వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే 13.51% ఎక్కువ వరిని సేకరించారు

ప్రస్తుత కెఎంఎస్‌లో ఇప్పటివరకు 684.48 ఎల్‌ఎంటిల వరి సేకరించారు

పంజాబ్ ఒక్కటే 202.82 ఎల్‌ఎమ్‌టిని అందించింది. ఇది మొత్తం వరి సేకరణలో 29.63%

సుమారు 100.65 లక్షల మంది రైతులు ఇప్పటికే కొనసాగుతున్న కెఎంఎస్ సేకరణ కార్యకలాపాల నుండి రూ.1,29,230.20 కోట్ల లబ్ధి పొందారు.

ఖరీఫ్ 2020-21 మరియు రబీ 2021 కింద ఎంఎస్‌పిలో 3,49,437.15 ఎంటీల పప్పుధాన్యాలు మరియు నూనె గింజలు సేకరించబడ్డాయి

రూ .26,719.51 కోట్ల విలువైన 91,86,803 కాటన్ బేల్స్ 18,97,005 మంది రైతులకు లాభం చేకూర్చాయి

Posted On: 20 MAR 2021 6:58PM by PIB Hyderabad

ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కెఎంఎస్) 2020-21లో మునుపటి సీజన్లలో చేసినట్లుగా  ప్రస్తుతమున్న ఎంఎస్పి పథకాల ప్రకారం రైతుల నుండి ప్రభుత్వం  ఎంఎస్పి వద్ద ఖరీఫ్ 2020-21 పంటలను సేకరిస్తోంది.

ఖరీఫ్ 2020-21లో వరి సేకరణ సజావుగా కొనసాగుతోంది. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్‌ జమ్మూ&కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్‌, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, అస్సాం, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ మరియు త్రిపురలలో 19.03.2021 వరకు 684.48 ఎల్‌ఎమ్‌టిల వరిని కొనుగోలు చేశారు. ఇది గత ఏడాది 602.97 ఎల్‌ఎమ్‌టి కొనుగోలుతో పోలిస్తే 13.51% పెరుగుదల. మొత్తం 684.48 ఎల్‌ఎమ్‌టి కొనుగోలులో పంజాబ్ ఒక్కటే 202.82 ఎల్‌ఎమ్‌టిని అందించింది. ఇది మొత్తం సేకరణలో 29.63%.

సుమారు 100.65 లక్షల మంది రైతులు ఇప్పటికే కొనసాగుతున్న కెఎంఎస్ సేకరణ కార్యకలాపాల నుండి రూ.1,29,230.20 కోట్ల లబ్ధి పొందారు.


రాష్ట్రాల ప్రతిపాదన ఆధారంగా ధరల మద్దతు పథకం (పిఎస్ఎస్) కింద  తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోసం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 మరియు రబీ మార్కెటింగ్ సీజన్ 2021కు సంబంధించి 107.08 ఎల్ఎంటి పప్పుధాన్యాలు మరియు ఆయిల్ సీడ్స్ కొనుగోలుకు అనుమతి లభించింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలకు 1.23 ఎల్ఎంటి కొప్రా (శాశ్వత పంట) కొనుగోలుకు అనుమతి లభించింది. ఇతర రాష్ట్రాలు/ యుటిల కొరకు పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు కొప్రాలను పిఎస్ఎస్ క్రింద సేకరించే ప్రతిపాదనలను స్వీకరించినప్పుడు కూడా ఆమోదం లభిస్తుంది. తద్వారా ఈ పంటల యొక్క ఎఫ్‌ఏక్యూ గ్రేడ్ సేకరణను 2020-21 సంవత్సరానికి  హార్వెస్టింగ్ కాలంలో మార్కెట్ రేటు ఎంఎస్పి కంటే తక్కువగా ఉంటే రైతులు సెంట్రల్ నోడల్ ఏజెన్సీలు రాష్ట్ర నామినేటెడ్ ప్రొక్యూర్ ఏజెన్సీల ద్వారా సంబంధిత రాష్ట్రాలు / యుటిలలో నోటిఫైడ్ ఎంఎస్పి వద్ద రిజిస్టర్డ్ నుండి నేరుగా పొందవచ్చు.

19.03.2021 వరకు  ఖరీఫ్ 2020-21 మరియు రబీ 2021 కింద ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా 3,49,437.15ఎంటీల పెసర,మినప,కంది, గ్రామ్, వేరుశనగ మరియు సోయాబీన్లను రూ .1,870.55 కోట్ల ఎంఎస్పి విలువ వద్ద కొనుగోలు చేసింది. తద్వారా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, హర్యానా మరియు రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన 1,97,050 మంది రైతులు లబ్దిపొందారు.

అదేవిధంగా 19.03.2021 వరకూ రూ.52.40 కోట్ల ఎంఎస్‌పి విలువ కలిగిన 5089 మెట్రిక్ టన్నుల కొప్రా (శాశ్వత పంట) కొనుగోలు ద్వారా కర్ణాటక, తమిళనాడులోని 3961 మంది రైతులకు లబ్ధి చేకూరింది. పప్పుధాన్యాలు మరియు నూనె గింజల రాక ఆధారంగా సంబంధిత రాష్ట్రాలు నిర్ణయించిన తేదీ నుండి సంబంధిత రాష్ట్ర / యుటి ప్రభుత్వాలు సేకరణ ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.

పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో ఎంఎస్పి ఆధ్వర్యంలో సీడ్ కాటన్ (కపాస్) సేకరణ కార్యకలాపాలు సజావుగా జరుగుతున్నాయి. 19.03.2021 వరకు రూ .26,719.51 కోట్ల విలువైన 91,86,803 కాటన్ బేల్స్ కొనుగోళ్ల ద్వారా 18,97,005 మంది రైతులు ప్రయోజనం పొందారు.

***


(Release ID: 1706357) Visitor Counter : 177