ప్రధాన మంత్రి కార్యాలయం

గుజ‌రాత్ లోని అహ‌మ‌దాబాద్ లో ‘న‌మ‌స్తే ట్రంప్’ కార్య‌క్ర‌మం ఆరంభ సందర్భం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 24 FEB 2020 3:51PM by PIB Hyderabad

భార‌త్ మాతా కీ జ‌య్‌,

భార‌త్ మాతా కీ జ‌య్‌,

భార‌త్ మాతా కీ జ‌య్‌,

న‌మ‌స్తే ట్రంప్, న‌మ‌స్తే ట్రంప్.  ‘ఇండియా-యుఎస్ ఫెండ్‌శిప్’ అని నేను అంటాను.  దానికి మీరేమో  ‘వ‌ర్ధిల్లాలి’-‘వ‌ర్ధిల్లాలి’ అని ప‌లుకుతారు.  ఇండియా-యుఎస్ ఫ్రెండ్‌ శిప్,  ఇండియా-యుఎస్ ఫ్రెండ్‌ శిప్,  ఇండియా-యుఎస్ ఫ్రెండ్‌ శిప్.

న‌మ‌స్తే.

ఈ రోజు న మోటేరా స్టేడియమ్ లో ఒక క్రొత్త చ‌రిత్ర ను సృష్టించ‌డం జ‌రుగుతోంది.  ఈ రోజు న చ‌రిత్ర త‌న‌ను తాను మ‌రో మారు ఆవిష్క‌రించుకొంటూ ఉండడానికి మ‌నం అంద‌ర‌మూ సాక్షులు గా ఉన్నాము.  అయిదు నెల‌ల క్రితం నేను హ్యూస్ట‌న్ లో ‘హౌడీ మోదీ’ కార్య‌క్ర‌మం లో నా యొక్క యుఎస్ ప‌ర్య‌ట‌న ను మొద‌లు పెట్టాను.  మ‌రి నా మిత్రుడు ప్రెసిడెంట్ శ్రీ డోనాల్డ్ ట్రంప్ ఈ రోజు న అహ‌మ‌దాబాద్ లో ఈ ‘న‌మ‌స్తే ట్రంప్’ కార్య‌క్ర‌మం తో త‌న చరిత్రాత్మక భార‌త‌దేశ యాత్ర ను ఆరంభిస్తున్నారు.  ఆయ‌న అమెరికా నుండి నేరు గా ఇక్క‌డ‌ కు చేరుకొన్నారు.  భార‌త‌దేశాని కి విచ్చేసిన త‌రువాత ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ మ‌రియు ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఎకాయెకి సాబ‌ర్‌ మ‌తీ ఆశ్ర‌మానికి వెళ్ళి, అటునుండి ఈ కార్య‌క్ర‌మాని కి త‌ర‌లివ‌చ్చారు.  ప్ర‌పంచం లో కెల్లా అతి పెద్ద‌దైన ఈ ప్ర‌జాస్వామ్య దేశం లోకి అడుగిడాల్సిందిగా చాలా ఆప్యాయం గా మా హృద‌యాంతరాళం లో నుండి మీకు ఆహ్వానం ప‌లుకుతున్నాము.   ఈ నేల గుజ‌రాత్ కు చెందిందే కావ‌చ్చు కానీ, మీకు స్వాగ‌తం చెప్పాల‌న్న ఉత్సాహం యావ‌త్తు భార‌త‌దేశం అంత‌టా ఒకే మాదిరి గా నెల‌కొన్న‌ది.  ఈ ఉత్సుకత, గ‌గ‌నం లో మారుమోగుతున్న‌ ఈ స్వ‌రం, విమానాశ్ర‌యం మొద‌లుకొని స్టేడియ‌మ్ వ‌ర‌కు విస్త‌రించిన మొత్తం వాతావ‌ర‌ణం భార‌త‌దేశం లోని వివిధ‌త్వం తాలూకు వ‌ర్ణ మిశ్ర‌ణాన్ని ప్ర‌తిబింబిస్తున్న‌ది.  మ‌రి దీనికి అంత‌టికీ నడుమ న ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్, ప్ర‌థ‌మ మహిళ మెలానియా ట్రంప్‌, ఇవాంక మ‌రియు జేరెడ్ గార్ల హాజ‌రు నిజంగానే ఎంతో ప్ర‌త్యేక‌మైన‌టువంటిది.  ప్రెసిడెంట్ ట్రంప్ గారు, మీరు మీ యొక్క కుటుంబం తో ఇక్క‌డ‌ కు రావ‌డం, భార‌త‌దేశం- యుఎస్ సంబంధాల లో ఒక కుటుంబం త‌ర‌హా మాధుర్యాన్ని మ‌రియు అన్యోన్య‌త ను సంత‌రిస్తున్న‌ది.   భార‌త‌దేశం- యుఎస్ఎ సంబంధాలు ఇక ఎంత మాత్రం మ‌రొక భాగ‌స్వామ్యం గా మిగ‌ల‌వు.  అవి అంత‌కు మించిన‌వి.  అంతేకాదు, స‌న్నిహిత‌మైన సంబంధం కూడాను.  ఈ కార్య‌క్ర‌మాని కి పెట్టిన‌ పేరు ‘న‌మ‌స్తే’.  ఈ పదాని కి చాలా లోతైనటువంటి అర్థం ఉంది.  ఇది సంస్కృతం లోని ఒక ప‌దం.  సంస్కృతం ప్ర‌పంచం లో అతి ప్రాచీన భాష‌ల లో ఒక భాష‌.  దీని ద్వారా మేము ఒక వ్య‌క్తి కి మాత్ర‌మే ప్రణామం చేయడం అని కాకుండా ఆయ‌న లోప‌లి దివ్య‌త్వానికి కూడాను న‌మ‌స్క‌రిస్తున్నాము అనేటటువంటి భావ‌న ఇందులో ఇమిడిపోయివుంది.  ఇంత‌టి ఘ‌న‌మైన వేడుక ను నిర్వ‌హిస్తున్నందుకు గాను గుజ‌రాత్ ప్ర‌జ‌ల తో పాటు, గుజ‌రాత్ లో నివ‌సిస్తున్న ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల ను కూడా నేను అభినందిస్తున్నాను.  మిస్ట‌ర్ ప్రెసిడెంట్ మ‌రియు మిత్రులారా, ఈ రోజు న మీరు 5 వేల సంవ‌త్స‌రాల క్రితం ప్ర‌ణాళికాబ‌ద్ధం గా రూపుదిద్దుకున్న ధోలావీరా న‌గ‌ర ప‌రిస‌రాల లో ఉన్నారు.  అలాగే, లోథ‌ల్ నౌకాశ్ర‌యం కూడాను అంతే పురాత‌న‌మైన‌టువంటిది.  ప్ర‌స్తుతం మీరు భార‌త‌దేశం స్వాతంత్య్ర కాలం లో ఒక ముఖ్య‌మైన ప్ర‌దేశం గా ఉన్న సాబ‌ర్‌ మతీ న‌ది ఒడ్డు న నిల‌బ‌డ్డారు.  ఈ రోజు న మీరు వంద‌ల కొద్దీ భాష‌ లు వాడుక‌ లో ఉన్న భార‌త‌దేశం లో ఉన్నారు.  ఇక్క‌డ వంద‌లాది వేరు వేరు ర‌కాల వ‌స్త్రాలు, ఆహారం, మ‌త విశ్వాసాలు మ‌రియు స‌ముదాయాలు ఉన్నాయి.   మ‌న సుసంప‌న్నమైన‌టువంటి భిన్న‌త్వం, వైవిధ్యం లో ఏక‌త్వం, మ‌రి అలాగే ఏక‌త లోని గ‌తిశీల‌త‌.. ఇవి అమెరికా కు మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య బ‌ల‌మైన సంబంధానికి ఆధార‌మై నిల‌చాయి.  ఒక‌టేమో స్వేచ్ఛా భూమి గా ఉంది.  మ‌రొక‌టేమో ఈ యావ‌త్తు ప్ర‌పంచాన్ని ఒక కుటుంబం గా భావిస్తూ ఉంది.  ఒక దేశం స్టాట్యూ ఆఫ్‌ లిబ‌ర్టీ ని చూసుకొని గ‌ర్విస్తోంది. మ‌రొక దేశ‌మేమో ప్ర‌పంచం లోనే అతి ఎత్త‌యిన విగ్రహం స‌ర్ దార్ ప‌టేల్  కు చెందిన స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ ని చూసుకొని గ‌ర్విస్తున్న‌ది.  మ‌నం పంచుకొంటున్న‌ది చాలా ఉంది.  అవి ఏమిటంటే, ఉమ్మ‌డి విలువ‌ లు మ‌రియు ఆద‌ర్శాలు, ఉమ్మ‌డి వ్యాపార సంస్థ‌ ల మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ ల తాలూకు స్ఫూర్తి, ఉమ్మ‌డి అవ‌కాశాలు మ‌రియు స‌వాళ్ళు, ఉమ్మ‌డి ఆశ‌ లు మ‌రియు ఆకాంక్ష‌ లు.. ఇలాగ‌.  ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ నాయ‌క‌త్వం లో అమెరికా మ‌రియు భార‌త‌దేశం యొక్క మైత్రి గాఢ‌త‌రం అయినందుకు నేను సంతోషిస్తున్నాను.  మ‌రి ఈ కార‌ణం గా ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ యొక్క ఈ సంద‌ర్శ‌న భార‌త‌దేశం మ‌రియు అమెరికా మ‌ధ్య గ‌ల సంబంధాల లో ఒక నూత‌న అధ్యాయాని కి నాంది.  ఈ యొక్క అధ్యాయం భార‌త‌దేశం మ‌రియు అమెరికా ప్ర‌జ‌ల పురోగ‌తి లోను, స‌మృద్ధి లోను ఒక క్రొత్త ద‌స్తావేజు ప‌త్రం అవుతుంది.

మిత్రులారా,

ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ చాలా పెద్ద ఆలోచ‌న‌ లు చేస్తారు.  మ‌రి అమెరికా యొక్క స్వ‌ప్నాన్ని సాకారం చేయ‌డం కోసం ఆయ‌న ఏమి చేశార‌న్న‌ది ప్ర‌పంచాని కి చాలా బాగా తెలుసును.  ఈ రోజు న మేము సంపూర్ణ ట్రంప్ ప‌రివారాన్ని స్వాగ‌తిస్తూ, మ‌రి వారి కి అభినంద‌న‌లు అంద‌జేస్తున్నాము.  ప్ర‌థ‌మ మ‌హిళ మెలానియా ట్రంప్ గారు, మీరు ఇక్క‌డ‌ కు త‌ర‌లి రావ‌డం అనేది మా ప‌ట్ల మీరు చూపిన‌టువంటి ఒక గొప్ప గౌర‌వం.  ఒక ఆరోగ్యదాయ‌క‌మైన‌టువంటి మ‌రియు సంతోష‌దాయ‌క‌మైన‌టువంటి అమెరికా ను ఆవిష్క‌రించ‌డం కోసం మీరు చేసిన ప‌నల్లా స‌త్ఫ‌లితాల‌ ను ఇస్తున్న‌ది.  స‌మాజం లోని బాల‌ల కోసం మీరు చేస్తున్న ప్ర‌తి ఒక్క కార్యం అభినంద‌నీయం.  మీరు ఎల్ల‌ప్పుడూ అంటూ ఉంటారు.. ఉత్త‌ములు గా నిల‌వాలి అని.  ఈ రోజు న ఈ యొక్క స్వాగ‌త కార్య‌క్ర‌మం లో పాలుపంచుకొన్న ప్ర‌జ‌ల లో ఇదే విధ‌మైన భావ‌న ను మీరు అర్థం చేసుకొని ఉండి వుండాలి.  ఇవాంక గారు, రెండు సంవ‌త్స‌రాల క్రింద‌ట భార‌త‌దేశాని కి వ‌చ్చారు.  అప్ప‌ట్లో తాను భార‌త‌దేశాని కి మరో సారి రావాలి అనుకొంటున్నానన్నారు.  మీరు మ‌ళ్ళీ ఇక్క‌డ‌ కు ఈ రోజు న మా మ‌ధ్య కు విచ్చేసినందుకు నాకు సంతోషం గా ఉంది.  ఇదే మా యొక్క స్వాగ‌తం.  మ‌రి అలాగే, జేరెడ్ గారు మీ విశిష్ట‌త ఏమిటంటే మీరు అంద‌రి దృష్టి లో ప‌డ‌కుండా దూరం గా ఉండాల‌ని కోరుకొంటారు.  అయితే, మీరు చేసే కార్యాలు అమిత‌ ప్ర‌భావాన్ని క‌లిగివుంటాయి;  ఆ కార్యాల ప్ర‌భావం దూర దూరాల కు ప్ర‌స‌రిస్తుంది.  మీతో భేటీ అయ్యే అవ‌కాశం నాకు చిక్కిన‌ప్పుడల్లా మీరు భార‌త‌దేశం లోని మీ యొక్క స్నేహితుల ను గురించి నాతో చెప్తూ ఉంటారు.  మిమ్ముల‌ను ఈ రోజు న ఇక్క‌డ క‌లుసుకొన్నందుకు నేను చాలా ప్ర‌స‌న్నం గా ఉన్నాను.

మిత్రులారా,

ఈ రోజు న భార‌త‌దేశం లోని ప్ర‌తి ఒక్క‌రితో పాటు అమెరికా స‌హా యావ‌త్తు ప్ర‌పంచం ఈ వేదిక మీది నుండి ప్రెసిడెంట్ శ్రీ ట్రంప్ గారి ఉప‌న్యాసాన్ని  వినాల‌ని కోరుకుంటున్నది.  ఆయ‌న ప్ర‌సంగించిన త‌రువాత, ఆయ‌న‌ కు ధ‌న్య‌వాదాలు ప‌లుకుతూ నేను మీకు మ‌రిన్ని విష‌యాల‌ ను తప్పక వివ‌రించ‌గ‌ల‌ను.

130 కోట్ల మంది భార‌తీయుల ప‌క్షాన అధ్య‌క్షుడు శ్రీ ట్రంప్ ను నేను ఆహ్వానిస్తున్నాను.  మిత్రులారా,  నా యొక్క మిత్రుడు,  యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్య‌క్షుడు శ్రీ డోనాల్డ్ ట్రంప్ ను మీ యొక్క స‌మ‌క్షం లోకి ఆహ్వానిస్తున్నాను.

 
 

***



(Release ID: 1708451) Visitor Counter : 76