పనుల కార్మికులు (ఉద్యోగం, సర్వీసు నిబంధనల) కేంద్ర నిబంధనలు,1998

 

1998

 

196

 

3. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పనిపరిస్థితులకు సంబంధించి ప్రపంచ ప్రమాణాలకు దీటుగా నిలపవడం.

 

  ఇందుకు సంబంధించి, కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ మాట్లాడుతూ, “ఇటీవలి కాలంలో పని ప్రదేశాల్లో అగ్ని ప్రమాదాలు పెరిగి, మా కార్మికుల్లో వారి కుటుంబాల్లో కష్టాలు, ఆందోళనలు ఏర్పడటం, జాతీయ ఆర్థిక వ్యవస్థకు భారీ స్థాయిలో నష్టం జరగడం వంటి పరిణామాల నేపథ్యంలో,  అగ్నిప్రమాదాల నుంచి రక్షణకు సంబంధించి పాటించవలసిన ప్రమాణాలపై విడిగా ఒక కమిటీ ఏర్పాటైంది. అగ్ని ప్రమాదాలనుంచి రక్షణపై సమగ్రమైన, పరిపూర్ణమైన వైఖరితో ఈ కమిటీని ఏర్పాటుచేశాం. పైన పేర్కొన్న నియమ నిబంధనలతోపాటుగా, 2016వ సంవత్సరపు జాతీయ భవన నిర్మాణ నిబంధనల చట్టంతో సమ్మిళితంచేస్తూ ఈ కమిటీని ఏర్పాటు చేశాం.” అని చెప్పారు.

   దేశవ్యాప్తంగా ఉన్న కార్మికుల భద్రత, ఆరోగ్యానికి సంబంధించి ఒకే రకమైన, నవీకరించిన ప్రమాణాలను పొందుపరిచేందుకు ఈ ప్రక్రియ దోహదపడుతుందని కేంద్రమంత్రి గాంగ్వర్ అభిప్రాయపడ్డారు. అన్ని రకాల నియంత్రణలు, సంబంధిత వర్గాల క్రియాశీలక భాగస్వామం కూడా ఇందుకు ఉపకరిస్తుందన్నారు. దీనితో వివిధ సంస్థల్లోని కార్మికులు తమ పని సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని, భాగస్వామ్య వర్గాలవారందరికీ సమాన అవకాశాలు ఏర్పడతాయని, ఉత్పాదకత కూడా భారీస్థాయిలో పెరుగుతుందని గాంగ్వర్ అన్నారు.  

 

****


(Release ID: 1709047) Visitor Counter : 274


Read this release in: English , Urdu , Hindi , Punjabi