మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
సెక్స్ వర్కర్లకు పునరావాస పథకం
Posted On:
19 MAR 2021 2:51PM by PIB Hyderabad
వాణిజ్యపరమైన లైంగిక దోపిడీ కోసం అక్రమ మానవ రవాణా బాధితుల పునరావాసం, సమాజంలో తిరిగి ఏకీకరణం చేయడం, నివారణ కోసం ఉద్దేశించిన సమగ్రమై ఉజ్జ్వల పథకాన్ని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఆశ్రయం, పునరావవాస కేంద్రాలు కాపాడిన పిల్లలకు ప్రాథమిక అవసరాలైన ఆహారం, బట్ట, వైద్య సంరక్షణ, న్యాయ సాయం చేయడమే కాక, ప్రత్యామ్నాయ జీవనోపాధి అవకాశాలను కల్పించేందుకు విద్య, వొకేషనల్ శిక్షణను అందిస్తోంది.
ఈ సమాచారాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ శుక్రవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు.
***
(Release ID: 1706228)