ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లేఖ
కుంభ్ మేళ సందర్బంగా కోవిడ్-19 నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని గట్టిగా సూచన
Posted On:
21 MAR 2021 11:40AM by PIB Hyderabad
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కేంద్ర కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ ఉత్తరాఖండ్‌కు ప్రధాన కార్యదర్శి కి లేఖ రాస్తూ ఉన్నత స్థాయి కేంద్ర బృందం ఉత్తరాఖండ్ పర్యటన సందర్బంగా లేవనెత్తిన ఆందోళనను, కుంభ్ మేళ లో కోవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించడానికి కఠినమైన చర్యల ఆవశ్యకతను ప్రముఖంగా ప్రస్తావించారు.
హరిద్వార్‌లో కొనసాగుతున్న కుంభమేళ కోసం రాష్ట్రం చేపట్టిన వైద్య, ప్రజారోగ్య సంసిద్ధత చర్యలను సమీక్షించడానికి డైరెక్టర్ ఎన్‌సిడిసి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కేంద్ర బృందం 2021 మార్చి 16, 17 తేదీల్లో ఉత్తరాఖండ్‌ను సందర్శించింది.
గత కొన్ని వారాలలో 12 కి పైగా రాష్ట్రాలు కోవిడ్ -19 కేసుల పెరుగుదలను సూచించామని, కుంభమేళ సందర్భంగా హరిద్వార్ సందర్శించే యాత్రికులు కూడా ఈ రాష్ట్రాల నుండి వచ్చినవారని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అన్నారు. కుంభమేళ సందర్భంగా శుభ షాహి స్నాన్ సందర్బంగా స్థానిక జనాభాలో కేసులు పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
కేంద్ర బృందం నివేదిక ప్రకారం, ప్రతి రోజు 10-20 మంది యాత్రికులు మరియు 10-20 మంది స్థానికులకు పాజిటివ్ నమోదవుతున్నట్టు కార్యదర్శి వెల్లడించారు. ఈ పాజిటివిటీ రేటు కుంభ్ సమయంలో భారీగా వచ్చే వారి కారణంగా, కేసుల పెరుగుదలకు వేగంగా మారే అవకాశం ఉంది.
హరిద్వార్ లో నమోదైన రోజువారీ పరీక్ష సంఖ్యలు (అనగా 50,000 రాపిడ్ యాంటిజెన్ పరీక్షలు మరియు 5,000 ఆర్టిపిసిఆర్ పరీక్షలు) భారీ సంఖ్యలో యాత్రికుల వస్తున్నందున ఆ పరీక్షలు సరిపోవు అని రాష్ట్రానికి సమాచారం ఇచ్చారు. యాత్రికులు మరియు స్థానిక జనాభాకు తగిన విధంగా పరీక్షలు జరగాలని, నిర్ధారించడానికి ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆర్టిపిసిఆర్ పరీక్షల వాటాను గణనీయంగా పెంచాలని సూచించారు. ఈ క్రింది చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు: -
- ఎంఓహెచ్ఎఫ్డబ్ల్యూ జారీ చేసిన ఎస్ఓపి లను లోతుగా' అనుసరించాలి. ఈ ఎస్ఓపిల ప్రధాన అంశాలను వ్యాప్తి చేయడానికి కృషి చేయాలి.
- కోవిడ్-19 సూచించే లక్షణాల విషయంలో, ముఖ్యంగా స్థానిక ప్రజలు స్వచ్ఛందంగా నివేదించేలా అవగాహన పెంచండి
- అత్యవసర కార్యాచరణ కేంద్రాల ద్వారా ఏఆర్ఐ/ ఐఎల్ఐ కేసుల ధోరణిని పర్యవేక్షించడం ద్వారా జనాభా ఉన్న ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరిక సంకేతాలను రూపొందించడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి
- అధికంగా వ్యాపించడానికి అవకాశం ఉన్న సంభావ్య ప్రాంతాలలో గణనీయంగా మెరుగైన పరీక్ష లక్ష్యం కావలి
- కుంభ్ లోని పవిత్రస్నానం రోజులకు ముందు మరియు తరువాత ఫ్రంట్లైన్ కార్మికుల పరీక్షను నిర్వహించాలి.
- తగినంత క్లిష్టమైన సంరక్షణ చికిత్స సౌకర్యాల కార్యాచరణను నిర్ధారించుకోండి.
- కోవిడ్- తగిన ప్రవర్తనకు కట్టుబడి ఉండటానికి అన్ని రకాల మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించడం ద్వారా సమర్థవంతమైన రిస్క్ కమ్యూనికేషన్ ని సిద్ధం చేసుకోవాలి.
- కేసులు / సూపర్ స్ప్రెడర్ సంఘటనలు పెరిగినట్లయితే, ఎన్‌సిడిసితో సంప్రదించి జన్యు శ్రేణి కోసం నమూనాలను వెంటనే పంపండి.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ పైన పేర్కొన్న సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రం తీసుకుంటున్న ప్రజారోగ్య చర్యలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోరారు.
****
(Release ID: 1706506)
Visitor Counter : 252