ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

హోప్ కన్సార్టియం నిర్వహించిన ''వరల్డ్ ఇమ్యునైజేషన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్"లో ప్రసంగించిన డాక్టర్ హర్ష్ వర్ధన్


భారతదేశం యొక్క నిబద్ధత మరియు వ్యూహాత్మక ప్రజారోగ్య చర్యలు మరియు నిర్వహణ నిర్ణయాలను ముఖ్యంగా ప్రస్తావించారు.

"మా సామూహిక నిర్ణయాలు టీకా సమాన పంపిణీ కోసం భవిష్యత్తు విధానాన్ని రూపొందిస్తాయి"

Posted On: 30 MAR 2021 7:49PM by PIB Hyderabad

 

ఈ రోజు ''వరల్డ్ ఇమ్యునైజేషన్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్"లో ఆసియా అంతటా వ్యాక్సిన్ ఉత్పత్తి మరియు పంపిణీపై జరిగిన ప్యానెల్ చర్చలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ డిజిటల్‌గా పాల్గొన్నారు.


ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్లను అందించే ప్రయత్నంలో ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మరియు అత్యంత సంక్లిష్టమైన లాజిస్టికల్ ఆపరేషన్‌ను ఎదుర్కొంటున్న నేపథ్యంలో జరిగిన ఈ వర్చువల్‌ సమావేశంలో..ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1000 మంది పాల్గొన్నారు. ప్రపంచ సరఫరా గొలుసులు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను పరిష్కరించడంపై కార్యక్రమంలో చురుకైన చర్చ చేపట్టారు.


కొవిడ్ -19 వ్యాక్సిన్ల ఉత్పత్తిని భారతదేశం ఎలా పెంచుకుంటుంది మరియు ఈ టీకాల సకాలంలో పంపిణీని నిర్ధారించడానికి స్థానిక మరియు అంతర్జాతీయ భాగస్వాములతో ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో తెలుసుకోవటానికి ప్యానెల్ ఉత్సాహం చూపించింది.


భారతదేశం యొక్క టీకా పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ హర్ష్ వర్ధన్ వివరించారు. భారత దేశంలో అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్లు కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్‌లను 60 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారితో పాటు దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి టీకాలో మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. 2021 ఏప్రిల్ 1 నుండి  45 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులందరినీ టీకాలు వేయాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది.


ప్రపంచంలో 60% వ్యాక్సిన్‌ను భారతదేశం ఉత్పత్తి చేస్తుందని అందరికీ గుర్తుచేశారు.  భారతదేశం యొక్క సార్వత్రిక వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి చెందిన మౌలిక సదుపాయాలు కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్‌కు ఎలా ఉపయోగపడ్డాయో కూడా వివరించారు. పరస్పర సహకారం మరియు ఒక దేశస్థులు లేదా మొత్తం మానవాళికి సేవ చేయడం అనే డైకోటోమీపై ఆయన ఇలా అన్నారు "దేశంలో ఇప్పటికే 61 మిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులను అందించాం. సైన్స్ యొక్క ప్రయోజనాలు మొత్తం ప్రపంచానికి అందించబడాలని మేము ఎల్లప్పుడూ భావిస్తున్నాము. వివిధ కార్యక్రమాల కింద 84 దేశాలకు 64 మిలియన్ డోసులు ఇవ్వబడ్డాయి."

టీకా అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించింది; టీకా కోసం నిపుణుల బృందం  ప్రయోగానికి 6 నెలల ముందు ఏర్పడింది. అది టీకా, దాని తయారీ, లాజిస్టిక్స్ మరియు పరిపాలన యొక్క ప్రతి వివరాలను ప్రణాళిక చేసింది. అరడజను వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్ లో ఉన్నాయి. ఒక డజను టీకాలు ప్రీ క్లినికల్ ట్రయల్‌లో ఉన్నాయి. వాటిని కమిటీ పర్యవేక్షిస్తోందని డాక్టర్ హర్ష్‌వర్ధన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ పరిశోధన మరియు అభివృద్ధి కోసం గణనీయమైన మొత్తంలో నిధులు కేటాయించినట్లు కేంద్ర మంత్రి సమాచారం ఇచ్చారు.

ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను ఆపరేట్ చేయడానికి మరియు సరఫరా చేయడానికి ప్రపంచ శక్తులు కలిసి వస్తున్న ప్రశ్నపై డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రసంగించారు. హోప్‌ కన్సార్టియం సహకారాన్ని స్వాగతించే చర్యగా డాక్టర్ హర్ష్‌వర్ధన్ ప్రశంసించారు. టీకా సమానమైన పంపిణీ కోసం భవిష్యత్తు విధానాన్ని రూపొందించడంలో ఇది సహాయపడుతుంది. ధ్రువీకరణలో ఒక సాధారణ వేదిక ఉందని నిర్ధారించడానికి డబ్లుహెచ్‌వో నిబద్ధతలో ఇది బలోపేతం చేస్తుంది. ప్రపంచంలోని మొత్తం అన్ని తయారీ సంస్థలు ఒకే పేజీలో ఉన్నాయి. అలాగే వ్యాక్సిన్ సమాన పంపిణీకి అందరు వాటాదారులు కట్టుబడి ఉన్నారు. మేము ఒకరి అనుభవాల నుండి మరియు వివిధ మార్గదర్శకాల నుండి నేర్చుకున్నాము. ఈ కసరత్తు స్కేల్ చేయవలసిన అవసరం చాలా ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లోని ప్రతి ఒక్కరికి టీకాలు వేసే వరకు ఆత్మపరిశీలన చేసుకోవాలి మరియు సమీక్షించాలి. " అందరూ సురక్షితంగా ఉండే వరకు ఎవరూ సురక్షితంగా లేరు"అనే వాక్కును ఆయన వారికి గుర్తు చేశారు.


టీకా కార్యక్రమాన్ని రూపొందించడంలో తాను ఎదుర్కొన్న అతి పెద్ద సవాళ్లను మంత్రి గుర్తుచేసుకున్నారు.  "1.35 బిలియన్ల భారీ జనాభా మరియు భారీ వైవిధ్యం ఉన్న భారతదేశమే పెద్ద సవాలు. మా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మేము ఈ సవాలును చేపట్టాము. గత సంవత్సరం జనవరి 17 న సంక్షోభం నెలకునేందుకు చాలా కాలం ముందు మేము ఒక సూచనను అందించాం. టెస్టింగ్‌ కేంద్రాల అభివృద్ధి, వెంటిలేటర్లు, ట్రాకింగ్, నిఘా, నిర్బంధ కేంద్రం కోసం సౌకర్యాలను అభివృద్ధి చేశాము. సరైన ప్రవర్తనే కొవిడ్‌కు అత్యంత శక్తివంతమైన టీకా అని స్పష్టం చేశాము. వ్యాక్సిన్లను ప్రారంభించిన తరువాత మొదటగా ఆరోగ్య సంరక్షణ కార్మికులు, ఫ్రంట్ లైన్ కార్మికులు, 45 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు 60 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యత ఇచ్చాము. ఇప్పుడు 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ అందిస్తా. దేశవ్యాప్తంగా 50,000 కేంద్రాలను ప్రారంభించాలని కూడా మేము ప్రణాళిక వేసుకున్నాము. దీని కోసం 7 లక్షల వ్యాక్సినర్లకు శిక్షణ ఇచ్చాము.

కొవిడ్ వ్యాక్సిన్లను సురక్షితమైన మరియు సమర్థవంతమైన పంపిణీకి మద్దతుగా సరఫరా గొలుసు పరిష్కారాలను అందించడానికి స్థాపించబడిన హోప్ కన్సార్టియం వంటి ప్రభుత్వ-ప్రైవేట్ పొత్తుల అవసరాన్ని ప్రశంసిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రి చర్చను ముగించారు.

గ్లోబల్ ప్యానెల్ చర్చను ప్రముఖ న్యూస్ యాంకర్ లారా బక్‌వెల్ మోడరేట్ చేశారు. ప్యానెల్‌లో మాధవ్ కురుప్, రీజినల్ సిఇఒ మెసా, హెల్మాన్ వరల్డ్‌వైడ్ లాజిస్టిక్స్ మరియు కో-ప్యానలిస్టులుగా ఇంటర్నేషనల్ ఎస్‌ఓఎస్ సహ వ్యవస్థాపకులు మరియు గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పాస్కల్ రే-హెర్మ్ ఉన్నారు.

***



(Release ID: 1708603) Visitor Counter : 209


Read this release in: English , Urdu , Hindi