జల శక్తి మంత్రిత్వ శాఖ

జల్ జీవన్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు కోట్ల గృహాలకు కొళాయి కనెక్షన్లు

Posted On: 29 MAR 2021 1:28PM by PIB Hyderabad

దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు కోట్ల గృహాలకు కొళాయి కనెక్షన్లను అందించి జల్ జీవన్ మిషన్ నూతన మైలు రాయిని దాటింది. దేశంలో 2024 నాటికి గ్రామీణ ప్రాంతంలో ప్రతి గృహానికి కొళాయి ద్వారా రక్షిత మంచి నీరు సరఫరా చేయాలన్న లక్ష్యంతో రూపొందిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 2019 ఆగస్ట్ 15వ తేదీన ప్రారంభించారు. పథకం ప్రారంభం అయిననాటి నుంచి నేటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 7.26 కోట్ల గృహాలకు కొళాయి కనెక్షన్లను కల్పించారు. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వున్న గృహాలలో ఇది 38%గా వుంది. దేశంలో 100 శాతం గృహాలకు కొళాయి ద్వారా మంచి నీరు సరఫరా చేస్తున్న రాష్ట్రంగా గోవా గుర్తింపు పొందింది. తెలంగాణాఅండమాన్ నికోబార్ దీవులు ఆ తరువాత స్థానాల్లో వున్నాయి.  జల్ జీవన్ మిషన్ పథకం అమలులో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు అందిస్తున్న నిరంతర సహాయం వల్ల దేశంలో 56 జిల్లాలు మరియు 86,000 గ్రామాల్లో వున్న గృహాలకు కొళాయి ద్వారా మంచి నీరు సరఫరా చేయాలన్న కల సాకారం కాబోతున్నది. పథకాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరికి కొళాయి ద్వారా నీరు సరఫరా చేసి లక్ష్యాలను సాధించడానికి రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. 

జల్ జీవన్ మిషన్ విజయానికి ఆంధ్రప్రదేశ్ లోని  వేలేరుపాడు మండలంలోని కాకిస్‌నూర్ గ్రామం గ్రామం ఒక నిదర్శనం. ఈ గ్రామం దట్టమైన అటవీ ప్రాంతంలో కొండల మధ్య వుంది. ఈ గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు మార్గం లేదు. విధ్యుత్ సరఫరా కూడా లేదు. అయితే, ఈ గ్రామంలో నివసిస్తున్న 200 కుటుంబాలు కేంద్రప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ద్వారా కొళాయి ద్వారా మంచి నీటిని పొందుతున్నాయి. జీవన ప్రమాణాలను మెరుగు పరచి ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచాలన్న లక్ష్యంతో అమలు జరుగుతున్న జల్ జీవన్ మిషన్ లక్ష్యం కాకిస్‌నూర్ గ్రామంలో పూర్తిగా నెరవేరింది. కొళాయి ద్వారా సరఫరా అవుతున్న మంచి నీటిని తాగడంతో ప్రజల ఆరోగ్య  స్థితిగతులు  మెరుగుపడ్డాయి.కాకిస్‌నూర్ గ్రామానికి వెళ్లడం చాలా కష్టమైన పని. అయితేప్రతి ఇంటికి కొళాయి ద్వారా నీరు అందించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేసి విజయం సాధించారు. గోదావరి నది తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ గ్రామానికి చేరుకోవడానికి మార్గం ఉండదు. దీనితో అధికారులు పడవలో డ్రిల్లింగ్ యంత్రాలను రవాణా చేసి తీరానికి సమీపంలో ఒక వాగుకు సమీపంలో గొట్టపు బావిని తవ్వి దానికి సౌరశక్తితో పనిచేసే పుంపును అమర్చి గ్రామంలో అన్ని గృహాలకు కొళాయి ద్వారా నీరు అందించగలిగారు. 

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని ఓరుమానైయూర్ గ్రామం కూడాజల్ జీవన్ మిషన్  ద్వారా లబ్ది పొందింది. ఈ గ్రామంలో ఏడేళ్ల వైష్ణవి నివసిస్తోంది.  ఆమె తల్లిదండ్రులు మరియు అమ్మమ్మ  కోవిడ్ -19 బారిన పడడంతో వారిని విడిగా వుంచవలసి  వచ్చింది.  ముగ్గురు తోబుట్టువులలో పెద్దది కావడంతో వైష్ణవి కుటుంబ సంరక్షణ పాత్రని పోషించవలసి వచ్చింది. మంచి నీరు తీసుకురావాల్సిన భారం కూడా ఈమెపై పడింది.  అయితేవీరి ద్వారా తమకు కూడా వ్యాధి సంక్రమిస్తుందన్న భయంతో గ్రామస్తులు వీరిని కూడా బయటికి రాడానికి అనుమతించలేదు. అన్ని సౌకర్యాలకు దూరం కావడంతో ఆందోళనకు గురైన కుటుంబానికి ఆ మరుసటి రోజు కొళాయి కనెక్షన్ వచ్చింది. దీనితో ఆ కుటుంబం ఆశ్చర్యానికి గురైంది. సరైన సమయానికి కొళాయి ద్వారా నీరు సరఫరా కావడంతో ఆ కుటుంబం కష్టాల నుంచి గట్టు ఎక్కింది. 

జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి జరుగుతున్న నీటి సరఫరా జరుగుతున్న ప్రాంతాల్లో సాధించిన ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇలాంటివి క్షేత్ర స్థాయిలో అనేకం వున్నాయి. 

తగినంత పరిమాణంలో సూచించిన నాణ్యతతో క్రమపద్ధతిలో దీర్ఘకాలిక ప్రాతిపదికన ప్రజలకు  త్రాగునీటిని అందించే లక్ష్యంతో రాష్ట్రాల భాగస్వామ్యంతో  జల్ జీవన్ మిషన్ అమలు జరుగుతున్నది .  ‘బాటప్-అప్ విధానం’ అనుసరించి రాష్ట్రాలు / యుటిలు సమగ్ర విస్తృతమైన ప్రణాళికకు రూపకల్పన చేస్తున్నాయి .దీని ప్రకారంప్రతి గ్రామీణ గృహానికి కుళాయి ద్వారా మంచి నీటి కనెక్షన్‌ను అందించే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి నీటి నాణ్యత ప్రభావిత ప్రాంతాలుకరువు పీడిత మరియు ఎడారి ప్రాంతాల్లోని గ్రామాలుషెడ్యూల్డ్ కులం / షెడ్యూల్డ్ తెగ మెజారిటీ గ్రామాలుఆశాజనక జిల్లాలు మరియు సంసాద్ ఆదర్శ్ గ్రామ యోజన గ్రామాలకుప్రాధాన్యత ఇస్తూ పథకాన్ని అమలు చేయడం జరుగుతున్నది. 

పిల్లలు నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల బారిన పడడానికి అవకాశం ఉన్నందున  దేశవ్యాప్తంగా పాఠశాలలు మరియు ఆశ్రమ పాఠశాలలు  మరియు అంగన్‌వాడీ కేంద్రాల్లో కొళాయి ద్వారా నీరు సరఫరా చేసే కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. దీనివల్ల  పాఠశాలల  పిల్లలకు తాగడానికి సురక్షితమైన నీరు అందుబాటులో ఉంటుంది. మధ్యాహ్నం భోజనం వండడానికిచేతులను శుభ్రం చేసుకోవడానికి మరియు మరుగుదొడ్లలో వాడటానికి నీటినిలభిస్తుంది. 

నీటి నాణ్యత సక్రమంగా లేని ప్రాంతాలకు జల్ జీవన్ మిషన్ అమలులో ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా ఆర్సెనిక్ మరియు ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామీణ గృహాలకు  సురక్షితమైన తాగునీరు అందేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీటి ద్వారా వచ్చే వ్యాధులను తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రక్షిత మంచి నీటి సరఫరాకు జల్ జీవన్ మిషన్ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. .  రాష్ట్రాలు / యుటిలు నీటి నాణ్యతా పరీక్ష ప్రయోగశాలలను అప్‌గ్రేడ్ చేస్తూ  వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తున్నాయి. వీటిలో నీటి నమూనాలను నామమాత్రపు రేటుతో పరీక్షించటానికి వీలు కల్పిస్తుంది.

ప్రధానమంత్రి పిలుపు మేరకు జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా అమలు చేస్తున్నారు. ప్రపంచ జల దినోత్సవంగా వర్షం నీటిని ఒడిసి పట్టాలిఅంటూ ప్రధానమంత్రి 2021 మార్చి 22 వ తేదీన ఇచ్చిన పిలుపు మేరకు అన్ని  కార్యక్రమంలో భాగస్వాములను చేయడానికి  రంగం సిద్ధం అవుతోంది. 

కేవలం సౌకర్యాల కల్పనా పథకంగా కాకుండా స్థానికుల సహకారంతో స్థానిక జల వనరులను వినియోగంలోకి తెచ్చే కార్యక్రమంగా జల్ జీవన్ మిషన్ అమలు జరుగుతున్నది. గ్రామంలో ప్రతి గృహానికి కొళాయి ద్వారా నీరు సరఫరా జరిగేలా చూడడానికి జలవనరులపై ప్రతిఒక్కరికి అవగాహన కల్పిస్తున్నారు. నీటి సరఫరా వ్యవస్థలో గ్రామ పంచాయతీ మరియు / లేదా దాని ఉప కమిటీఅంటే  గ్రామ నీరు మరియు పారిశుద్ధ్య కమిటీ (విడబ్ల్యుఎస్సి) / పాని సమితి మొదలైనవి గ్రామంలోని నీటి సరఫరా ప్రణాళికఅమలునిర్వహణమరియు నిర్వహణలో కీలక పాత్రపోషించేలా కార్యక్రమాలను రూపొందించడం జరిగింది. జవాబుదారీతనంపారదర్శకత గల వ్యవస్థను రూపొందించడం ద్వారా నీటి సరఫరా వ్యవస్థలు ఎక్కువ కాలం పనిచేస్తాయి. 

2019 ఆగస్టు 15 నాటికి 

2021 మార్చ్ 29 నాటికి 

 

జల్ జీవం మిషన్ డాష్ బోర్డు ఆధారంగా 

 జల్ జీవన్ మిషన్ కింద కార్యక్రమంపురోగతి మరియు విజయాలు గురించి మరిన్ని వివరాలు 

 

 https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx

సోషల్ మీడియాలో జల్ జీవన్ మిషన్ వివరాలు 

 

 

 : Https://www.facebook.com/JalJeevanMissionIndia/

 

 : Https://twitter.com/jaljeevan_

 

 : Https://www.instagram.com/jaljeevanmission/?hl=en

 

 : Https://www.youtube.com/c/JalJeevanMission

 

 : Https://www.linkedin.com/company/jal-jeevan-mission అంబాటులో ఉన్నాయి. 

***



(Release ID: 1708310) Visitor Counter : 703


Read this release in: English , Urdu , Hindi , Bengali