మంత్రిమండలి

అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేశన్ బిల్లు 2020కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి


మహిళల పునరుత్పత్తి హక్కుల ను పరిరక్షించడానికి తీసుకున్న చరిత్రాత్మక చర్య లు

Posted On: 19 FEB 2020 4:56PM by PIB Hyderabad

దేశం లోని మహిళ ల సంక్షేమం కోసం చరిత్రాత్మకమైనటువంటి అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేశన్ బిల్లు, 2020కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జ‌రిగిన కేంద్ర మంత్రివర్గ స‌మావేశం ఆమోదం తెలిపింది.  సరగేసీ రెగ్యులేశన్ బిల్లు 2020ని పార్లమెంటు లో ప్రవేశపెట్టడం మరియు వైద్యం ప‌రం గా గర్భ విచ్ఛిత్తి కి సంబంధించిన‌ సవరణ బిల్లు 2020కి ఆమోదం లభించడం దరిమిలా దీని కి రూప‌క‌ల్ప‌న జ‌రిగింది.  చ‌ట్ట‌ప‌ర‌మైన ఈ చర్య లు మహిళ ల పునరుత్పత్తి హక్కు ల పరిరక్ష‌ణ‌ లో ఎంతో కీల‌క‌మైన‌వి.

 

 

బిల్లు కు పార్లమెంటు ఆమోదముద్ర వేసిందీ అంటే ఈ చట్టం అమ‌లు లోకి వ‌చ్చే తేదీ ని కేంద్ర ప్రభుత్వం ప్ర‌క‌టిస్తుంది.  దీనితో ఒక నేశన‌ల్ బోర్డు ను ఏర్పాట‌ు చేయడం జరుగుతుంది.

 

 

క్లినిక్‌ల‌ లో పని చేసే వారు పాటించ‌వ‌ల‌సిన‌ ప్రవర్తన నియమావళి ని ఈ నేశన‌ల్ బోర్డు నిర్దేశిస్తుంది.  క్లినిక్‌ల‌ లో మౌలిక సదుపాయాలు, ప్రయోగశాల, రోగ‌నిర్ధార‌ణ‌ పరికరాలు  క్లిని క్‌లు, అసిస్టెడ్ రీప్రడ‌క్టివ్ టెక్నాల‌జీ బ్యాంక్‌ల లో నియమితుల‌య్యే నిపుణుల కు సంబంధించిన క‌నీస‌ ప్రమాణాల ను నిర్ణయించడానికి ఇది ఉప‌క‌రిస్తుంది.

 

 

కేంద్ర ప్రభుత్వం నోటిఫికేశన్ ను ఇచ్చిన మూడు మాసాల లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రాష్ట్ర బోర్డుల ను, రాష్ట్ర ఆథారిటిల‌ ను ఏర్పాటు చేయవలసివుంటుంది.  నేశనల్ బోర్డ్ రూపొందించిన విధానాలు ప్రణాళికల ను రాష్ట్రం లో అనుసరించవలసిన బాధ్యత రాష్ట్ర బోర్డు కు ఉంటుంది.

 

 

ఈ బిల్లు నేశన‌ల్ రిజిస్ట్రీ, రిజిస్ట్రేశన్ ఆథారిటి ఏర్పాటు కు వీలు క‌ల్పిస్తుంది.  సెంట్ర‌ల్  డేటా బేస్‌ ను నిర్వహించడానికి, నేశనల్ బోర్డ్  పనితీరు లో సహాయపడటానికి ఇది వీలు క‌ల్పిస్తుంది.  పుట్ట‌బోయే బిడ్డ ఎవ‌రు అనే దాని ని గురించి వెల్ల‌డించ‌డం, మాన‌వ భ్రూణాలు లేదా బీజకణాల విక్ర‌యం, ఇటువంటి  చట్టవిరుద్ధమైన కార్య‌క‌లాపాలను న‌డుపుతున్న‌ ఏజెన్సీలు/ ముఠాలు/ సంస్థల కు కఠిన‌ శిక్ష ను విధించాలని బిల్లు ప్రతిపాదించింది.

 

 

లాభాలు

 

 

ఈ చట్టం ప్ర‌ధాన‌ ప్రయోజనం ఏమిటంటే ఇది దేశం లో అసిస్టెడ్ రీప్రడక్టివ్ టెక్నాలజీ సేవల ను నియంత్రిస్తుంది.  ఫ‌లితం గా పిల్ల‌లు లేని జంట‌ లు, ఎఆర్‌ టి ప‌ద్ధ‌తుల‌ లో గ‌ల‌ నైతిక విధానాల‌ పై  మరింత భరోసా/ నమ్మకం తో ఉండ‌డానికి హామీ ని ఇస్తుంది.

 

 

పూర్వరంగం

 

 

అసిస్టెడ్ రీప్రడ‌క్టివ్ టెక్నాల‌జీ రెగ్యులేశన్ బిల్లు, 2020 అనేది మ‌హిళ‌ల పున‌రుత్పాద‌క హ‌క్కు ల‌ ప‌రిర‌క్ష‌ణ‌ కు కేంద్ర‌ మంత్రివర్గం ఇటీవ‌ల ఆమోదించిన‌ వ‌రుస చ‌ట్టాల‌ లో అత్యంత తాజా బిల్లు.  ఈ బిల్లు దేశం లో అసిస్టెడ్ రీప్రడ‌క్టివ్ టెక్నాల‌జీ స‌ర్వీసెస్‌ కు సంబంధించి సుర‌క్షిత‌మైన‌, నైతికత‌ తో కూడిన ప‌ద్ధతుల‌ ను అనుస‌రించ‌డానికి అవ‌స‌ర‌మైన నిబంధ‌న‌ల‌ ను రూపొందిస్తుంది.

 

ఈ బిల్లు ద్వారా నేశన‌ల్ బోర్డు, రాష్ట్రాల బోర్డు లు, నేశన‌ల్ రిజిస్ట్రీ, రాష్ట్రాల రిజిస్ట్రేశన్ ఆథారిటి లు అసిస్టెడ్ రీప్రడ‌క్టివ్ టెక్నాల‌జీ క్లినిక్‌ లు, అసిస్టెడ్ రీప్రడ‌క్టివ్ టెక్నాల‌జీ బ్యాంకు ల ప‌ర్య‌వేక్ష‌ణ‌ ను, నియంత్ర‌ణ‌ ను చేప‌డుతాయి.

 

 

గ‌డ‌చిన కొద్ది సంవ‌త్స‌రాల‌ లో అసిస్టెడ్  రీప్రడ‌క్టివ్ టెక్నాల‌జీ (ఎఆర్‌టి) బాగా వృద్ధి లోకి వ‌చ్చింది. ఎఆర్‌ టి సెంట‌ర్ ల ఏర్పాటు లో, ప్ర‌తి సంవ‌త్స‌రం ఎఆర్‌టి సైకిల్స్ నిర్వ‌హణ సంఖ్య‌లో అత్య‌ధిక వృద్ధి క‌లిగిన దేశాల‌ లో ఒక దేశం గా భార‌త‌దేశం ఉంది. ఇన్ విట్రో ఫ‌ర్టిలైజేశన్‌ తో పాటు అసిస్టెడ్ రీప్రడ‌క్టివ్ టెక్నాల‌జీ (ఎఆర్‌టి) సంతాన‌ లేమి తో బాధ‌ప‌డుతున్న ఎంతో మంది కి ఆశ‌ల ను రేకెత్తిస్తున్నది.  అయితే ఇందులో ప‌లు న్యాయ‌ప‌ర‌మైన, నైతిక ప‌ర‌మైన‌, సామాజిక అంశాలు కూడా ఇమిడివున్నాయి.

 

 

అంత‌ర్జాతీయ ఫ‌ర్టిలిటీ ప‌రిశ్ర‌మ‌ లో భార‌త‌దేశం ఒక ప్ర‌ముఖ కేంద్రం గా మారింది.  పున‌రుత్పాద‌క వైద్య పర్యటన ముఖ్య‌మైంది గా మారుతున్న‌ది.  భార‌త‌దేశం లోని క్లినిక్‌ లు దాదాపు అన్ని ఎఆర్ టి స‌ర్వీసుల‌ ను అంటే గామేట్ డొనేశన్‌ఇంట్రా యూటరాయిన్ ఇన్  సెమినేశన్‌ (ఐయుఐ) ఐవిఎఫ్‌, ఐసిఎస్ ఐ, పిజిడి, జెస్టేశన‌ల్ స‌రగేసి వంటి వాటి ని అందిస్తున్నాయి.  భారతదేశం లో ఇందుకు సంబంధించి ఎన్నో కార్య‌కలాపాలు సాగుతున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టికి కూడాను ప్రోటోకాల్స్ స్టాండ‌ర్ డైజేశన్ జ‌ర‌గ‌లేదు. రిపోర్టింగ్ ఇప్ప‌టికీ త‌గినంత‌ గా లేదు.

 

 

అసిస్టెడ్ రీప్రడ‌క్టివ్ టెక్నాల‌జీ స‌ర్వీసు ల నియంత్ర‌ణ ప్ర‌ధానం గా సంబంధిత మ‌హిళ‌లు, పిల్ల‌లు దోపిడీ కి గురి కాకుండా చూసేందుకు అవ‌స‌రం. ఓవుసైట్ దాత‌ కు బీమా రక్షణ ను క‌ల్పించ‌వ‌ల‌సి ఉంది.  మ‌ల్టిపుల్ ఎంబ్రియో ఇంప్లాంటేశన్‌ నుండి ర‌క్ష‌ణ క‌ల్పించాలి.  అలాగే అసిస్టెడ్ రీప్రడ‌క్టివ్ టెక్నాల‌జీ ద్వారా జ‌న్మించిన పిల్ల‌ల‌ కు, బాయోలోజిక‌ల్ పిల్ల‌ల తో స‌మాన‌మైన అన్ని ర‌కాల హ‌క్కుల ను క‌ల్పించాలి.  వీర్య‌ క‌ణం, ఓవుసైట్‌, ఎంబ్రియో ల‌ క్రియో నిల్వ‌ ను ఎఆర్‌ టి బ్యాంకు లు నియంత్రించ‌వ‌ల‌సి ఉంది.  అసిస్టెడ్ రీప్రడ‌క్టివ్ టెక్నాల‌జీ ద్వారా జ‌న్మించే బిడ్డ ప్ర‌యోజ‌నం కోసం ప్రీ జెనిటిక్ ఇంప్లాంటేశన్ టెస్టింగ్‌ ను ఈ బిల్లు త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని నిర్దేశిస్తున్న‌ది.

 

 

స‌రగేసి రెగ్యులేశన్ బిల్లు 2020

 

 

భారతదేశం లో స‌రగేసి ని నియంత్రించే ఉద్దేశ్యం తో స‌రగేసి (రెగ్యులేష‌న్‌) బిల్లు, 2020 ప్ర‌తిపాదిస్తున్న‌ది.  ఇందుకు సంబంధించి కేంద్ర‌ స్థాయి లో నేశన‌ల్ బోర్డు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ లో రాష్ట్ర‌ బోర్డులు, త‌గిన ఆథారిటిల‌ ను ఈ బిల్లు ప్ర‌తిపాదిస్తున్న‌ది.

 

 

ఈ బిల్లు ను సెల‌క్టు క‌మిటీ ప‌రిశీలించి 2020 ఫిబ్ర‌వ‌రి 5వ తేదీ న త‌న నివేదిక‌ ను రాజ్య‌ స‌భ‌ కు స‌మ‌ర్పించింది.  ఈ చ‌ట్టం వ‌ల్ల ప్ర‌ధాన ప్ర‌యోజ‌నం, ఇది దేశం లో స‌రగేసి సేవ‌ల‌ ను నియంత్రిస్తుంది.  వాణిజ్య‌ప‌ర‌మైన స‌రగేసి ని నిషేధించ‌నున్నారు. మాన‌వ భ్రూణాలు, బీజకణాల అమ్మ‌కాలు, కొనుగోళ్లు, భార‌తీయ వివాహిత దంప‌తుల విష‌యం లో ఎథిక‌ల్ స‌రగేసి, భార‌తీయ సంత‌తి కి చెందిన దంప‌తులు, భార‌తీయ ఒంట‌రి మ‌హిళ‌లు (భర్త చనిపోయిన లేదా విడాకులు తీసుకున్న‌ వారి కి మాత్ర‌మే) కొన్ని ష‌ర‌తుల‌ కు లోబ‌డి  అనుమ‌తించ‌డం జ‌రుగుతుంది.

 

ఆ ర‌కం గా అనైతిక స‌రగేసి విధానాల‌ ను ఇది నియంత్రించ‌డం తో పాటు, స‌రగేసి ని వ్యాపారం చేయ‌డాన్ని నిరోధిస్తుంది.  స‌రగేట్ త‌ల్లులు, స‌రగేసి ద్వారా పుట్టిన పిల్ల‌ల‌ ను దోపిడి కి గురి చేయ‌డాన్ని ఇది నిషేధిస్తుంది.

 

 

మెడిక‌ల్ టర్ మినేశన్ ప్రెగ్నన్సి స‌వ‌ర‌ణ బిల్లు 2020

 

 

మెడిక‌ల్ టర్ మినేశన్ ఆఫ్ ప్రెగ్నన్సి చ‌ట్టం, 1971 (34 ఆఫ్ 1971) కొన్ని సంద‌ర్భాల‌ లో రిజిస్ట‌ర్డ్ మెడిక‌ల్ ప్రాక్టీశన‌ర్ లు, దీనితో సంంధం ఉన్న‌ ఫార్మాట‌ర్ల ద్వారా గ‌ర్భ విచ్చిత్తి కి అవ‌కాశం క‌ల్పించేందుకు ఉద్దేశించిన‌ది.  కొన్ని ప్ర‌త్యేక ప‌రిస్థితుల‌ లో అబార్ష‌న్ అవ‌స‌ర‌మైన మ‌హిళ‌ల‌ కు సుర‌క్షిత‌మైన‌, త‌క్కువ ఖ‌ర్చు తో అబార్ష‌న్ సేవ‌ల ను అందుబాటు లోకి తీసుకు రావ‌ల‌సిన అవ‌స‌రాన్ని ఈ చ‌ట్టం గుర్తించింది.

 

 

దీనితో పాటు, మ‌హిళ‌ల‌ పై లైంగిక నేరం కార‌ణం గా గ‌ర్భం దాల్చ‌డం, గ‌ర్భ‌స్థ పిండం లో అసాధార‌ణ స్థితి వంటి సంద‌ర్భాల‌ లో ప్ర‌స్తుతం అబార్ష‌న్‌కు అనుమ‌తిస్తున్న ప‌రిమితి నెల‌లు దాటిన‌ స‌మ‌యంలో గ‌ర్భిణులు అబార్ష‌న్ చేయించుకొనేందుకు అనుమ‌తించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం లో, వివిధ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాల లో ప‌లు రిట్ పిటిశన్ లు దాఖ‌లు అయి వున్నాయి.  వీట‌న్నిటి ని దృష్టి లో పెట్టుకొని, ప్ర‌తిపాదిత చ‌ట్టాలు మ‌హిళ‌ల పున‌రుత్పాద‌క హ‌క్కు ల విష‌యం లో, మారుతున్న సామాజిక  పరిస్థితుల కు, సాంకేతిక పురోగ‌తి కి అనుగుణం గా ర‌క్ష‌ణ‌ల ను క‌ల్పించ‌నున్నాయి.

 

 

***


(Release ID: 1708406) Visitor Counter : 182