ఆయుష్

రోగనిరోధక శక్తిని పెంచడంలో ఆయుష్ పాత్ర

Posted On: 23 MAR 2021 4:32PM by PIB Hyderabad

ప్రతి ఒక్కరి  రోగనిరోధక శక్తిని మెరుగుపర్చడంలో ఆయుష్ చికిత్సా విధానం ప్రాముఖ్యతను ప్రభుత్వం గమనించి,  ఈ విషయాన్ని ప్రజలకు వివరించడానికి వివిధ చర్యలు తీసుకుంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆరోగ్య ఉత్సవాలు, ప్రదర్శనలు, సెమినార్లు నిర్వహించింది. రోగనిరోధక శక్తిని పెంచడంతో సహా వ్యాధుల నివారణకు అవలంబించగలిగే సులభమైన పద్ధతుల గురించి అవగాహన పెంచడానికి మేళాలు ఏర్పాటు చేసింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో  ఆన్లైన్ సమావేశాల ద్వారా మంత్రిత్వ శాఖ తన పథకం.. ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ (ఐఈసీ) ను పునర్నిర్మించింది. ఈ విషయంలో తీసుకున్న చర్యల గురించి కింద వివరించబడమైనది.

1.కోవిడ్-19 నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలి,  ఆరోగ్యంగా ఎలా ఉండాలనే దానిపై ఆయుష్ మంత్రిత్వ శాఖ 29.01.2020 న సలహాలు జారీ చేసింది. ప్రజల సాధారణ రోగనిరోధక శక్తిని పెంచడంలో  ఆయుష్ పాత్ర  గురించి మరింత నిర్దిష్ట సూచనలతో అన్ని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు గత ఏడాది మార్చి ఆరున మంత్రిత్వ శాఖ ఒక లేఖ రాసింది.  రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం, రోగ నివారణ పద్ధతులు, ముఖ్యంగా శ్వాసకోశ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రత్యేక సూచనలతో గత మార్చి 31న మంత్రిత్వ శాఖ  మార్గదర్శకాలను జారీ చేసింది.

2.ఆయుష్   రిజిస్టర్డ్ ప్రాక్టీషనర్స్ పాటించాల్సిన మార్గదర్శకాలను రీసెర్చ్ కౌన్సిల్స్  నేషనల్ ఇన్స్టిట్యూట్స్ నిపుణుల బృందంతో తయారు చేయించింది.  ఆయుష్ మంత్రిత్వ శాఖ  ఇంటర్ డిసిప్లినరీ ఆయుష్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టాస్క్ ఫోర్స్ వీటిని పరిశీలించింది. కోవిడ్-19 మహమ్మారిని పారదోలడానికి ఏడు లక్షల మందికిపైగా రిజిస్టర్డ్ ఆయుష్ ప్రాక్టీషనర్ల ప్రయోజనం కోసం మార్గదర్శకాలను అందుబాటులో ఉంచారు.

3.ఆయుష్ మంత్రిత్వ శాఖ టాస్క్ ఫోర్స్  "ఆయుర్వేదం, యోగా ఆధారిత  నేషనల్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్" ను విడుదల చేసింది. ఇది ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) ఢిల్లీ, జామ్నగర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రెయినింగ్ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఆయుర్వేద  (ఐపిజిటిఆర్ఎ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్ఐఏ) జైపూర్, సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద (సిసిఆర్ఎఎస్), సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యోగా అండ్ నేచురోపతి (సిసిఆర్‌వైఎన్)  ఇతర జాతీయ పరిశోధనా సంస్థల నిపుణుల కమిటీ, ఇంటర్ డిసిప్లినరీ కమిటీ సిఫార్సుల మేరకు ఈ ప్రొటోకాల్ను తయారు చేశారు.

4.‘రోగనిరోధక శక్తి  కోసం ఆయుష్’ ప్రచార కార్యక్రమం:

ఆయుష్ మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టులో “ఆయుష్ ఫర్ ఇమ్యునిటీ” అనే మూడు నెలల సుదీర్ఘ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆయుష్ విధానంలో ఇంట్లోనే లభించే వస్తువుల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంపై ప్రజలకు అవగాహన కలిగింది.  ప్రచారం సందర్భంగా, సోషల్ మీడియా పోటీలు, ఆన్‌లైన్ ఉపన్యాసాలు  వర్చువల్ సెమినార్లు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఫలితంగా మరింత మందికి ఆయుష్ మంత్రిత్వ శాఖ చేరువయింది.  ఇది థీమ్ ఆధారిత ప్రచారం..గత ఏడాది వరుసగా సెప్టెంబర్, అక్టోబర్  నవంబర్  నెలలకు అహార్, విహార్  నిద్ర అనే మూడు నియమాల గురించి ఈ ప్రచారం వివరించింది.  ప్రజలలో అవగాహన కోసం మంత్రిత్వ శాఖ పరిధిలోని వివిధ సంస్థలు పలు కార్యకలాపాలను నిర్వహించాయి.

5.వర్చువల్ ప్లాట్‌ఫామ్‌లపై వెబ్‌నార్లను నిర్వహించం:

 ఆయుష్ మంత్రిత్వ శాఖ దాని సొంత ఆయుష్ వర్చువల్ కన్వెన్షన్ సెంటర్ (ఎవిసిసి) తో సహా వివిధ మాధ్యమాల ద్వారా వివిధ అంశాలపై వెబ్‌నార్లను నిర్వహించింది. రోగనిరోధక శక్తి అనే అంశంపై 2020 ఆగస్టు 14 నుండి మొత్తం ఆరు వెబ్‌నార్లు జరిగాయి.

6.కమ్యూనిటీ రేడియో కార్యక్రమం:

 గ్రామాలు, పట్టణాల్లో కమ్యూనిటీ రేడియో స్టేషన్ల (సిఆర్ఎస్) ద్వారా రోగనిరోధక శక్తికి సంబంధించిన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి కామన్వెల్త్ ఎడ్యుకేషనల్ మీడియా సెంటర్ ఫర్ ఆసియా (సిఇఎంసిఎ) సేవలను కూడా ఆయుష్ మంత్రిత్వ శాఖ ఉపయోగించుకుంది.   10/12/2020 నుండి 10/02/2021 వరకు రోజుకు రెండుసార్లు సీఆర్ఎస్ ద్వారా ఐదు నిమిషాల కార్యక్రమాన్ని ప్రసారం చేశారు.

7. మైగవ్ డాట్ ఇన్ సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై పోటీలు:

సమాచార వ్యాప్తి ఆసక్తికరంగా,  ఉల్లాసభరితంగా ఉండాలనే లక్ష్యంతో పోటీల నిర్వహణలోనూ ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రయోగాలు చేసింది. మై లైఫ్ మై యోగా పోటీ ఒక వాటర్‌షెడ్ కార్యక్రమం. దీనిలో భాగంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) 2020 సందర్భంగా 46,000 మంది తమ యోగా వీడియోలను అప్‌లోడ్ చేసి పోటీలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఈ పోటీలో పాల్గొనడానికి అవకాశం కల్పించారు.  ఆయుష్ మంత్రిత్వ శాఖ  సోషల్ మీడియా ఛానెల్స్, దాని స్వయంప్రతిపత్త సంస్థలు,  మైగవ్.ఇన్ వెబ్సైట్ కూడా రోగనిరోధక శక్తి అనే అంశంపై  వ్యాస రచన పోటీలు, క్విజ్, లఘుచిత్ర పోటీ మొదలైనవి నిర్వహించాయి.

8.కోవిడ్-19 సంబంధిత పరిష్కారాల గురించి వెబ్‌సైట్‌లో తాజా సమాచారం:

 ఆయుష్ మంత్రిత్వ శాఖ  దాని స్వయంప్రతిపత్తి సంస్థల వెబ్‌సైట్లు కూడా రోగనిరోధక శక్తికి సంబంధించిన పరిష్కారాల గురించి ఎప్పటికప్పుడు తాజాసమాచారాన్ని అప్లోడ్ చేస్తున్నాయి.

9.సంజీవని యాప్:

ఆయుష్ మంత్రిత్వ శాఖ తన మొబైల్ యాప్ ద్వారా ఆయుష్ సలహాలు, నివారణ చర్యల ప్రభావాన్ని మదింపు చేసింది. ఇందుకోసం 1.5 కోట్ల మందిపై అధ్యయనం చేసింది. కోవిడ్-19 నివారణ కోసం 85.1శాతం మంది ఆయుష్ పరిష్కారాలను ఉపయోగించి ప్రయోజనం పొందామని తెలిపారు.  

10.వీడియోల తయారీ: నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎఫ్‌డిసి) సహాయంతో, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ ఢిల్లీ) ‘కోవిడ్ దృక్పథం’  పేరుతో 17 నిమిషాల వీడియోను తయారు చేసింది. ప్రపంచ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ వీడియోను దేశవ్యాప్తంగా ప్రసారం చేశారు.

ఈ వివరాలన్నింటినీ ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయ రాష్ట్ర మంత్రి (అదనపు ఛార్జ్) కిరణ్ రిజిజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపారు. 

***


(Release ID: 1707150) Visitor Counter : 133


Read this release in: English , Urdu , Punjabi