జల శక్తి మంత్రిత్వ శాఖ
జల్ జీవన్ మిషన్: నీటి కాలుష్య సమస్యకు పరిష్కారం
Posted On:
25 MAR 2021 5:07PM by PIB Hyderabad
జల్‌జీవన్ మిషన్ కింద గ్రామీణప్రాంత ఇళ్లకు ఇప్పటివరకు 7.19 కోట్ల కుళాయి నీటి కనెక్షన్‌లు అందించడం జరిగింది.జల్‌జీవన్ మిషన్ ప్రారంభమైనప్పటి నుంచి అండమాన్ నికోబార్‌దీవులు, గోవా, తెలంగాణాలోని ప్రతి గ్రామీణకుటుంబానికి పరిశుభ్రమైన ట్యాప్ నీటినిఅందించడం జరిగింది.
48 , 169 గ్రామీణ ఆవాసాలలో నాణ్యతా పరంగా ప్రభావం పడినట్టు రాష్ట్రాలు నివేదించాయి. జల్‌జీవన్ మిషన్ ప్రారంభించిన తర్వాత 10,650 ఆర్సెనిక్, ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసాలకు తాగునీటిని సరఫరా చేయడం జరిగింది.
దేశంలో నీటి కాలుష్యంగల ఆవాసాల స్థితికి సంబంధించి జలశక్తి శాఖ సహాయమంత్రి శ్రీ రతన్‌లాల్ కఠారియా పార్లమెంటుకు తెలియజేశారు. లోక్‌సభలో పార్లమెంటుసభ్యుడు శ్రీ గిరీష్ బాలచం్రద బాపట్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మంత్రి ఈ విషయం తెలిపారు. ప్రభుత్వం జాతీయ నీటినాణ్యతాసబ్ మిషన్ ( ఎన్.డబ్ల్యు.క్యు ఎస్.ఎం) సబ్ మిషన్‌ను 2017లో ప్రారంభించింది. ప్రత్యేకించి ఆర్సెనిక్, ఫ్లోరైడ్ ప్రభావిత 27,544 ఆవాసాలకు ఉద్దేశించి దీనిని ప్రారంభించారు. ఇప్పటివరకు అలాంటి ఆవాసాలలో 1369 మినహా మిగిలినవాటన్నింటికీ తాగునీటిని సరఫరా చేయడం జరిగింది. మిగిలిన ఆవాసాలకుకూడా వీలైనంత త్వరగా తాగునీటిని అందించేందుకు పనులు కొనసాగుతున్నట్టు మంత్రిచెప్పారు. నాణ్యతాప్రభావం పడిన ఆవాసాలకు తగినంత నాణ్యత కలిగిన తాగునీటిని అందించాలన్నది ప్రభుత్వం కృషి అని ఆయన అన్నారు. జల్ జీవన్‌మిషన్ కింద దీనికి అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చినట్టు ఆయన తెలిపారు. ఈప్రాంతాలలో పైపు ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రాష్ట్రాలు కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
జల్ జీవన్ మిషన్ కింద నీటి నాణ్యత సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు శ్రీ కటారియా తెలిపారు. జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమం. గ్రామ, జిల్లా నీటి సరఫరా ప్రణాళికలు రూపొందించే సమయంలోనే వీటికి ప్రాథాన్యత నివ్వడంజరుగుతోంది. దీనికితోడు ఇలాంటి ఆవాసాలకు నిధుల కేటాయింపునకు పది శాతం వెయిటేజ్ ఇవ్వడం జరుగుతోంది. నీటి నాణ్యతా పరిశీలన, నిఘా కార్యకలాపాలకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేటాయింపులలో రెండు శాతం వరకు వాడుకోవచ్చు. ఇందులో ప్రస్తుత నీటి నాణ్యతా పరీక్షా శాలలను అప్‌గ్రేడ్‌చేయడం, నీటి నాణ్యత పరీక్షకుసంబంధించి పరికరాలకొనుగోలు, ఉపకరణాలు, రసాయనాలు, రీజెంట్లు, గ్లాస్‌వేర్, ప్రయోగశాలలకు ఎన్.ఎ.బి.ఎల్ అక్రిడిటేషన్ వంటి వి ఉన్నాయి.
ఆర్సెనిక్, ఫ్లోరైడ్ కాలుష్యంవల్ల ప్రతికూల ప్రభావంపడిన ఆవాసాలలో కమ్యూనిటీ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లను ప్రాధాన్యతా ప్రాతిపదికన ఏర్పాటుచేయాల్సిందిగా రాష్ట్రాలకుసూచించడం జరిగింది. మధ్యంతర చర్యగా 8-10 ఎల్‌పిసిడి ( లీటర్ పర్‌కాపిటా పర్ డే)తాగునీటిని వంటకు, తాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని రాష్ట్రాలకు సూచించడం జరిగింది
ఆయా ఆవాసాలలో క్షేత్రస్థాయిలో నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు, క్షేత్రస్థాయిలో కమ్యూనిటీని భాగస్వాములను చేసేందుకు,వారికి సాధికారత కల్పించేందుకు పీల్డ్‌టెస్టింగ్ కిట్( ఎప్.టి.కె) లను పంపిణీచేయడం జరుగుతుంది. ప్రతిగ్రామంనుంచి ఐదుగురు మహిళలకు ఈ కిట్‌లు ఉపయోగించడంలో శిక్షణనిస్తారు. దీనివల్ల నీటిద్వారా వచ్చే ముప్పును ముందుగానే గుర్తించడానికి వీలు కలుగుతుంది. ఇప్పటివరకు 1.2 లక్షల గ్రామాలలో 4.7 లక్షల మంది మహిళలకు నీటి పరీక్ష విషయంలో శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఇటీవల ప్రారంభించిన వాటర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ( డబ్ల్యు.క్యు.ఎం.ఐ.ఎస్) గురించిశ్రీ కటారియీ ప్రస్తావించారు. ఇందులో దేశవ్యాప్తంగా గల 2000 వాటరల్ క్వాలిటీ టెస్టింగ్‌ల్యాబ్‌ల సమాచారాన్నిఒక చోట చేర్చి సాధారణప్రజానీకానికి సమాచారంకోసం పోర్టల్ లో ఉంచడం జరిగిందన్నారు.
దీనితో ప్రజలు తమకు దగ్గరగా ఉన్న నీటి నాణ్యతా ప్రయోగశాల గురించి తెలుసుకోవచ్చని , నీటి నమూనాలను పరీక్షలనిమిత్తం నామమాత్ర ధరకు ప్రయోగశాలకు పంపవచ్చని అన్నారు. అలాగే నీటి నాణ్యతకు సంబంధించిన నివేదికలను ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని అన్నారు. దేశంలో నీటి నాణ్యతా పరీక్షల దిశగా ఇది ఒక ప్రగతిదాయక చర్య అని అయన అన్నారు.
****
(Release ID: 1707712)
Visitor Counter : 133