మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
పిల్లలు మరియు మహిళల్లో పోషకాహార లోపం
Posted On:
19 MAR 2021 2:47PM by PIB Hyderabad
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ -4) ప్రకారం ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-3 తో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపం మరియు తక్కువ బరువు ప్రాబల్యం తగ్గాయి. గ్రామీణ ప్రాంతాల్లో 15-49 సంవత్సరాల పునరుత్పత్తి వయస్సు (డబ్ల్యూఆర్‌ఏ) గ్రూపు మహిళల్లో రక్తహీనత వ్యాప్తి కూడా తగ్గింది. పోషకాహార లోపం అనేది బహుళ ప్రభాల్య సమస్య. ఇది అనేక ఇతర కారణాలతో ప్రభావితమవుతుంది. గర్భిణీ స్త్రీలలో రక్తహీనత నవజాత శిశువు తక్కువ బరువుతో జన్మించే ప్రమాదాన్ని పెంచుతుంది.
ప్రభుత్వం జాతీయ ఆరోగ్య మిషన్‌కు చెందిన పునరుత్పత్తి మరియు పిల్లల ఆరోగ్య కార్యక్రమం క్రింద మహిళలు మరియు పిల్లల్లో పోషకాహారం మరియు రక్తహీనత సమస్య నివారణ కోసం వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా రక్తహీనత ముక్త్ భారత్ (ఎఎంబి) లక్ష్యంతో పనిచేస్తోంది. చిన్నపిల్లలకు ఆరు నెలల వయస్సు వచ్చే వరకూ తల్లి పాలు అందించడం అలాగే అతిసారం నివారణకు ఓఆర్ఎస్ మరియు జింక్ వాడకం 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలందరికీ అనుబంధ కార్యక్రమం విటమిన్ ఎ అందించడం వంటి కార్యక్రమాలు అమలు చేస్తోంది.
పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులలో పోషకాహార సమస్యలను పరిష్కరించడానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు మరియు స్త్రీ, శిశు మంత్రిత్వ శాఖల సంయుక్త చొరవతో గ్రామ ఆరోగ్య మరియు పోషకాహార రోజులు మరియు తల్లి మరియు పిల్లల రక్షణ కార్డు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. జనని సురక్ష యోజన (జెఎస్‌వై) పథకం ప్రజారోగ్య కేంద్రాల్లో ప్రసవానికి మహిళలను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా, జననై శిశు సురక్ష యోజన (జెఎస్‌ఎస్‌కె) కింద ప్రజారోగ్య కేంద్రాల్లో చికిత్స కోరుకునే శిశువులందరికీ ఆహారం, మందులు మరియు రవాణా ఉచితంగా అందించబడతాయి. రాష్ట్రీయ బాల్ స్వస్తియ కార్యక్రం (ఆర్‌బిఎస్‌కె) మరియు రాష్ట్రీయ కిషోర్ స్వస్యా కార్యక్రమ్ (ఆర్‌కెఎస్‌కె) కింద పిల్లలు మరియు కౌమారదశలో రక్తహీనతతో సహా పోషకాహార లోపాలను గుర్తించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ సమాచారాన్ని మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ స్మృతి జుబిన్ ఇరానీ ఈ రోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.
*****
(Release ID: 1706181)
Visitor Counter : 453