శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
'సీఈఆర్‌టీ-ఇన్' హెచ్చరికపై స్పందించిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ; సైబర్ దాడులకు గురికాకుండా ఐటీ భద్రతను కట్టుదిట్టం చేసుకోవాలని రవాణా రంగ సంస్థలకు సూచన
Posted On:
21 MAR 2021 6:37PM by PIB Hyderabad
దేశ రవాణా రంగం లక్ష్యంగా సైబర్ దాడులు జరగొచ్చని, 'సీఈఆర్‌టీ-ఇన్' నుంచి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు హెచ్చరిక అందింది. ఈ నేపథ్యంలో, మౌలిక సదుపాయాల భద్రతను బలోపేతం చేసుకోవాలని రవాణా రంగం కిందకు వచ్చే విభాగాలు, సంస్థలకు మంత్రిత్వ శాఖ సూచనలు పంపింది.
దీనిప్రకారం; సీఈఆర్‌టీ-ఇన్ ధృవీకరించిన ఏజెన్సీల ద్వారా ఎప్పటికప్పుడు మొత్తం ఐటీ వ్యవస్థ భద్రతను తనిఖీ చేయించుకోవాలని, ఆ ఏజెన్సీలు సూచించిన ప్రకారం ముందుకెళ్లాలని ఎన్‌ఐసీ, ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌హెచ్‌ఐడీసీఎల్, ఐఆర్‌సీ, ఐఏహెచ్‌ఈ, రాష్ట్ర పీడబ్ల్యూడీలు, టెస్టింగ్ ఏజెన్సీలు, వాహన తయారీ సంస్థలకు మంత్రిత్వ శాఖ నుంచి సూచన అందింది. తనిఖీ నివేదిక, ఏటీఆర్ మంత్రిత్వ శాఖకు ఎప్పటికప్పుడు సమర్పించాలి.
***
(Release ID: 1706503)
Visitor Counter : 179