పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కర్నూలు ఎయిర్ పోర్ట్ ప్రారంభం
ఉడాన్ (యుడిఎఎన్)కింద విమాన కార్యకలాపాలు 28 మార్చి, 2021 నుంచి ప్రారంభం కానున్నాయి
Posted On:
25 MAR 2021 4:16PM by PIB Hyderabad
పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జి హర్దీప్ సింగ్ పురీ, దృశ్యమాధ్యమం ద్వారా జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని ఓర్వకల్ సమీపంలోని కర్నూల్ విమానాశ్రయాన్ని గురువారం ప్రారంభించారు. సీనియర్ అధికారులు, ఇతర ముఖ్య భాగస్వాములతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. పౌర విమానయాన శాఖ (ఎంఒసిఎ), ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)కు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు. విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, కడప తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలకం అయిన 6వ ఎయిర్ పోర్ట్ కర్నూలు.
ప్రాంతీయ అనుసంధానత పథకం - ఉండే దేశ్ కా ఆమ్ నాగరిక్ (RCS-UDAN) కింద కర్నూలు ఎయిర్ పోర్ట్‌లో విమాన కార్యకలాపాలు 28 మార్చి, 2021 నుంచి ప్రారంభం అవుతాయి. దక్షిణ భారత దేశంలోని ప్రధాన ప్రాంతాలైన బెంగుళూరు, విశాఖపట్నం, చెన్నైలకు నేరుగా విమాన కార్యకలాపాలు ఆ ప్రాంతాలను సన్నిహితం చేస్తాయి. ఈ మార్గాలను ఉడాన్ కింద విమానయాన శాఖ 4 బిడ్ ప్రక్రియల ద్వారా గత ఏడాది ఆమోదించింది. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్యకలాపాల భారాన్ని 80ః20 రేషియోలో విజిఎఫ్ ను కలిసి పంచుకుంటాయి. నేటి వరకు, ఉడాన్ పథకం కింద భారత దేశం నలుమూలల 56 ఆన్‌సర్వడ్, అండర్ సర్వడ్ విమానాశ్రయాలు (5 హెలికాప్టర్లు + 2 జల ఎయిరోడ్రోమ్‌లు సహా) 325 మార్గాలలో క్రియాశీలకం అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ న్యాయ రాజధాని కర్నూలు, దేశంలోని చారిత్రిక కేంద్రం కూడా. ఈ ప్రాంతం అక్కడి భారీ గుహలు, ఆలయాలకు పెట్టింది పేరు. తుంగభద్ర నది ఒడ్డున ఉన్న కర్నూలు నగరానికి నల్లమల పర్వత శ్రేణులు సమాంతరంగా ఉంటాయి. అంతేకాకుండా, నల్లమల అడవి, అహోబిలం, బేలం గుహలు, మహానంది, మంత్రాలయం, ఓర్వకల్, సంగమేశ్వరం, కేతవరం, కల్వబుగ్గ ప్రముఖ పర్యాటక కేంద్రాలు. స్థానిక ఆర్థిక, పర్యాటక వ్యవస్థలకు ఈ విమాన అనుసంధానత ప్రేరణను ఇచ్చి కర్నూలు ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుంది.
***
(Release ID: 1707574)
Visitor Counter : 177