మంత్రిమండలి

పంట‌ ల బీమా ప‌థకాల‌ అమ‌లు లో ప్ర‌స్తుతం ఎదురవుతున్న స‌వాళ్ల‌ ను అధిగ‌మించేందుకు ‘ప్ర‌ధాన‌ మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌ (పిఎమ్ఎఫ్ బివై)’ని మెరుగుప‌ర‌చ‌డానికి , ‘పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రించిన వాతావ‌ర‌ణ ఆధారిత పంట‌ ల‌ బీమా ప‌థ‌కాని (ఆర్ డబ్ల్యుబిసిఐఎస్)’కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 19 FEB 2020 4:36PM by PIB Hyderabad

పంట‌ ల బీమా ప‌థకాల‌ అమ‌లు లో ప్ర‌స్తుతం ఎదురవుతున్న స‌వాళ్ల‌ ను అధిగ‌మించేందుకు  ‘ప్ర‌ధాన‌ మంత్రి ఫ‌స‌ల్ బీమా యోజ‌న‌ (పిఎమ్ఎఫ్ బివై)’ని మెరుగుప‌ర‌చ‌డానికి,  ‘రిస్ట్రక్చర్ డ్ వెదర్ బేస్ డ్ క్రాప్ ఇన్ శ్యోరన్స్ స్కీమ్ (ఆర్ డబ్ల్యుబిసిఐఎస్)’కి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ అధ్య‌క్ష‌త‌ న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

 

ప్ర‌స్తుతం అమ‌లవుతున్న‌ పిఎమ్ఎఫ్ బివై, ఆర్ డబ్ల్యుబిసిఐఎస్ లకు సంబంధించిన కొన్నిఅంశాల‌ ను ఈ క్రింది విధం గా మార్పు చేయాల‌ని ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది:

ఎ.    బీమా కంపెనీల‌కు వ్యాపార కేటాయింపు ను మూడు సంవ‌త్స‌రాల‌ కు జ‌రుపుతారు. (పిఎమ్ఎఫ్ బివై, ఆర్ డబ్ల్యుబిసిఐఎస్) ఎమ్ఎస్‌పి లేని  ఇత‌ర పంట‌ల‌ కు సంబంధించి ఫార్మ్ గేట్ ధ‌ర‌ ను ప‌రిగ‌ణ‌న‌ లోకి తీసుకొంటారు.

బి.    జిల్లా స్థాయి స‌గ‌టు దిగుబ‌డి అంచ‌నా విలువ (ఎన్‌ఎవై) లేదా ఫైనాన్స్ స్థాయి ల‌లో ఏదో ఒక దాని ని ఎంపిక చేసుకొనేందుకు రాష్ట్రాల కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ కు అవ‌కాశాన్ని ఇస్తారు.  అంటే ఎన్‌ఎవై, ప్ర‌క‌టించిన ఏదైనా  జిల్లా పంట కాంబినేశన్‌ కు బీమా చేసిన మొత్తం గా క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఉంటుంది.

సి.      పిఎమ్ఎఫ్ బి వై\ఆర్‌డ‌బ్ల్యుబిసిఐఎస్ లలో భాగం గా కేంద్ర స‌బ్సిడీ ని నీటిపారుద‌ల లేని ప్రాంతాలు\పంట‌ల‌ కు 30 శాతం ప్రీమియమ్ రేటు ల వ‌ర‌కు ప‌రిమితం చేయ‌నున్నారు.  నీటిపారుద‌ల ఉన్న ప్రాంతాలు\పంట‌ల‌ కు 25 శాతం ఉంటుంది.  50 శాతం, అంత‌కు పైబ‌డిన నీటిపారుదల ప్రాంతం క‌లిగిన జిల్లాల‌ ను  నీటిపారుద‌ల క‌లిగిన ప్రాంతం\ జిల్లా గా ప‌రిగ‌ణిస్తారు.(పిఎమ్ఎఫ్ బివై\ ఆర్‌డ‌బ్ల్యుబిసిఐఎస్ రెండిటి కి).

డి.    విత్త‌నాలు వేయ‌కుండా నిరోధించ‌డం, స్థానిక విప‌త్తు లు, సీజ‌న్ మ‌ధ్య‌ లో అన‌నుకూల ప‌రిస్థితులు, పంట కోత అనంత‌ర న‌ష్టాలు వంటి ఏదైనా లేదా ఎన్ని అయినా అద‌న‌పు రిస్క్ క‌వ‌ర్‌ లు , ఫీచ‌ర్ లను ఎంచుకొని ప‌థ‌కాన్ని అమ‌లు చేసుకొనేందుకు రాష్ట్రాల కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ కు వెసులుబాటు ను క‌ల్పించ‌డం.  ఇంకా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వ‌డ‌గండ్ల వాన వంటి ప్ర‌త్యేకమైన ఒకే నష్టభయాన్ని, బీమా రక్షణ ను పిఎమ్ఎఫ్ బివై లో భాగం గా ఇవ్వజూపవ‌చ్చును.  బేస్ క‌వ‌ర్‌తో లేదా బేస్‌ క‌వ‌ర్‌ లేకుండా దీని ని ఎంచుకొనే వెసులుబాటు ఉంటుంది.  (పిఎమ్ఎఫ్‌ బివై\ ఆర్‌డ‌బ్ల్య‌బిసిఐఎస్ రెండిటి కి).

ఇ.   నిర్ణీత కాల‌పరిమితి లోగా సంబంధిత బీమా కంపెనీల‌ కు త‌గిన ప్రీమియమ్ స‌బ్సిడీ ని విడుద‌ల చేయ‌డం లో రాష్ట్రాలు చెప్పుకోద‌గిన జాప్యం చేసిన‌ట్ట‌యితే త‌దుప‌రి సీజ‌న్ లలో ఆయా రాష్ట్రాల‌ ను ఈ ప‌థ‌కం అమ‌లు చేయ‌డానికి అనుమతించ‌రు.

ఎఫ్‌.   పంట నష్టాలు/ ఆమోదయోగ్యమైన క్లెయిము ల‌ కోసం, ప్రతి ప్రాంతాని కి సాధారణ పరిధులు డీవియేశన్  రేంజ్‌ల‌తో పాటు వాతావరణ సూచిక లు, ఉపగ్రహ సూచిక లు మొదలైన నిర్దిష్ట ప్రాతిప‌దిక‌ల‌ ను ఉపయోగించి నిర్వచించిన డీవియేశన్ మాట్రిక్స్  ఆధారంగా రెండు దశ ల ప్రక్రియ ను అవలంబించాలి.  డీవియేశన్‌ ఉన్న ప్రాంతాలు మాత్రమే దిగుబడి నష్టం (పిఎమ్ఎఫ్‌బివై) అంచనా కోసం పంట కోత ప్రయోగాల కు (సిసిఇ లు) లోబడి ఉండాలి.

జి.    స్మార్ట్ శాంప్లింగ్ టెక్నిక్ (ఎస్‌ఎస్‌టి) వంటి సాంకేతిక పరిష్కారాలు, సిసిఇ ల (పిఎమ్‌ఎఫ్‌బివై) నిర్వహణ లో అనుసరించవలసిన సిసిఇ ల సంఖ్య ను గ‌రిష్ఠ ప్ర‌యోజ‌న‌క‌రం గా చేయడం.

హెచ్‌.   నిర్దేశిత గ‌డువు తేదీ దాటినా దిగుబడి డేటా ను రాష్ట్రాలు బీమా కంపెనీల‌ కు అందించకపోతే, టెక్నాలజీ సొల్యూశన్  ద్వారా వచ్చిన దిగుబడి ఆధారంగా క్లెయిముల‌ ను  పరిష్కరిస్తారు.. (ఒక్క పిఎమ్ఎఫ్‌బి వైకే).

i.    ఈ ప‌థ‌కాల లో ఇష్ట పూర్వ‌కంగా త‌మ పేరుల ను న‌మోదు చేసుకొనే అవ‌కాశం రైతులందరి కి ఇవ్వాలి (పిఎమ్ఎఫ్‌బివై /  ఆర్ డ‌బ్ల్యుబిసిఐఎస్ రెండిటి కి).

జె.    ఈశాన్య రాష్ట్రాల కు ప్రీమియమ్ స‌బ్సిడీ లో రాష్ట్ర‌ వాటా ను ప్రస్తుతం ఉన్న 50:50 శాతం నుండి 90 శాతాని కి పెంచబడుతుంది (పిఎమ్ఎఫ్‌బివై\ ఆర్‌డ‌బ్ల్యుబిసిఐఎస్ రెండిటి కి వ‌ర్తింపు).

కె.   ప‌థ‌కం మొత్తం కేటాయింపుల‌ లో 3 శాతం మొత్తాన్ని, నిర్వ‌హ‌ణ‌ ప‌ర‌మైన ఖ‌ర్చు ల‌ కోసం భార‌త ప్ర‌భుత్వం, ప‌థ‌కాన్ని అమ‌లు చేసే రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు కేటాయిస్తాయి.  ఇది  ప్ర‌తి రాష్ట్రాని కి సంబంధించి, డిఎసి & ఎఫ్‌డ‌బ్ల్యు నిర్ణ‌యించే గ‌రిష్ఠ ప‌రిమితి కి లోబ‌డి ఉంటుంది. (పిఎమ్ఎఫ్‌బివై\ఆర్‌డ‌బ్ల్యుబిసిఐఎస్ రెండిటి కి).

ఎల్‌.   పైన తెలిపిన అంశాల‌ తో పాటు  వ్యవసాయ, సహకార  రైతు సంక్షేమ శాఖ ఇతర వాటాదారులు / ఏజెన్సీల తో సంప్రదించి పంటలు / అధిక ప్రీమియమ్ రేటు ఉన్న ప్రాంతాలు, రాష్ట్రాల‌ కు ప్ర‌త్యేకం గా నష్టభయాన్ని త‌గ్గించే ప్రత్యామ్నాయ  కార్యక్రమాన్ని రూపొందిస్తుంది.

దీనితో పాటు, ఈ ప‌థ‌కం లో రైతులంతా ఇష్ట‌పూర్వ‌కంగా చేర‌డానికి వీలు ను క‌ల్పిస్తుంది.  పంట‌ ల బీమా ప‌థ‌కం కింద ఆర్థిక మ‌ద్ద‌తివ్వ‌డానికి, పంట బీమా ద్వారా నష్టభయాన్ని త‌గ్గించ‌డానికి నీటి ల‌భ్య‌త త‌క్కువ‌ గా ఉన్న 151 జిల్లాల లో ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని రూపొందిస్తారు; ఈ 151 జిల్లాల‌ లో 29 జిల్లాల లో రైతుల రాబ‌డి త‌క్కువ‌ గా ఉండ‌డం, క‌ర‌వు ప‌రిస్థితుల వ‌ల్ల నీటి వ‌న‌రుల‌ పై ఒత్తిడి రెట్టింపు గా ఉంది.

ఎం.  పిఎమ్ఎఫ్ బివై, ఆర్‌డ‌బ్ల్యు బిసిఐఎస్ ల‌కు సంబంధించిన నిబంధ‌న‌ లు, ప్ర‌మాణాలు, ఇత‌ర నిర్వ‌హ‌ణ ప‌ర‌మైన మార్గ‌ద‌ర్శ‌కాల‌ ను పైన తెలిపిన మార్పుల‌ కు అనుగుణం గా మార్పు చేర్పు లు చేసి 2020 ఖ‌రీఫ్ నుండి ఆచ‌రణ‌ లోకి తీసుకు వ‌స్తారు.

 

ప్ర‌యోజ‌నాలు

 

ఈ మార్పుల తో రైతులు వ్యవసాయ ఉత్పత్తి లో నష్టాన్ని మెరుగైన రీతి లో ఎదుర్కోవ‌డం తో పాటు వ్యవసాయ ఆదాయాన్ని పెంచుకోవ‌డం లో సాఫల్యాన్ని సాధిస్తారని భావిస్తున్నారు.  ఇంకా, ఇది ఈశాన్య ప్రాంతం లో కవరేజి ని పెంచుతుంది, ఈశాన్య ప్రాంత  రైతు లు వారి వ్యవసాయ న‌ష్టాల‌ ను ఎదుర్కోవ‌డానికి మెరుగైన ప‌ద్ధ‌తి ని అనుస‌రించ‌డానికి ఇది మార్గాన్ని సుగమం చేస్తుంది.  ఈ మార్పు లు త్వరితమైన, కచ్చితమైన దిగుబడి అంచనాల‌ ను లెక్క‌గ‌ట్ట‌డానికి, త‌ద్వారా క్లెయిముల శీఘ్ర పరిష్కారాని కి వీలు ను క‌ల్పిస్తాయి.

 

ఈ మార్పుల ను ఖరీఫ్ 2020 సీజన్ నుండి దేశమంతటా అమలు చేయాలని ప్రతిపాదించారు.

 

***



(Release ID: 1708396) Visitor Counter : 199