రక్షణ మంత్రిత్వ శాఖ
మడగాస్కర్ లో ఫస్ట్ ట్రెయినింగ్ స్క్వాడ్రన్ శిక్షణార్థులు
प्रविष्टि तिथि:
25 MAR 2021 5:17PM by PIB Hyderabad
ఫస్ట్ ట్రెయినింగ్ స్క్వాడ్రన్ శిక్షణార్థులు భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ శార్దూల్ లో మడగాస్కర్ లోని ఆంట్సిరనానా నౌకాశ్రయానికి వెళ్లారు. శిక్షణలో ఉన్న ఆఫీసర్లు తమ 99వ ఐఒటి కోర్సులో భాగంగా మార్చి 21-24 మధ్య విదేశ పర్యటనకు ఈ నౌకలో ప్రయాణించారు.
కోవిడ్ 19 విధి విధానాలు పాటిస్తూ, ఒకరినొకరు తాకకుండా నౌకాశ్రయ సందర్శన సాగింది. అదే విధంగా మార్చి 23న మడగాస్కర్ సాయుధ దళాలతో వర్చువల్ సమావేశం జరిగింది. అంకారణా డిఫెన్స్ జోన్ చీఫ్ జనరల్ మాంట్రిగ్ ఫిట్జ్ జెరాల్డ్, ఆంట్సిరానా నేవల్ బేస్ కమాండర్ కెప్టెన్ శామ్ హీంగ్ ట్వియాన్, ఫస్ట్ ట్రెయినింగ్ స్క్వాడ్రన్ సీనియర్ ఆఫీసర్ కెప్టెన్ అఫ్తాబ్ అహ్మద్ ఖాన్, ఐఎన్ఎస్ శార్దూల్ కమాండింగ్ ఆఫీసర్ కమాండర్ అక్షయ్ ఖన్నా పాల్గొన్నారు. అంకారణా డిఫెన్స్ జోన్ చీఫ్ నౌకకు స్వాగతం పలికారు, రెండు దేశాల రకషణ దళాల మధ్య మెరుగుపడుతున్న సంబంధాలపట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సు అనంతరం ఆంట్సిరానానా నేవల్ బేస్ కమాండర్ కెప్టెన్ శామ్ హీంగ్ ట్వియాన్ ఐఎన్ ఎస్ శార్దూల్ ను సందర్శించారు.
24న ఐఎన్ ఎస్ శార్దూల్, మలగసీ నావికానౌక ఎం ఎన్ ఎస్ ట్రొజోనా వీడ్కోలు విన్యాసం నిర్వహించాయి. భారత్- మడగాస్కర్ దేశాల సముద్ర దళాల మధ్య సంబంధానికి ఈ ఉమ్మడి విన్యాసాలు అద్దం పట్టాయి. ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యమైన సముద్ర భద్రతను, పరస్పర రాకపోకల బంధాన్ని ప్రతిబింబించాయి.
సదర్న్ నేవల్ కమాండ్ లో భాగమైన ఫస్ట్ ట్రెయినింగ్ స్క్వాడ్రన్ భారత నావికాదళ శిక్షణలో ఒక దశ. సదర్న్ నేవల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ –ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ ఎకె చావ్లా ఆధ్వర్యంలో ఈ శిక్షణ సాగుతోంది. భారత్-మడగాస్కర్ మధ్య బలమైన సముద్ర రక్షణ బంధం ఉంది. ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే క్రమంలో భాగంగానే ఇప్పుడు ఆంట్సిరానా యాత్ర సాగింది.
***
(रिलीज़ आईडी: 1707645)
आगंतुक पटल : 186