ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

చండీగఢ్ లో వైద్య సౌకర్యాలు ప్రారంభించిన కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్ధన్

కోవిడ్ మీద పోరుకు తగినట్టు స్పందించిన వైద్య,శాస్త్ర నిపుణులకు అభినందన ’అందరికీ ఆరోగ్యం’ దిశగా విజయవంతమైన నమూనా సృష్టించాలని పిలుపు

Posted On: 20 MAR 2021 7:41PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఈ రోజు చండీగఢ్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో అనేక సౌకర్యాలను ప్రారంభించారు. సంస్థలోని వివిధ విభాగాలలో  పిల్లలకు, పెద్దలకు నోటి ఆరోగ్యానికి సంబంధించిన నేషన రిసోర్స్ సెంటర్ ను, అత్యాధునిక సిటి సౌకర్యాన్ని, వాస్క్యులార్ ఇంటర్వెన్షనల్ లాబ్ ను, రిఫ్రాక్టివ్ సర్జరీ సూట్  తదితర సౌకర్యాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, పిగిఐఎంఇఆర్ ను ఐదు ఉత్తరాది రాష్టాలకు ప్రత్యేక వైద్య సేవలందించే భారతదేశపు ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థగా అభివర్ణించారు. కోవిడ్ విసిరిన సవాళ్లను ఎదుర్కుంటూ సమయానికి తగినట్టు స్పందించినవైద్య నిపుణులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కోవిడ్ టీకాను అతి తక్కువ సమయంలోనే తయారుచేసిన ఘనత అభినందనీయమన్నారు.’అందరికీ ఆరోగ్యం’ దిశలో ప్రపంచాన్ని నడిపించటానికి ఒక ఆదర్శవంతమైన నమూనాని సిద్ధం చేయాలని, మిగిలిన సంస్థలకు మార్గదర్శకంగా నిలవాలని మంత్రి ఈ సంస్థలోని వైద్య వృత్తి నిపుణులకు పిలుపునిచ్చారు. శాస్త్రరంగాన్ని ఒక కొత్త మార్గంలో నడిపించాలని కూడా కోరారు.

ఒహెచ్ ఎస్ సి – పిజిఐఎంఇఆర్ గురించి మాట్లాడుతూ, చండీగఢ్ లో పిల్లలతోబాటు పెద్దలకు కూడా  నోటి ఆరోగ్యానికి సంబంధించి ఒక నమూనాగా మారాలన్నదే ఈ రిసోర్స్ సెంటర్ ధ్యేయమన్నారు. ఆ తరువాత ఇది జాతీయ నోటి ఆరోగ్య కార్యక్రమానికి అండగా నిలబడాలని ఆకాంక్షించారు. ఆ విధంగా ఈ నమూనా దేశమంతటా విస్తరిస్తుందన్నారు. ఒహెచ్ ఎస్ సి వలన దేశంలో నోటి జబ్బులు గణనీయంగా తగ్గగలవని డాక్టర్ హర్షవర్ధన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

చండీగఢ్ లోని పిజిఐఎంఇఆర్ లో  మార్చి 20న పిల్లలు, పెద్దల మౌఖిక ఆరోగ్య రక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్.  చిత్రంలో పిజిఐఎంఇఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ రామ్ ను కూడా చూడవచ్చు.  

ప్రపంచ నోటి ఆరోగ్య దినం సందర్భాన్ని ప్రస్తావిస్తూ, భారత ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా జాతీయ నోటి ఆరోగ్య కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి చెప్పారు. దీని ద్వారా చౌకగా నోటి ఆరోగ్య సౌకర్యం అందరికీ చేరువలో అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు.  త్వరలోనే జాతీయ నోటి ఆరోగ్య విధానాన్ని ప్రకటిస్తామని కూడా వెల్లడించారు.

చండీగఢ్ లోని పిజిఐఎంఇఆర్ లో  మార్చి 20న అత్యాధునిక పిఇటి-సిటి  కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్.  చిత్రంలో పిజిఐఎంఇఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ రామ్ ను కూడా చూడవచ్చు. 

కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక రోబోటిక్ పిఇటి-సిటి తో పనిచేసే పరికరం బయోప్సీలకోసం తీసే కురుపుల రియల్ టైమ్ 3డి చిత్రాలను అందించగలుగుతాయన్నారు. క్లిష్టమైన సర్జరీలలో ఎక్కువ రంధ్రం చేయాల్సిన అవసరం లేని, సూదుల వాడకం అవసరం లేని, మళ్ళీ మళ్ళీ స్కాన్ చేయాల్సిన అవసరంలేని విధంగా ఈ 3డి చిత్రాలు పనికొస్తాయన్నారు.  అత్యాధునిక వాస్క్యులార్ ఇంటర్వెన్షన్ లాబ్ గురించి ప్రస్తావిస్తూ, పిజిఐఎంఇఆర్ లో ఉన్న కాథ్ లాబ్ మొట్టమొదటిదన్నారు. హైటెక్ కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్ వలన ఇది గుండెపోటు వచ్చిన రోగుల చికిత్సను సంపూర్ణంగా మార్చివేస్తుందన్నారు.

 

చండీగఢ్ లోని పిజిఐఎంఇఆర్ లో  మార్చి 20న అత్యాధునిక వాస్క్యులార్ ఇంటర్వెన్షనల్ లాబ్ ను ప్రారంభిస్తున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్.  చిత్రంలో పిజిఐఎంఇఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ రామ్ ను కూడా చూడవచ్చు. 

ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ తెచ్చుకున్న 384 స్లైస్ , డ్యుయల్ సోర్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, అత్యంత వేగవంతమైన. అత్యాధునికమైన సిటి స్కాన్ యంత్రమని మంత్రి అభివర్ణించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు, ప్రమాదాల బారినపడినవారికి, ఊపిరి పట్టటంలో ఇబ్బంది పడే పిల్లలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

 

చండీగఢ్ లోని పిజిఐఎంఇఆర్ లో  మార్చి 20న డ్యుయల్ సోర్సెస్ సిటి స్కాన్ ను ప్రారంభిస్తున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్.  చిత్రంలో పిజిఐఎంఇఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ రామ్ ను కూడా చూడవచ్చు. 

సంస్థ ఇటీవలే తెచ్చుకున్న అత్యాధునిక  విసుమాక్స్ తక్కువ రంధ్రాలతోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కళ్ళద్దాలు ధరించే రోగులకు స్మైల్ విధానం ద్వారా కళ్ళద్దాలు అవసరం లేకుందా చేయగలుగుతారని డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు.

 

చండీగఢ్ లోని పిజిఐఎంఇఆర్ లో  మార్చి 20న రిఫ్రాక్టివ్ సర్జరీ సూట్ (స్మైల్) ను ప్రారంభిస్తున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్షవర్ధన్.  చిత్రంలో పిజిఐఎంఇఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్ రామ్ ను కూడా చూడవచ్చు
చండీగఢ్ పిజిఐఎంఇఆర్ బృందం మొత్తాన్ని మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. వివిధ విభాగాల అధిపతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పిజిఐఎంఇఆర్) 1962 లో ప్రారంభమైంది. పార్లమెంట్ చట్టం ప్రకారం ఈ సంస్థ స్వయం ప్రతిపత్తి పొందింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది.  

***


(Release ID: 1706355) Visitor Counter : 196


Read this release in: English , Urdu , Hindi , Punjabi